జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

ఇటీవల కాలంలో లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న సెలబ్రెటీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొన్న టీవీ నటి 'మున్మున్ దత్తా' 'మెర్సిడెస్ బేస్ ఏ-క్లాస్' కొనుగోలు చేయగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ (గీత రచయిత), పొయిట్ (కవి) మరియు స్క్రీన్ రైటర్ అయిన 'మనోజ్ ముంతాషిర్' జర్మన్ బ్రాండ్ అయిన 'ఆడి క్యూ7' (Audi Q7) ఎస్‌యూవీ కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

నివేదికల ప్రకారం.. 'మనోజ్ ముంతాషిర్' ఆడి క్యూ7 కొనుగోలు చేసిన ఆడి క్యూ7 ఎస్‌యూవీ కలిగి ఉన్న సెలబ్రెటీల జాబితాలో ఒకరుగా నిలిచారు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధర రూ. 79,99,000 నుంచి రూ. 88,33,0000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ప్రీమియం ప్లస్, టెక్నాలజీ వేరియంట్స్.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

మనోజ్ ముంతాషిర్ కొనుగోలు చేసిన ఆడి క్యూ7 ధర రూ. 79.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కావున ఇది 'ప్రీమియం ప్లస్' వేరియంట్ అని తెలుస్తోంది. ఇది సమురాయ్ గ్రే కలర్ లో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

భారతీయ మార్కెట్లో కొత్త ఆడి క్యూ7 మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మైథోస్ బ్లాక్, కరారా వైట్, సమురాయ్ గ్రే, నవర్రా బ్లూ మరియు ఫ్లోరెట్ సిల్వర్ కలర్స్. ఇంటీరియర్‌లో బీజ్ మరియు బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

ఆడి క్యూ7 స్లిమ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. రియర్ ప్రొఫైల్ లో ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌, బూట్ డోర్ వద్ద స్లిమ్ క్రోమ్ స్ట్రిప్, బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ వున్నాయి. మొత్తం మీద ఈ ఎస్‌యువి యొక్క డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

ఆడి క్యూ7 'మై ఆడి కనెక్ట్' యాప్‌తో పాటు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి ఆధునిక టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది. ఇంటీరియర్ లో మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీట్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ ఉన్నాయి.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటు 4 జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్ వంటి వాటిని పొందుతుంది. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

ఆడి క్యూ7 ఎస్‌యువి 3.0-లీటర్ వి6 టిఎఫ్ఎస్ఐ ఇంజిన్ ను పొందుతుంది. ఇది 340 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ ఎస్‌యువి యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఆడి క్యూ7 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటమే కాకుండా, 7 డ్రైవింగ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. అవి ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిజువల్ మోడ్స్.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

ఇదిలా ఉండగా గతంలో బాలీవుడ్ నటి అతియా శెట్టి మరియు తెస్జస్వి ప్రకాష్ వంటి వారు కూడా ఈ ఎస్‌యువిని కొనుగోలు చేశారు. కాగా ఇప్పుడు 'మనోజ్ ముంతాషిర్' ఈ ఆడి క్యూ7 ను తన గ్యారేజిలో చేర్చాడు. ఈ లగ్జరీ ఎస్‌యువి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనం వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ ఎస్‌యువిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు.

జర్మన్ లగ్జరీ కారు కొన్న 'మనోజ్ ముంతాషిర్': ధర రూ.79.99 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న లగ్జరీ ఎస్‌యువిల జాబితాలో ఆడి క్యూ7 కూడా ఒకటి. ఇది దేశీయ మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, వోల్వో XC90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మరియు లెక్సస్ ఆర్ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఖరీదైన ఎస్‌యువిని సినీప్రముఖులు మరియు ఇతర ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు.

Most Read Articles

English summary
Lyricist manoj muntashir buys new audi q7 suv details
Story first published: Wednesday, June 29, 2022, 17:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X