భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో: ధర రూ. 4.61 కోట్లు

ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ 'లంబోర్ఘిని' భారతీయ మార్కెట్లో 'హురాకాన్ స్టెరాటో' (Huracan Sterrato) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో ధర రూ. 4.61 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్‌గ్రేడ్స్ పొందింది. అయితే ఈ సూపర్ కారు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,499 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ కారుని 1,499 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుంది. అయితే ఈ కారు యొక్క డెలివరీలు 2023 వ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో

లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో ఇప్పుడు కొంత విస్తృతంగా ఉంది. ఇందులో భాగంగానే ముందు మరియు వెనుక ట్రాక్స్ వరుసగా 30 మిమీ మరియు 34 మిమీ వరకు పెరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 44 మిమీ వరకు పెరిగింది. అదే సమయంలో ఇది అల్యూమినియం ఫ్రంట్ అండర్‌బాడీ ప్రొటెక్షన్ మరియు రీన్‌ఫోర్స్డ్ సిల్స్‌తో పాటు రూఫ్-మౌంటెడ్ ఎయిర్ ఇన్‌టేక్‌ను పొందుతుంది, కావున ఇది చాలా హుందాగా అనిపిస్తుంది.

లంబోర్ఘిని హురాకాన్ స్టెరాటో ఇప్పుడు అప్డేటెడ్ వెహికల్ డైనమిక్ ప్యాక్ లేదా లంబోర్ఘిని ఇంటిగ్రేటెడ్ వెహికల్ డైనమిక్స్ వంటి వాటిని పొందుతుంది. ఇది మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. అవి స్ట్రాడా, స్పోర్ట్ మరియు ర్యాలీ మోడ్స్. అప్డేటెడ్ స్ట్రాడా (స్ట్రీట్) మరియు స్పోర్ట్ మోడ్‌లు ఈ మోడల్‌కి ప్రత్యేకమైనవి. అయితే తక్కువ-ట్రాక్షన్ ఉపరితలాల కోసం సరికొత్త ర్యాలీ మోడ్ అనుకూలంగా ఉంటుంది.

హురాకాన్ స్టెరాటో యొక్క సైడ్ ప్రొఫైల్ లో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది కస్టమ్ బ్రిడ్జ్‌స్టోన్ డ్యూలర్ AT002 టైర్‌లను పొందుతుంది. అదే సమయంలో ముందు వైపు 235/40-R19 మరియు వెనుక వైపు 285/40-R19 డ్యూయెల్ పర్పస్ టైర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా హురాకాన్ స్టెరాటో యొక్క పనితీరుని పెంచడంలో సహాయపడతాయి. కావున తప్పకుండా ఇది వినియోగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

ఈ సూపర్ కారులో 5.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 602 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 560 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు రియర్ మెకానికల్ సెల్ఫ్-లాకింగ్ డిఫరెన్షియల్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

లంబోర్ఘిని స్టెరాటో 3.4 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గరిష్టంగా గంటకు 260 కిలోమీటర్ల వరకు ఉంది. కాగా గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 9.8 సెకన్లు. ఈ కొత్త సూపర్ కారు ఇటాలియన్ జెండా రంగులను అనుకరిస్తూ గ్రీన్ మరియు రెడ్ కలర్స్ తో కూడిన వైట్ పెయింట్ స్కీమ్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ స్టెరటో ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. స్టెరటో ప్రపంచ మార్కెట్లో 'పోర్స్చే 911 డాకర్‌' కు ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Lamborghini huracan sterrato launched price features and details
Story first published: Saturday, December 10, 2022, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X