దేశీయ మార్కెట్లో విడుదలైన రూ. 4.22 కోట్ల లంబోర్ఘిని కారు: ఇక్కడ చూడండి

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ 'లంబోర్ఘిని' భారతీయ మార్కెట్లో 'ఉరుస్ పెర్ఫార్మంటే' సూపర్ ఎస్‌యువి లాంచ్ చేసింది. ఈ ఎస్‌యువి ప్రారంభ ధరలు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే' (Lamborghini Urus Performante) మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా తేలికైనది ఉంటుంది, మరియు మంచి స్పోర్టియర్ వెర్షన్ గా కూడా. కావున అద్భుతమైన పనితీరుని అందించగలదు. ఈ కారణంగా తప్పకుండా ఈ కొత్త సూపర్ అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

రూ. 4.22 కోట్లు ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే లాంచ్

కొత్త ఉరుస్ పెర్ఫార్మంటే మునుపటి అదే 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ సాధారణ ఉరుస్ కంటే 16 బిహెచ్‌పి పవర్ (657 బిహెచ్‌పి పవర్) ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. టార్క్ (850 ఎన్ఎమ్ టార్క) లో ఎటువంటి మార్పులు ఉండదు. ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇది శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు. ఇది స్టాండర్డ్ లంబోర్ఘిని ఉరుస్ కంటే కూడా 0.3 సెకన్లు వేగంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది గంటకు 0 నుండి 200 కిమీ వేగాన్ని చేరుకోవడానికి కేవలం 11.5 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.

రూ. 4.22 కోట్లు ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే లాంచ్

కొత్త 'లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే' యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపుగా స్టాండర్డ్ మోడల్ మాదిరి అనిపించినప్పటికీ ఇందులో కొన్ని సూక్ష్మ అప్డేట్స్ చూడవచ్చు. ఇందులో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన రియర్ బంపర్ మరియు డిఫ్యూజర్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది తేలికపాటి అక్రాపోవిక్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

అదే సమయంలో కొత్త 'లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే' బరువును దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ చేయడానికి ఇందులో కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. కావున ఇందులో కొత్త కార్బన్ ఫైబర్ బానెట్, వీలర్‌చెస్, రియర్ డిఫ్యూజర్ మరియు కొత్త రియర్ వింగ్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో ఆప్సనల్ 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ దీని ఆకర్షణను మరింత పెంచడంలో సహాయపడతాయి.

రూ. 4.22 కోట్లు ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే లాంచ్

ఇంటీరియర్ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. సీట్లు, డోర్స్ మరియు రూఫ్ లైనింగ్‌పై 'పెర్ఫార్మంటే' బ్యాడ్జ్‌లు చూడవచ్చు. అదే సమయంలో ఇది మెరుగైన ఆఫ్ రోడ్ హ్యాండ్లింగ్ కోసం ప్రస్తుతం ఉన్న స్ట్రాడా (స్ట్రీట్), స్పోర్ట్ మరియు కోర్సా (ట్రాక్) మోడ్‌లతో పాటు కొత్త 'ర్యాలీ' మోడ్‌తో వస్తుంది. అయితే ఇది టెర్రా (డర్ట్), సబ్బియా (సాండ్), మరియు నెవ్ (స్నో) డ్రైవింగ్ మోడ్స్ కోల్పోతుంది.

కొత్త లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే దాని మునుపటి మోడల్ కంటే 16 మిమీ తక్కువ వెడల్పు, 25 మిమీ ఎక్కువ పొడవును పొందుతుంది. ఈ SUV కోసం కంపెనీ పిరెల్లి పి జీరో ట్రోఫియో R టైర్‌లను (ముందు 285/40 R22 మరియు వెనుక 325/35 R22) ఉపయోగించింది. ఇది దేశీయ మార్కెట్లో ఆడి ఆర్ఎస్ క్యూ8, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Lamborghini launched new urus performante super suv in india
Story first published: Friday, November 25, 2022, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X