జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) దేశీయ విపణిలో విక్రయిస్తున్న యుటిలిటీ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. మహీంద్రా మోడళ్ల కోసం సుధీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం వేచి ఉండేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఫలితంగా, మహీంద్రా అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గడచిన ఏప్రిల్ 2022 నెలలో మహీంద్రా మొత్తం 45,640 వాహనాలను విక్రయించి, 25 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

అయితే, నెలవారీ అమ్మకాలను గమనిస్తే, మహీంద్రా మార్చి 2022 నెలలో 54,643 యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్ 2022 నెలలో 45,640 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు 9,003 యూనిట్లు తగ్గి, 19.72 శాతం నెలవారీ క్షీణతను నమోదు చేశాయి. గడచిన నెలలో మహీంద్రా తమ వాహనాల ధరలను 2.5 శాతం వరకూ (వేరియంట్‌ను బట్టి సుమారు రూ.63,000 వరకూ) పెంచుతున్నట్లు ప్రకటించింది. పాపులర్ మోడళ్లయిన థార్, ఎక్స్‌యూవీ700 మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది. బహుశా, ఈ ధరల పెంపు కారణంగా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ అమ్మకాలు తగ్గి ఉండొచ్చని తెలుస్తోంది.

జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

ఏప్రిల్ 2022లో మహీంద్రా యొక్క ప్యాసింజర్ వాహన విక్రయాలు 22,526 యూనిట్లకు పెరిగాయి, గత ఏడాది ఇవి కేవలం 18,285 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఇవి 23 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. అయితే, మహీంద్రా గత మార్చి 2022 నెలలో విక్రయించిన 27,380 యూనిట్లతో పోలిస్తే, ప్యాసింజర్ వాహనాల నెలవారీ విక్రయాల 21.5 శాతం (4,854 యూనిట్లు) తగ్గాయి. కాగా, ఏప్రిల్ 2022 నెలలో మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాల సంఖ్య 22 శాతం (3,982) పెరిగి 22,168 యూనిట్లకు చేరుకుంది.

Passenger Vehicles Sales Summary (Domestic) - April 2022
Category April
F23 F22 % Change
Utility Vehicles 22168 18186 22%
Cars + Vans 358 99 262%
Passenger Vehicles 22526 18285 23%
జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

మహీంద్రా ఏప్రిల్ 2021 నెలలో కేవలం 18,186 యుటిలిటీ వాహనాలను మాత్రమే విక్రయించింది. కాగా, ఏప్రిల్ 2021ల నెలలో మహీంద్రా విక్రయించిన కార్లు మరియు వ్యాన్‌ల విక్రయాలు 99 యూనిట్లుగా ఉంటే, అవి ఏప్రిల్ 2022 నెలలో 358 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ఇవి గరిష్టంగా 262 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. అలాగే, గత నెలలో మహీంద్రా వాణిజ్య వాహనాలు మరియు 3-వీలర్ అమ్మకాలు కూడా 26.4 శాతం (4264 యూనిట్లు) పెరిగాయి. ఏప్రిల్ 2022లో మహీంద్రా మొత్తం 20,411 యూనిట్ల వాణిజ్య వాహనాలు మరియు 3-వీలర్‌లను విక్రయించింది.

Commercial Vehicles and 3 Wheelers Sales Summary (Domestic) - April 2022
Category April
F23 F22 % Change
LCV < 2T 2929 1561 88%
LCV < 2 T – 3.5 T 13768 12210 13%
LCV > 3.5T + MHCV 705 333 112%
3 Wheelers (including electric 3Ws) 3009 2043 47%
జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..
Exports - April 2022
Category April
F23 F22 % Change
Tata Exports 2703 2005 35%

ఏప్రిల్ 2022 నెలలో పెరిగిన మహీంద్రా వాహనాల ధరలు

ఇదిలా ఉంటే, మహీంద్రా గడచిన ఏప్రిల్ నెలలో తమ ప్యాసింజర్ వాహనాల ధరలను భారీగా పెంచింది. మహీంద్రా విక్రయిస్తున్న ఎంట్రీలెవల్ మోడల్ కార్లు మొదలుకొని, లగ్జరీ కారు ఆల్ట్యూరాస్ జి4 వరకూ దాదాపు అన్ని మోడళ్ల ధరలు పెరిగాయి. ఈ బ్రాండ్ నుండి కొత్తగా వచ్చిన మహీంద్రా థార్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు కూడా ప్రభావితం అయ్యాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకటన ప్రకారం, మహీంద్రా వాహనాల ధరలు రూ. 10 వేల నుంచి రూ. 63 వేల వరకు (మోడల్ మరియు వేరియంట్ ను బట్టి) పెరిగాయి.

జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

రూ.51,000 పెరిగిన మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు

మహీంద్రా యొక్క పాపులర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ థార్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు రూ.51,000 వరకూ పెరిగాయి. మహీంద్రా ఈ ఏడాదిలో (2022లో) థార్ ధరలను పెంచడం ఇది రెండవసారి. తాజా ధరల పెంపుతో మార్కెట్లో మహీంద్రా థార్ ధరలు రూ. 13.53 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. మహీంద్రా థార్ వేరియంట్లలో అత్యధిక ధరల పెరుగుదల అందుకున్నది AX (O) కన్వర్టిబుల్ వేరియంట్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడిన LX కన్వర్టిబుల్ వేరియంట్. ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 51,000 మేర పెరిగాయి.

జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా థార్ ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. మొదట్లో కంపెనీ ఇందులో ఓ 6-సీటర్ వెర్షన్ ను కూడా అందించింది. అయితే, సేఫ్టీ దృష్ట్యా కంపెనీ ఈ వేరియంట్‌ను నిలిపివేసింది. కాగా, ఇప్పుడు ఇది కేవలం 4-సీటర్ గా మాత్రమే అందుబాటులో ఉంది. మహీంద్రా థార్‌లో ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లుఉన్నాయి. వీటిలో కేవలం థార్ ఏఎక్స్ ఆప్షనల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, థార్ ఎల్ఎక్స్ ట్రిమ్స్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటుగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటాయి.

జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న మహీంద్రా సేల్స్.. అమ్మకాలలో తగ్గేదేలే అంటున్న థార్ ఎస్‌యూవీ..

ఇటు సిటీ రైడ్స్ మరియు అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్స్ కోసం ఉద్దేశించి తయారు చేయబడిన ఈ ఎస్‌యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ ఫీచర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ యొక్క విశిష్టమైన డిజైన్ కారణంగా, కస్టమర్లు థార్ కోసం నెలల తరబడి వేచి ఉండేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.

Most Read Articles

English summary
Mahindra april 2022 sales up by 25 percent demand continues to thar and xuv700
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X