లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) తమ నెక్సాన్ ఈవీ (Nexon EV) లో బ్యాటరీ సాయంతో ఎక్కువ దూరం ప్రయాణించే లాంగ్ రేంజ్ వేరియంట్‌ను నేడు (మే 17, 2022) మార్కెట్లో విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) అనే పేరుతో మార్కెట్లో విడుదలైన కొత్త వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

రెండు వేరియంట్లు.. రెండు చార్జర్లు..

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ను రెండు వేరియంట్లు మరియు రెండు రకాల చార్జర్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఇందులో XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ వీటిని 3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌తో విక్రయిస్తోంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ మరియు చార్జ్ ఆప్షన్ ను బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి. వేరియంట్లు మరియు చార్జర్ల వారీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Nexon EV Max Charger Option Price
XZ+ 3.3 kW ₹17.74 Lakh
XZ+ 7.2 kW AC Fast Charger ₹18.24 Lakh
XZ+ Lux 3.3 kW ₹18.74 Lakh
XZ+ Lux 7.2 kW AC Fast Charger ₹19.24 Lakh
లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

కాస్మెటిగ్ అప్‌గ్రేడ్స్..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఓవరాల్ డిజైన్ మాత్రం దాని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, వాటి నుండి ఈ లాంగ్ రేంజ్ వేరియంట్‌ను వేరు చేయడానికి కంపెనీ ఇందులో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఈ కారులో ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎక్స్టీరియర్‌లో నీలిరంగు (లైట్ బ్లూ కలర్) హైలైట్‌లు కనిపిస్తాయి. ఈ బ్లూ కలర్ యాక్సెంట్స్ దీనిని ఎలక్ట్రిక్ కారుగా సూచిస్తాయి. కొత్త నెక్సాన్ EV MAX ఇప్పుడు కొత్త ఇంటెన్సి-టీల్ అనే సిగ్నేచర్ బాడీ కలర్‌లో లభిస్తుంది. ఇక ఇందులోని ఇతర కలర్ ఆప్షన్లలో డేటోనా గ్రే మరియు ప్రిస్టీన్ వైట్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

పాత మోడల్ కన్నా 30 ఎక్కువ ఫీచర్లు..

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీతో పోలిస్తే, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇప్పుడు కొత్తగా 30 అదనపు ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. ఈ ఫీచర్లలో పైన పేర్కొన్న వాటికి అదనంగా ఇందులో మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్‌ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్, సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్, ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

ఇవే కాకుండా, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో I-VBAC (ఇంటెలిజెంట్ - వాక్యూమ్-లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

ఎక్కువ పవర్.. ఎక్కువ రేంజ్..

కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇప్పుడు పెద్ద 40.5kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇది ఎక్కువ రేంజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్ ని అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్ నెక్సాన్ పూర్తి చార్జ్ పై కేవలం 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను మాత్రమే అందిస్తుంది. అంటే, స్టాండర్డ్ మోడల్ నెక్సాన్ ఈవీతో పోల్చుకుంటే, ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అదనంగా 125 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో 141 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ AC మోటార్ ఉంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో కూడా ఇదే సెటప్ ఉంటుంది. అయితే, పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 140 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

టాటా మోటార్స్ ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో మల్టీ-మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో రీజెన్ బ్రేకింగ్ యొక్క నాలుగు వేర్వేరు స్థాయిలు ఉన్నాయి, ఇవి రీజెన్ లేని స్థాయి నుండి వన్-పెడల్ మోడ్ వరకు ఉంటాయి. ఫలితంగా, ఇది డ్రైవర్‌లను తమ కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను కేవలం 1 పెడల్‌తో డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా, బ్రేక్ వేసిన ప్రతిసారి వచ్చే శక్తి, బ్యాటరీను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) విడుదల: ధర రూ.17.74 లక్షలు

ఇక వారంటీ విషయానికి వస్తే, టాటా మోటార్స్ మునుపటిలానే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ రెండింటికీ 8 సంవత్సరాలు లేదా 1,60,00 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందిస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్ రెండూ కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జర్లను సపోర్ట్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వేగవంతమైన 50kW DC ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కొత్త 7.2kWh AC ఛార్జర్‌ సాయంతో అయితే బ్యాటరీ ప్యాక్‌ని ఇంటి వద్దనే పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Long range tata nexon ev max launched in india price sepcs battery range and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X