మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్: ఎక్కువ రేంజ్ & మరింత ఎక్కువ ఆదా..

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశీయ విఫణిలో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలపైనే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల ఆల్ఫా సిఎన్‌జి ప్యాసింజర్ మరియు కార్గో త్రీ-వీలర్ యొక్క కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. ఈ కొత్త సిఎన్‌జి వెహికల్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Alfa Passenger DX BS6 CNG మరియు Alfa Load Plus ధరలు వరుసగా రూ. 2,57,000 మరియు రూ. 2,57,800 (ఎక్స్-షోరూమ్-లక్నో). ఈ రెండు వేరియంట్లు కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆల్ఫా డీజిల్‌తో పోలిస్తే ఆల్ఫా కార్గో సిఎన్‌జి యొక్క కొత్త వినియోగదారులు ఇప్పుడు 5 సంవత్సరాల వ్యవధిలో ఇంధనంపై రూ. 4,00,000 వరకు ఆదా చేసుకోవచ్చని మహీంద్రా స్పష్టం చేసింది. సిఎన్‌జి మోడల్‌లో ఆల్ఫా డిఎక్స్ ప్యాసింజర్ యొక్క మైలేజ్ 40.2 కిమీ/కేజీ అందించగా, ఆల్ఫా లోడ్ ప్లస్ యొక్క మైలేజ్ 38.6 కిమీ/కేజీ అందిస్తుంది.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ కొత్త వెహికల్స్ లో వాటర్ కూల్డ్ ఇంజిన్ వ్యవస్థాపించబడింది. కావున 23.5 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా తక్కువ వేగంలో కూడా ఈ ఇంజిన్ 20 ఎన్ఎమ్ టార్క్‌ వరకు అందిస్తుంది. మొత్తం మీద ఇవి మంచి పరిధిని కూడా అందిస్తాయి.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ అందించిన సమాచారం.. వాహనం యొక్క 395-సెం.మీ 3 వాటర్-కూల్డ్ ఇంజిన్ దాని తరగతిలోనే అతిపెద్దది అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇది ఎక్కువ కాలం పాటు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఆల్ఫా వాహనాలను తయారు చేయడానికి కంపెనీ 0.90 మిమీ మందపాటి మెటల్ షీట్ ఉపయోగించింది.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ ఈ వాహనాలను విక్రయించిన తరువాత వాటి వినియోగదారులకు మెరుగైన సర్వీస్ వంటి వాటిని అందించడానికి భారతదేశం అంతటా 800 కంటే ఎక్కువ డీలర్ టచ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. కావున కొనుగోలుదారులు వీటిని వినియోగించుకోవచ్చు.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆల్ఫా సిఎన్‌జి వాహనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, కేరళ మరియు మధ్యప్రదేశ్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంచబడుతుంది. మహీంద్రా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో తన వాహనాలను కూడా విక్రయిస్తోంది.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇప్పటికే భారతీయ మార్కెట్లో మహీంద్రా కంపెనీ యొక్క ట్రియో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో విక్రయించబడుతోంది. ఇది కూడా ప్యాసింజర్ మరియు కార్గో మోడల్‌లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.69 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 2.79 లక్షల వరకు ఉంటుంది. మహీంద్రా ట్రియో కంపెనీ యొక్క NEMO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది.

మహీంద్రా నుంచి కొత్త CNG త్రీ-వీలర్స్ వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ 8 kW పవర్ మరియు 42 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో, కంపెనీ IP65 రేటింగ్ లేటెస్ట్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించింది. ఇది 1.50 లక్షల కి.మీ బ్యాటరీ లైఫ్ మరియు మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్. మహీంద్రా ట్రియోని 15 యాంపియర్ సాకెట్‌తో ఛార్జ్ చేయవచ్చు. డీజిల్ ఆటో-రిక్షాతో పోలిస్తే ఇది సంవత్సరానికి రూ. 60,000 వరకు ఆదా చేస్తుంది.

ఇక భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ మహీంద్రా సిఎన్‌జి త్రీ-వీలర్స్ ఎలాటి అమ్మకాలను పొందుతాయి అనేది త్వరలో తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని కొత్త వాహనాల గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra alfa cng dx passenger and load plus cargo three wheeler launched
Story first published: Thursday, June 9, 2022, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X