Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 17 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Lexus బ్రాండ్ నుంచి రానున్న మరో కొత్త SUV.. టీజర్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) భారతీయ మార్కెట్లో తన కొత్త SUV ఎన్ఎక్స్ 350హెచ్ (NX 350h) విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కొత్త SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే ఫ్రీ బుకింగ్స్ ప్రారంభించింది. కావున ఇది త్వరలో మార్కెట్లో విడుదలవుతుంది. డెలివరీలు కూడా త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి.

లెక్సస్ (Lexus) ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త SUV ఎన్ఎక్స్ 350హెచ్ (NX 350h) యొక్క టీజర్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ SUV ని గత ఏడాది జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. ఇది టయోటా యొక్క న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్‌ఫారమ్ యొక్క GA-K వెర్షన్ ఆధారంగా రూపొందించబడింది. కావున చాలా స్టైలిష్ గా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త Lexus NX 350h అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ SUV ముందు భాగంలో బ్లాక్-అవుట్ స్పిండిల్ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడీ DRL వంటి వాటిని పొందుతుంది. ఈ కొత్త కారు యొక్క బంపర్‌పై చిన్న ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్ వంటివాటిని కూడా ఏర్పాటు చేశారు. కారు హుడ్ నుండి బంపర్ వరకు పెద్ద గ్రిల్ ఉంటుంది. అదే రేడియేటర్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

త్వరలో రానున్న ఈ కొత్త కారు యొక్క వెనుక భాగంలో స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు అందించబడ్డాయి. ఇవి బూట్ డోర్ వద్ద సన్నని లైట్ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉంటాయి. బూట్ డోర్‌పై 'లెక్సస్' బ్యాడ్జింగ్ కూడా మీరు చూడవచ్చు. కంపెనీ బ్రాండింగ్ లైసెన్స్ ప్లేట్ పైన ఉంచబడింది, ఇది లెక్సస్ యొక్క తరువాతి తరంని సూచిస్తుంది.

కొత్త Lexus NX 350h SUV యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 4,661 మిమీ పొడవు, 1,865 మిమీ వెడల్పు, 1,661 మిమీ ఎత్తు మరియు 2690 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. కావున వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

Lexus NX 350h SUV యొక్క ఇంటీరియర్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది Tazuna కాన్సెప్ట్ ఆధారంగా క్యాబిన్ డిజైన్‌ను పొందింది. ఇది యాపిల్ కార్ప్లై మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటి మద్దతుతో 9.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 14 ఇంచెస్ నావిగేషన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10-స్పీకర్ లెక్సస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా పొందుతుంది.

లెక్సస్ నుండి రానున్న ఈ కొత్త SUV చాలా వరకు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఇ-లాచ్ సిస్టమ్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, పనోరమిక్ వ్యూ మానిటర్, రిమోట్ ఫంక్షన్‌తో అడ్వాన్స్‌డ్ పార్క్ అసిస్ట్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్, ప్రీ-క్రాష్ సేఫ్టీ మరియు ఫ్రంట్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

అంతే కాకూండా.. ఇందులో రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.
Lexus NX 350h SUV యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ డ్రైవ్‌తో 2.5-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 236 Bhp పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (ECVT) మరియు నాలుగు చక్రాలకు శక్తిని పంపే పాడిల్ షిఫ్టర్‌లతో జత చేయబడింది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

లెక్సస్ బ్రాండ్ కార్లు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందాయి. కావున కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. ఇప్పుడు కంపెనీ Lexus NX 350h అనే మరో SUV ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.