భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారును డిస్‌కంటిన్యూ చేస్తున్నట్లు గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. అప్పటి నుండి కంపెనీ ఈ కారు కోసం ఉన్న పెండింగ్ ఆర్డర్లను క్లియర్ చేస్తూ వస్తోంది. తాజాగా, పోలో కారు యొక్క చివరి యూనిట్ ను ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే డెలివరీ చేసింది. దీంతో ఇకపై భారతదేశంలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయినట్లు అయింది. భారతదేశంలోని చివరి పోలో కారు డెలివరీ కోసం తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

ఈ వీడియోలో భారతదేశంలోని చివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు ఓ డీలర్‌షిప్ నుండి డెలివరీ చేయబడటాన్ని చూడవచ్చచు. ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క చివరి యూనిట్ ను హర్యానాలోని బల్లాబర్హ్‌కు చెందిన ఓ కస్టమర్ కు డెలివరీ చేశారు. ఈ చివరి యూనిట్ ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క లెజెండ్ కిట్‌ను కలిగి ఉంది. సిల్వర్ కలర్ బాడీ పెయింట్ తో ఉన్న ఈ లెజెండ్ కిట్ లో రూఫ్ కోసం బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంది మరియు బూట్ లిడ్ పై బ్లాక్ గార్నిష్, సైడ్ బాడీ డీకాల్స్ మరియు లెజెండ్ బ్యాడ్జ్ లు ఇందులో ఉన్నాయి.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

పోలో భారతదేశంలో ఈ జర్మన్ కార్ బ్రాండ్ అత్యధికంగా అమ్ముడైన కారు కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఫోక్స్‌వ్యాగన్ కారును 2010లో తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఫోక్స్‌వ్యాగన్ పోలో ఒకటి. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లకు గట్టి పోటీని ఇచ్చింది.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

యూరోపియన్ డిజైన్‌తో వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ పోలో అద్భుతమైన పనితీరును కలిగి ఉండటమే కాకుండా, అధునాత ఫీచర్లను కూడా కలిగి ఉంది. భారత మార్కెట్లో పోలో కారుకి ఇప్పటికీ బలమైన డిమాండ్ ఉంది, అయితే కంపెనీ తమ కొత్త మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా ఈ కారును దేశీయ మార్కెట్ నుండి తొలగించి వేసింది. భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో యొక్క 12 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది కస్టమర్లను దక్కించుకుంది. అలాంటి పాపులర్ కారు ఇప్పుడు కేవలం సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

ఫోక్స్‌వ్యాగన్ చివిరగా డెలివరీ చేసింది పోలో కంఫర్ట్‌లైన్ ఎమ్‌పిఐ వేరియంట్. ఈ వేరియంట్ వివిధ ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. ఇందులో 2-డిన్ ఆడియో సిస్టమ్, 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, వెనుక సీట్లలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, రివర్స్ కెమెరా, ఫాగ్ లైట్లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రూఫ్ స్పాయిలర్ మరియు 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో అందించబడ్డాయి.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

దేశీయ విపణిలో ఫోక్స్‌వ్యాగన్ పోలో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.0 లీటర్, త్రీ సిలిండర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ ఎంట్రీ-లెవల్ ట్రెండ్‌లైన్ మరియు కంఫర్ట్‌లైన్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, రెండవది 1.0 లీటర్, 3 సిలిండర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

పోలో లెజెండ్ ఎడిషన్ వేరియంట్ లో స్టాండర్డ్ పోలో జిటి టిఎస్ఐ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు లభిస్తాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 3 లక్షలకు పైగా యూనిట్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

చివరిగా విక్రయించబడిన ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ కేవలం 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇందులోని TSI సాంకేతికత మరియు మైలేజ్‌ల మధ్య మంచి సమతుల్యతను సాధిస్తుందని కంపెనీ గతంలో వెల్లడించింది.

భారత్‌లో చిట్టచివరి ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు డెలివరీ.. ఇక ఈ కారు పూర్తిగా డిస్‌కంటిన్యూ అయినట్లే..

పోలో ఈ జర్మన్ కార్ బ్రాండ్ నుండి భారత మార్కెట్లో లభ్యమయ్యే అత్యంత సరసమైన మోడల్‌లలో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌ లను స్టాండర్డ్‌ పీచర్ గా అందించిన అతికొద్ది మోడళ్లలో ఫోక్స్‌వ్యాగన్ పోలో కూడా ఒకటి. ఈ కారు కోసం 2014 లో నిర్వహించిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ‌ను కూడా దక్కించుకుంది మరియు ఇప్పటికీ దేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారు లభిస్తే మిస్ చేసుకోకండి.

Most Read Articles

English summary
Last volkswagen polo in india finds a home now its completely sold out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X