కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ (KIa Motors), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ (Kia Seltos) లో త్వరలోనే కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

త్వరలో జరగబోయే బుసాన్ మోటార్ షోలో కంపెనీ తమ కొత్త 2022 కియా సెల్టోస్ ఎస్‌యూవీని ప్రదర్శించడానికి ముందే, కియా డిజిటల్‌గా ఈ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలోనే భారత తీరాలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కియా సెల్టోస్ విషయానికి వస్తే, భారతదేశంలో ఈ సి-సెగ్మెంట్ ఎస్‌యూవీ చాలా విజయవంతమైన మోడల్‌గా ఉంది మరియు భారత కార్ మార్కెట్లో కియా ధృడంగా నిలబడటానికి గట్టి పునాది వేసింది. అయితే, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇటీవల స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ నుండి కొత్తగా వచ్చిన మోడళ్లు మరియు త్వరలో టొయోటా, మారుతి సుజుకి నుండి రాబోయే కొత్త కార్ల నేపథ్యంలో, కంపెనీ తమ సెల్టోస్ ను కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కియా సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ మోడల్‌ను కంపెనీ మరింత తాజాగా ఉంచడం ద్వారా తమ షోరూమ్‌లకు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని కియా మోటార్స్ భావిస్తోంది. ఇటీవలే, భారత రోడ్లపై కియా సెల్టోస్ టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కింది. కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క సిల్హౌట్ చాలావరకు దాని పాత మోడల్ ను పోలి ఉంటుంది. అయితే, ఇందులో అనేక కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

డిజిటల్‌గా బహిర్గతం చేయబడిన చిత్రాల ప్రకారం, కొత్త 2022 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లో కొత్త హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ మరియు స్టైలిష్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఇది చూడటానికి గంభీరంగా కనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లుగా, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ దాదాపుగా ఒకేలా ఉంటుంది మరియు 2022 కియా సెల్టోస్ యొక్క సైడ్ ప్రొఫైల్ లో కనిపించే ఏకైక మార్పు కొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్. ఈ పెద్ద అల్లాయ్ వీల్స్ వీల్ ఆర్చ్‌లను పూర్తిగా నింపినట్లుగా కనిపిస్తాయి మరియు ఎస్‌యూవీ యొక్క స్పోర్టినెస్‌ను కూడా పెంచుతాయి.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2022 సెల్టోస్ వెనుక వైపున పెద్ద ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌ ఉంటుంది మరియు అది క్రిందికి కొంచెం విస్తరించి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ రెండు టెయిల్‌ల్యాంప్‌లు ఇప్పుడు 'కియా' లోగోతో పూర్తి-వెడల్పు ఎల్ఈడి లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. లైట్ బార్ మధ్యలో. వెనుక భాగంలో సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉంటాయి. ఇవి ఈ ఎస్‌యూవీ యొక్క మొత్తం రూపాన్ని మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లోని ఎగ్జాస్ట్ టిప్స్ వెనుక బంపర్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ఇంటీరియర్ లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉ్ననాయి. ఇందులో కొత్త కలర్ మరియు ఫ్యాబ్రిక్ ఆప్షన్లు, రెండు పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్‌లు (ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం) ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్‌లో గేర్ సెలెక్టర్ లివర్ లేకపోవడం తదుపరి అత్యంత గుర్తించదగిన మార్పు. ఎందుకంటే యూనిట్ రోటరీ-స్టైల్ గేర్ సెలెక్టర్ నాబ్‌తో భర్తీ చేయబడినట్లుగా చిత్రాలలో కనిపిస్తోంది.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

అలాగే, అప్‌డేట్ చేయబడిన 2022 కియా సెల్టోస్ ఎస్‌యూవీ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వస్తుందని పుకార్లు కూడా వినిపిస్తు్ననాయి. ఎందుకంటే, ఈ ఫీచర్లు ఇప్పుడు దేశంలో మరింత ప్రమాణంగా మారాయి. ఇదే నిజమైతే, అప్‌డేట్ చేయబడిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), యాక్టివ్ లేన్ అసిస్టెన్స్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, డ్రౌవర్ డ్రౌజీనెస్ అలర్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ మొదలైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

అంతేకాకుండా, కియా 1.5-లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌ను మరింత ఆధునికమైన పెట్రోల్-హైబ్రిడ్ యూనిట్‌తో భర్తీ చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి, డీజిల్ పవర్‌ట్రెయిన్ భారతీయ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు ఇష్టమైనది మరియు హ్యుందాయ్ క్రెటాలో ఈ యూనిట్ అందించబడుతోంది కాబట్టి ఇది చాలా అసంభవం. అలాగే, కియా 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో సిఎన్‌జి ఎంపికను కూడా పరిచయం చేయవచ్చు. ఈ CNG మోడ్‌తో కూడిన ఈ ఇంజన్ ను కంపెనీ ఇప్పటికే భారతదేశంలోని కియా కారెన్స్ ఎమ్‌పివిలో పరీక్షిస్తోంది.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

ప్రస్తుతం, కియా సెల్టోస్ ఎస్‌యూవీ మూడు ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది. బేస్ ఇంజన్ 113bhp గరిష్ట శక్తి మరియు 144Nm గరిష్ట టార్క్‌తో 1.5-లీటర్ సహజంగా-స్పైరేటెడ్ పెట్రోల్ యూనిట్ కాగా, ఇందులో మరింత శక్తివంతమైన 1.4-లీటర్ టర్బోఛార్జ్‌డ్ యూనిట్ 138bhp గరిష్ట శక్తిని మరియు 242Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. మూడవ ఇంజన్ ఆప్షన్ 113bhp గరిష్ట శక్తి మరియు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ యూనిట్.

కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఆవిష్కరణ.. త్వరలో భారత మార్కెట్లో విడుదల!

కియా సెల్టోస్ లో ఐదు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT) లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, డీజిల్ పవర్‌ట్రెయిన్ మూడు గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. అయితే, ఇందులో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు బదులుగా, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. అలాగే, టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్‌ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో లభిస్తుంది.

Most Read Articles

English summary
Kia motors revealed its upcoming new 2022 kia seltos india launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X