మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తొలిసారిగా 2018 ఆటో ఎక్స్‌పో (2018 Auto Expo) లో ప్రదర్శించిన తమ ఆల్-ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ కాన్సెప్ట్ 'మహీంద్రా ఆటమ్' (Mahindra Atom) లో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌ని 2020 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. వాస్తవానికి, ఇది అదే సంవత్సరంలో అమ్మకానికి అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అవాంతరాల కారణంగా, దాని విడుదల ఆలస్యమైంది.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

కాగా, ఇప్పుడు మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ వెళ్లడయ్యాయి. భారత రోడ్లపై మహీంద్రా ఆటమ్ చాలా కాలంగా పరీక్షిస్తున్నట్లు కనిపించనప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది క్యామోఫ్లేజ్ చేయబడి పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. అప్పటి నుండి మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్ గురించి కొత్తగా ఏమీ వినబడలేదు. మహీంద్రా ఇంకా ఆటమ్ యొక్క సాంకేతిక లక్షణాల గురించి ఆలోచిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు మహీంద్రా ఆటమ్ యొక్క వేరియంట్లు మరియు బ్యాటరీ పరిమాణం గురించి సమాచారం వెల్లడైంది.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

తాజా సమాచారం ప్రకారం, మహీంద్రా ఆటమ్ మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి - K1, K2, K3 మరియు K4. మొదటి రెండు వేరియంట్‌లలో కంపెనీ 7.4 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు వేరియంట్లలో 11.1 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. వీటిలో K1 మరియు K3 వాటి సంబంధిత బ్యాటరీ సామర్థ్యాల ప్రకారం, అవి బేస్-స్పెక్ వేరియంట్‌లుగా ఉండబోతున్నాయి, వీటిలో ఒకటి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను కూడా కోల్పోతుంది, అయితే K2 మరియు K4 వేరియంట్‌లు ఎయిర్ కండిషనింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

ఈ క్వాడ్రిసైకిల్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 11 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌ను అందించవచ్చని చెబుతున్నారు. ఇక దీని పరిమాణం విషయానికి వస్తే, మహీంద్రా ఆటమ్ పొడవు 2,728 mm, వెడల్పు 1,452 mm మరియు ఎత్తు 1,576 mm మరియు వీల్‌బేస్ 1,885 mm గా ఉంటుంది. ఈ పరిమాణంతో, మహీంద్రా ఆటమ్ దాని ప్రాథమిక ప్రత్యర్థి అయిన పెట్రోల్ మరియు సిఎన్‌జి పవర్డ్ బజాజ్ క్యూట్‌తో సమానంగా ఉంటుంది. మహీంద్రా ఆటమ్ తప్పనిసరిగా రెండు-డోర్లు మరియు నాలుగు-సీట్లు కలిగిన వాహనంగా ఉంటుంది.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

లాస్ట్ మైల్ కనెక్టివిటీని లక్ష్యంగా చేసుకొని, వాణిజ్య ప్రయోజనం కోసం మహీంద్రా ఈ క్వాడ్రిసైకిల్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహీంద్రా ఆటమ్ భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అని కంపెనీ పేర్కొంది. మోనోకోక్ ఛాసిస్ ఆధారంగా తయారైన మహీంద్రా ఆటమ్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఇందులో చక్రాలు మూలల్లోకి నెట్టబడిట్లుగా ఉండి, చాలా తక్కువ ఓవర్‌హాంగ్‌ను కలిగి ఉంటాయి.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ కోసం ఒకే ఒక సీటు ఉంటుంది. ఇది ముందు భాగంలో ఆటోరిక్షా మాదిరిగా మధ్యలో అమర్చబడి ఉంటుంది. వెనుక వైపు ప్రయాణీకుల కోసం బెంచ్ స్టైల్ సీట్ ఉంటుంది, ఇందులో ముగ్గురు ప్రయాణీకులు హాయిగా కూర్చునేంత స్థలం ఉంటుంది. ఈ క్వాడ్రిసైకిల్ లో ఎయిర్ కండిషనింగ్, మొబైల్ డాకింగ్ స్టేషన్ మరియు వెనుక ప్రయాణీకుల వినోదం కోసం కనెక్టింగ్ ఫీచర్లు మరియు 4జి కనెక్టివిటీ సామర్థ్యంతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ మొదలైన ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

కొత్త తరం మహీంద్రా స్కార్పియో (New Gen Mahindra Scorpio) టీజర్ విడుదల

కొత్త తరం థార్ (Thar) మరియు సరికొత్త ఎక్స్‌యూవీ700 (XUV700) మోడళ్లను విడుదల చేసిన మహీంద్రా ఇప్పుడు తమ కొత్త మహీంద్రా స్కార్పియో (New Gen Mahindra Scorpio) ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా తమ కొత్త స్కార్పియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. దాదాపు రెండేళ్లుగా మహీంద్రా స్కార్పియో యొక్క కొత్త వెర్షన్ విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు మహీంద్రా తమ స్కార్పియో టీజర్ ను విడుదల చేయడాన్ని చూస్తుంటే, ఇక ఈ మోడల్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందని తెలుస్తోంది.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

సమాచారం ప్రకారం, కొత్త తరం మహీంద్రా స్కార్పియో పూర్తిగా సరికొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు అధునాతన ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే, ఈ మోడల్ నుండి వచ్చిన సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను మరియు లేటెస్ట్ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్త తరం స్కార్పియో ఇదే తరహా ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా ఆటమ్ (Mahindra Atom) క్వాడ్రిసైకిల్ వివరాలు వెల్లడి, త్వరలో విడుదల!

భారతదేశంలో కింగ్ ఆఫ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌గా పిలువబడే మహీంద్రా స్కార్పియో, ఈ విభాగంలో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎమ్‌జి హెక్టర్, నిస్సాన్ కిక్స్, టాటా హారియర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి మోడళ్లకు పోటీ పడుతుంది. తెలుగులో ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra atom quadricycle variants and battery details revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X