బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

మనదేశంలో కార్ అనేది ఓ సెంటిమెంట్, మధ్య తరగతి కుటుంబాలకైతే ఇదొక గొప్ప విషయం. మనదేశంలో నలుగురు ప్రయాణించే చిన్న కార్లకు డిమాండ్ ఎక్కువ. కానీ, నిజానికి భారతదేశంలో ఒక ఇంటిలో నలుగురి కంటే ఎక్కువ మంది నివసించే పెద్ద కుంటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారి కోసం కార్ కంపెనీలు ఎమ్‌పివి విభాగంలో మంచి ఫ్యామిలీ కార్లను విక్రయిస్తున్నాయి. 6-సీట్ల నుండి 9-సీట్ల వరకూ సామర్థ్యం కలిగిన ఎమ్‌పివిలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈనాటి మన కథనంలో ఆ బెస్ట్ టాప్ 5 ఫ్యామిలీ కార్స్ ఏంటో చూద్దాం రండి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

1. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6)

మారుతి సుజుకి అందిస్తున్న బెస్ట్ ఎమ్‌పివిలలో ఎక్స్ఎల్6 కూడా ఒకటి. ఇది పాపులర్ ఎర్టిగా ఎమ్‌పివి ఆధారంగా తయారు చేయబడిన 6-సీటర్ వెర్షన్. ఇందులో మొదటి వరుసలో సౌకర్యవంతమైన సీట్లు మరియు రెండవ వరుసలో ఇద్దరు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేసిన కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో రెండు సీట్లు ఉంటాయి. ఇందులో 1462cc, ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది, ఇది 101.6 బిహెచ్‌పి శక్తిని మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎమ్‌పివిలో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. మార్కెట్లో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివి ధరలు రూ. 11.29 లక్షల నుండి రూ. 14.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

2. కియా కారెన్స్ (Kia Carens)

మీ బడ్జెట్ రేంజ్ కొంచెం పెద్దదైనట్లయితే, మీరు ఎక్స్ఎల్6 కన్నా ప్రీమియంగా ఉండే కియా కారెన్స్ ను ఎంచుకోవచ్చు. ఇది ఈ విభాగంలో లేటెస్ట్ గా వచ్చిన మోడల్. అనేక అధునాతన ఫీచర్లను మరియు విభిన్నమైన ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇది 6-సీట్లు లేదా 7-సీట్ల కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది. కియా కారెన్స్ 1.5-లీటర్ స్టాండర్డ్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో దీని ధరలు రూ. 9.60 లక్షల నుండి రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

కియా కారెన్స్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

3. టొయోటా ఇనోవా క్రిస్టా (Toyota Innova Crysta)

ఎమ్‌పివి విభాగంలో తిరుగులేని మోడల్ టొయోటా ఇన్నోవా, ఇందులో లేటెస్ట్ జెనరేషన్ మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా. ఇది బెస్ట్ ఫ్యామిలీ కారుగా ఉంటుంది. మిడ్-రేంజ్‌లో ఉండే ఈ ప్రీమియం ఎమ్‌పివి సౌకర్యంతో పాటు విలాసాన్ని కూడా అందిస్తుంది. ఇది 2005లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది, అప్పటి నుండి ఇది ఈ విభాగంలో రారాజుగా అగ్రస్థానంలో ఉంటోంది. ఇన్నోవాకి పోటీగా ఎన్ని మోడళ్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, అవి దాని ముందు నిలబడలేకపోయాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

కొత్త తరం టొయోటా ఇన్నోవా క్రిస్టా 2016లో భారత మార్కెట్లో విడుదల చేయబడింది. కాగా, కంపెనీ ఇటీవలే ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను 2021లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ మునుపటి తరం మోడళ్ల కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా ధరలు రూ. 17.86 లక్షల నుండి రూ. 25.68 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

4. కియా కార్నివాల్ (Kia Carnival)

కొరియన్ కార్ బ్రాండ్ కియా అందిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి కియా కార్నివాల్. కంపెనీ ఈ మోడల్ ను తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. ఇది ఆరు నుండి 9 సీట్ల వరకూ వివిధ రకాల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కియా తమ ఇతర కార్ల మాదిరిగా ఈ ఎమ్‌పివిని ఇక్కడ తయారు చేయడం లేదు. ఫలితంగా, ఈ ఎమ్‌పివి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది 2.2-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 197బిహెచ్‌పి పవర్ మరియు 440ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

కియా కార్నివాల్ లో లభించే ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో 8- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, OTA మ్యాప్ అప్-డేట్, UVO సపోర్ట్, ECM మిర్రర్, వెనుక ప్రయాణీకులకు సింగిల్ 10.1-అంగుళాల డిస్‌ప్లే మరియు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, హార్మన్ కార్డాన్ ప్రీమియం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు ప్రీమియం వుడ్ గార్నిష్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. మార్కెట్లో దీని ధరలు రూ. 29.99 లక్షల నుండి రూ. 34.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

5. టొయోటా వెల్‌ఫైర్ (Toyota Wellfire)

టొయోటా వెల్‌ఫైర్ ఒక లగ్జరీ ఎమ్‌పివి, ఇది ఒకే వేరియంట్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. టొయోటా దీనిని విదేశాల్లో తయారు చేసి, ఇక్కడికి దిగుమతి చేసుకుంటుంది, ఫలితంగా దీని ధర కూడా సుమారు కోటి రూపాయల వరకూ ఉంటుంది. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.90.80 లక్షలుగా ఉంది. ఇందులో శక్తివంతమైన 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ 198 bhp శక్తిని మరియు 235 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదొక హైబ్రిడ్ మోడల్, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు కూడా ఉంటాయి.

బెస్ట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇవిగో టాప్ 5 బెస్ట్ ఎమ్‌పివిలు

వెల్‌ఫైర్ లోపలి భాగంలోని రెండవ వరుసలో ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల రెండు VIP సీట్లు ఉంటాయి. ఈ సీట్లకు వెంటిలేషన్ ఫీచర్, లెగ్ రెస్ట్, రిక్లైనబుల్ బ్యాక్‌రెస్ట్ మరియు మెమరీ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ లగ్జరీ ఎమ్‌పివిలో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, వెనుక ప్యాసింజర్ల వినోదం కోసం 13 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, JBL సౌండ్ సిస్టమ్, రెండవ మరియు మూడవ వరుసలకు సన్ బ్లైండ్‌లు, 16 రకాల యాంబియెంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Looking for a big family car here is the list of top 5 best mpvs in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X