భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని (Lamborghini) గడచిన 15 ఏళ్లుగా భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ పదిహేనేళ్ల కాలంలో కంపెనీ ఇక్కడి మార్కెట్లో మొత్తం 400 కార్లను విక్రయించింది. ఇటీవలే, లాంబోర్ఘిని భారతదేశంలో తమ 400వ కారు డెలివరీని పూర్తి చేసింది. కంపెనీ 2007 సంవత్సరంలో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. గత సంవత్సరంలో ఈ ఇటాలియన్ కంపెనీ భారతదేశంలో తమ లగ్జరీ కార్ల విక్రయాలలో అత్యధికంగా 86 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

లాంబోర్ఘిని 2019లో 52 యూనిట్ల గరిష్ట రికార్డును బద్దలు కొట్టి, 2021లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం నాటికి, కంపెనీ భారతదేశంలో 300వ యూనిట్ కార్లను డెలివరీ మైలురాయిని చేరుకోగా, ఇటీవలే ఉరుస్ ఎస్‌యూవీ యొక్క 100వ యూనిట్ డెలివరీ మైలురాయిని చేరుకుంది. గడచిన 2020 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ లాంబోర్ఘిని 50 ఉరుస్ లగ్జరీ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

అంతకు ముందు 2019 సంవత్సరంలో ఈ లగ్జరీ కార్‌మేకర్ భారతదేశంలో 65 యూనిట్ల ఉరస్ కార్లను విక్రయించింది, ఇది 2018 సంవత్సరంలోని విక్రయాలతో పోలిస్తే 30 శాతం పెరిగింది. లాంబోర్ఘిని ఇండియా గత సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారి ఉమ్లింగ్ లా పాస్ వద్ద సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో లాంబోర్ఘిని ఉరుస్‌ సూపర్ ఎస్‌యూవీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. తద్వారా మరింత మంది దృష్టిని ఆకట్టుకుంది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

ప్రస్తుతం, లాంబోర్ఘిని బ్రాండ్ నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఉరుస్ (Lamborghini Urus) ఎస్‌యూవీ అగ్రస్థానంలో ఉంది. నిజానికి, లాంబోర్ఘినీ స్పోర్ట్స్ కార్లు వాటి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉండవు. చిన్నపాటి స్పీడ్ బ్రేకర్లపై ప్రయాణిస్తే, వాటి బంపర్లు ఊడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారత్ వంటి మార్కెట్ల కోసం ఈ ఇటాలియన్ బ్రాండ్ తమ సరికొత్త మరియు మొట్టమొదటి ఎస్‌యూవీ అయిన లాంబోర్గిని ఉరుస్‌ను ప్రవేశపెట్టింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

లాంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది సెలబ్రిటీలే ఉన్నారు. వీరిలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. మొన్నా ఆ మధ్య ఆయన ఓ బ్లాక్ మ్యాట్ ఫినిష్డ్ లాంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఒకర్ని చూసి మరొకరు పోటీపడి మరీ ఈ సూపర్ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తున్నారు.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

భారతదేశంలో అమ్మకాల పరంగా లాంబోర్ఘిని బ్రాండ్ సాధించిన ఈ అరుదైన మైలురాయిని గుర్తించడానికి మరియు సూపర్-లగ్జరీ కార్ల విభాగంలో తన నాయకత్వ స్థానాన్ని ప్రదర్శించడానికి, లాంబోర్ఘిని ఇండియా తమ మూడవ ఎడిషన్ 'లాంబోర్ఘిని డే'ని ప్రారంభించింది. ఇది దేశంలోని తమ బ్రాండ్ కస్టమర్‌లకు ప్రత్యేకమైన జీవనశైలిని సృష్టించే లక్ష్యంతో రూపొందించబడింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

లాంబోర్ఘిని భారతదేశంలో తన విజయాన్ని జరుపుకోవడానికి గోవాలో లాంబోర్ఘిని డేని జరుపుకుంది. ఈ వేడుకకు చాలా మంది లాంబోర్ఘిని కస్టమర్లు తమ కార్లతో హాజరయ్యారు మరియు గోవాలోని అద్భుతమైన బీచ్‌లు మరియు సుందరమైన మార్గాల్లో డ్రైవ్ చేస్తూ ఆనందించారు. ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ అయిన లాంబోర్ఘిని 2021 లో ప్రపంచం వ్యాప్తంగా తన కార్ల అమ్మకాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

గత ఏడాది లాంబోర్ఘిని అత్యధిక సంఖ్యలో కార్లను డెలివరీ చేసింది. ఈ ఇటాలియన్ బ్రాండ్ గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 8,405 కార్లను విక్రయించింది. ఈ అమ్మకాల సంఖ్య కంపెనీ యొక్క 59 ఏళ్ల చరిత్రలోనే అత్యధికం మరియు 2020 సంవత్సరం కంటే 13 శాతం ఎక్కువ. లాంబోర్ఘిని ప్రోడక్ట్ లైనప్‌లో ఉరుస్ ఎస్‌యూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

ఈ కంపెనీ గత ఏడాది 5,021 యూనిట్ల ఉరుస్ ఎస్‌యూవీ లను విక్రయించింది. అంతేకాకుండా, 2,586 యూనిట్ల అమ్మకాలతో లాంబోర్ఘిని హురాకాన్ సెడాన్ ఈ బ్రాండ్ యొక్క రెండవ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఆ తర్వాతి స్థానంలో 798 యూనిట్లతో లాంబోర్ఘిని అవెంటడోర్ వి12 మూడవ స్థానంలో నిలిచింది

ఈ సందర్భంగా లాంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో తమ బ్రాండ్ 400 మంది కస్టమర్లకు చేరువైనందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని మరియు ఈ మైలురాయిని సాధించడం ద్వారా లంబోర్ఘిని డే అనుభవాన్ని గుర్తించడానికి కూడా ఆనందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో లాంబోర్ఘిని బ్రాండ్ ప్రయాణంలో తమ కస్టమర్‌లు తమకు ఎంతగానో మద్దతు ఇచ్చారని, భారత్‌లో లాంబోర్ఘిని బ్రాండ్‌ను నిర్వచించే విలువలను అనుభవించడానికి తమ ప్రస్తుత మరియు సంభావ్య కస్టమర్‌లకు వీలు కల్పించే ఏకైక ప్లాట్‌ఫారమ్‌లను అందించడాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

భారతదేశంలో 400 సూపర్‌కార్లను డెలివరీ చేసిన లాంబోర్ఘిని.. కొన్నవారంతా సెలబ్రిటీలే!!

లాంబోర్ఘిని ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

ఇదిలా ఉంటే, ఈ సూపర్ కార్ కంపెనీ ఇప్పుడు పెట్రోల్ కార్లను వదలి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, లాంబోర్ఘిని కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు రెడీ అయింది. నివేదికల ప్రకారం, లాంబోర్ఘిని తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారును 2027 సంవత్సరంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Lamborghini delivered 400 supercars in india reaches new milestore details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X