బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

ఆటోమేటిక్ కార్లు నడపడానికి చాలా సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రత్యేకించి వాహన రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో తరచూ క్లచ్, బ్రేక్, యాక్సిలేరటర్ పెడల్స్ ను ఉపయోగిస్తూ గేర్లను మార్చుతూ డ్రైవ్ చేయడం చాలా చిరాకుని కలిగిస్తుంది. అయితే, ఇదే పరిస్థితులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను డ్రైవ్ చేయడం ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఆటోమేటిక్ కార్లకే కొనుగోలుదారులు ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు, ఇలాంటి దేశాలలో మ్యాన్యువల్ కార్లు చాలా అరుదుగా కనిపిస్తాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

అయితే, భారతదేశంలో మాత్రం మ్యాన్యువల్ కార్లదే పైచేయి. కానీ, ఇటీవలి కాలంలో ఆటోమేటిక్ కార్లు కూడా క్రమంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. దీంతో ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఆటోమేటిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, తయారీదారులు కూడా ఇప్పుడు కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను తయారు చేయడం ప్రారంభించాయి.

మరి ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన టాప్ 5 ఆటోమేటిక్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేది ఎస్‌యూవీ టైప్ బాడీ లాంగ్వేజ్ కలిగిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్. మారుతి సుజుకి భారత మార్కెట్లో రెనో క్విడ్‌కు పోటీగా ఈ మోడల్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్, 3 సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి యూనిట్‌లు ఉన్నాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతి సుజుకి ఎస్-ప్రెసో కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో యొక్క ఆటోమేటిక్ వేరియంట్ ధరలు 5.04 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

రెనో క్విడ్ (Renault Kwid)

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ రెనో క్విడ్. ఇది ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్‌కు భారతదేశంలో మంచి గేమ్-ఛేంజర్‌ మోడల్ గా నిలిచింది. ఇది ఎంట్రీ-లెవల్ మోడల్ అయినప్పటికీ, కంపెనీ ఈ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, గైడ్‌లైన్స్ తో కూడిన రివర్సింగ్ కెమెరా, ఎల్ఈడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ రికగ్నిషన్ మరియు డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ వంటి ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లలో కనిపించని అనేక ఫీచర్లు ఇందులో ఉంటాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

రెనో క్విడ్ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని బేస్ వెర్షన్ 0.8-లీటర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 53.26 బిహెచ్‌పి గరిష్ట్ పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో పవర్‌ఫుల్ 1.0 లీటర్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇది 67 బిహెచ్‌పి పవర్ ను మరియు 91ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ 1.0-లీటర్ ఇంజన్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో కూడా లభిస్తుంది. మార్కెట్లో ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ. 5.74 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభమవుతాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ నుండి లభిస్తున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో. పొడవాటి బాక్సీ టైప్ బాడీ డిజైన్ తో ఇది ఓ మంచి ఫ్యామిలీ కార్ గా ఉంటుంది. హ్యుందాయ్ శాంత్రో ఎంట్రీ-లెవల్ మోడల్ అయినప్పటికీ, ఇది బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా కనిపించదు. ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, రియర్ ఏసి వెంట్‌లు, 2.6 ఇంచ్ MID డిస్‌ప్లే యూనిట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ముందు మరియు వెనుక పవర్ విండోలు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

హ్యుందాయ్ శాంత్రో ఇంజన్ విషయానికి వస్తే, ఇది 68 బిహెచ్‌పి పవర్ మరియు 99 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో పాటుగా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడా లభిస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో ఏఎమ్‌టి వేరియంట్ ధరలు రూ. 6.00 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా)

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)

భారత కార్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ సిటీ కార్లలో మారుతి సుజుకి సెలెరియో కూడా ఒకటి. అంతేకాదు, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో AMT (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) అనే గేమ్ ఛేంజింగ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసిన మొదటి మోడల్ కూడా ఇదే. ఇటీవలే, మారుతి సుజుకి తమ కొత్త తరం సెలెరియో కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారులో 7 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ టాకోమీటర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతి సుజుకి సెలెరియో కారులో గరిష్టంగా 67 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియోను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో యొక్క AMT వేరియంట్ ధరలు రూ. 6.23 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)

కొత్తతరం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ను కంపెనీ పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఇది మునుపటి కన్నా మరింత పెద్దగా మరియు విశాలవంతంగా ఉంటుంది. ఈ టాల్ బాయ్ కారుకి మార్కెట్లో ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, సెంట్రల్ రిమోట్ లాకింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి చాలా ఫీచర్లను కలిగి ఉంటుంది.

బడ్జెట్ ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో టాప్ 5 బడ్జెట్ ఆటోమేటిక్ కార్స్..!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని చిన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67.05 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇందులోని పెద్ద 1.2-లీటర్ యూనిట్ 88.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో వ్యాగన్ఆర్ AMT వేరియంట్ ల ధరలు రూ. 6.41 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

Most Read Articles

English summary
Looking for the budget amt car here is the list of top 5 most affordable automatic cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X