ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విఫణిలో కొత్త 'ఆల్టురాస్' జి4 యొక్క కొత్త వేరియంట్ '2 వీల్ డ్రైవ్ హై' ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర మార్కెట్లో రూ. 30.68 లక్షలు. ఇది ప్రస్తుతం ఆల్టురాస్ జి4 లైనప్‌లో ఉన్న ఏకైక వేరియంట్. మహీంద్రా యొక్క ఆల్టురాస్ జి4 2 వీల్ డ్రైవ్ హై గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ విడుదలతో ఇకపై ఆల్టురాస్ బేస్ 2WD మరియు 4X4 వేరియంట్‌లను అందించే అవకాశం లేదు. కాగా కొత్త 2 వీల్ డ్రైవ్ హై వేరియంట్ 4WD వేరియంట్ వలె అదే పరికరాలను కలిగి ఉంటుంది, అంతే కాకుండా పవర్‌ట్రెయిన్ విషయంలో కూడా ఎటువంటి మార్పు లేదు.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

మహీంద్రా ఆల్టురాస్ అనేది టొయోట ఫార్చ్యూనర్ డీజిల్ 2-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ కంటే కూడా రూ. 6.5 లక్షలు తక్కువ ధరకే లభ్యమవుతుంది. అదే సమయంలో MG గ్లోస్టర్ డీజిల్ కంటే కూడా రూ. 1.32 లక్షలు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

గతంలో మహీంద్రా కంపెనీ తన ఆల్టురాస్ G4 2WD మరియు 4X4 వేరియంట్‌లను అందుబాటులో ఉంచింది. 4X4 వేరియంట్‌లో అత్యధిక ఫీచర్లు మరియు పరికరాలు ఉన్నాయి. ఇందులో రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ మరియు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

కాగా ఇప్పుడు ఆ 4X4 నిలిపివేసిన తర్వాత, ఈ ఫీచర్లన్నీ కొత్త 2-వీల్ డ్రైవ్ వేరియంట్‌లో అందించబడుతున్నాయి. కావున ఆల్టురాస్ కొనుగోలుదారులు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. 4X4 వేరియంట్ లోని అన్ని ఫీచర్స్ పొందవచ్చు. అదే సమయంలో 2-వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కి సపోర్ట్ చేస్తుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్ మరియు యాంబియంట్ లైటింగ్‌ వంటివి కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

ఆల్టురాస్ G4 యొక్క పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే, మనం ఇంతకుముంచు చెప్పుకున్నట్లుగానే ఇందులో ఎటువంటి మార్పులు లేదు. కావున అదే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 178 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ నుంచి తీసుకోబడింది. కావున పనితీరుపరంగా ఎటువంటి మార్పు లేదు, అద్భుతమైన పనితీరుని పొందవచ్చు.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

పరిమాణం పరంగా మహీంద్రా ఆల్టురాస్ G4 వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని పొడవు 4850 మిమీ, వెడల్పు 1,960 మిమీ, ఎత్తు 1,845 మిమీ మరియు వీల్‌బేస్ 2,865 మిమీ వరకు ఉంటుంది.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

మహీంద్రా ఆల్టురాస్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఒకప్పుడు మంచి ప్రజాదరణ పొందిన మహీంద్రా యొక్క ఆల్టురాస్ ఇప్పుడు కొత్త వేరియంట్ లో విడుదలైంది. ఇది భారతీయ విఫణిలో ఈ పండుగ సీజన్లో మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అదే సమయంలో ఇది టొయోట ఫార్చ్యూనర్, ఇసుజు MU-ఎక్స్ మరియు ఎంజి గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra alturas g4 2wd launched price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X