Just In
- 10 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 11 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 15 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 18 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరింత సురక్షితంగా మారనున్న Mahindra Bolero.. ఇప్పుడు రెండు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్స్‌తో..
ఎస్యూవీ స్పెషలిస్ట్ అందిస్తున్న పాపులర్ యుటిలిటీ వెహికల్ మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఇప్పుడు మరింత సురక్షితంగా మారనుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ప్రవేశపెట్టనున్న కొత్త అప్డేట్లో భాగంగా, బొలెరో ఎస్‌యూవీలో కంపెనీ రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్ లను (ఒకటి డ్రైవర్ మరొకటి ప్యాసింజర్) కోసం స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ గా అందించనుంది. ప్రస్తుతం, మహీంద్రా బొలెరో బేస్ వేరియంట్లు కేవలం ఒకే ఒక ఎయిర్‌బ్యాగ్ (డ్రైవర్ సైడ్) తో మాత్రమే లభిస్తున్న సంగతి తెలిసినదే.

మహీంద్రా అండ్ మహీంద్రా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా బొలెరో ఎ అగ్రస్థానంలో ఉంటుంది. సరసమైన ధరకే లభిస్తున్న పెద్ద ఎస్‌యూవీగా ఇది మార్కెట్లో మంచి పాపులరాటీని దక్కించుకుంది. మహీంద్రా చాలా సంవత్సరాలుగా ఈ కారును భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ బొలెరోను అమ్మకాలను పెంచుకునేందుకు ఈ మోడల్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది.

తాజాగా, బొలెరో ఎస్‌యూవీలో సేఫ్టీ ఫీచర్ ను కంపెనీ అప్డేట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని కార్లలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, కంపెనీ తమ బొలెరో ఎస్‌యూవీలో కూడా రెండు ఎయిర్‌బ్యాగ్ లను తప్పనిసరిగా అందించనుంది. ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా బొలెరో స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో అందించబడుతుంది.

దేశీయ మార్కెట్లో బొలెరో ఎస్యూవీ ధరలు రూ. 8.71 లక్షలు మరియు టాప్ వేరియంట్ ధర రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ ఎస్యూవీ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో B4, B6 మరియు B6 (O) వేరియంట్లు ఉన్నాయి. మహీంద్రా బొలెరో ఎస్‌యూవీకి ప్రస్తుతం ఈ విభాగంలో ప్రత్యక్షంగా ఎలాంటి పోటీ లేనప్పటికీ, ధర పరంగా ఇది ఈ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కార్లతో పోటీ పడుతుంది.

సమాచారం ప్రకారం, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ తో కూడిన కొత్త మహీంద్రా బొలెరో ఈ నెలఖారు నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ మాత్రమే కాకుండా, కొత్త బొలెరోలో డ్యూయల్ కలర్ ఆప్షన్ కూడా అందించబడుతుందని తెలుస్తోంది. అయితే, దీని ఓవరాల్ డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. ఓ నివేదిక ప్రకారం, కంపెనీ కొత్త బొలెరోనూ రెడ్ పెయింట్ మరియు మరొక కలర్ కాంట్రాస్ట్‌తో డ్యూయెల్ టోన్ రూపంలో అందించనున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా బొలెరో ప్రస్తుతం వైట్, సిల్వర్ మరియు బేజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా పూర్తి సింగిల్ టోన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా, కొత్త అప్డేట్ లో భాగంగా, ఇందులో డ్యూయల్ కలర్ ఆప్షన్లు జోడించబడతాయని భావిస్తున్నారు. ఈ రెండు మార్పులు మినహా కొత్త బొలెరో కారులో ఇతర మార్పులు ఏవీ ఆశించబడవు.

అదే సమయంలో, అప్డేట్ చేయబడిన బొలెరో ఎస్‌యూవీలో గతంలో అందించిన బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్ (ఆక్స్, యూఎస్బి సపోర్ట్‌తో), ఏసి, కీలెస్ యాక్సెస్, పవర్ స్టీరింగ్ వీల్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, హైస్పీడ్ అలర్ట్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారులో 1.5-లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 75 bhp పవర్ ను మరియు 210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని కారు వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది (రియర్ వీల్ డ్రైవ్). కొత్త అప్డేట్లతో రానున్న కొత్త బొలెరో ధరలు ప్రస్తుత ధరల కన్నా స్వల్పంగా పెరగవచ్చని అంచనా.

మహీంద్రా తమ బొలెరో సిరీస్‌ను విస్తరిస్తూ, గతంలో విక్రయించిన టియూవి300 ఆధారంగా రూపొందించిన కొత్త మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Nio) మోడల్ ని మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో మహీంద్రా బొలెరో నియో ఎస్యూవీ బేస్ వేరియంట్ ధర రూ. 8.77 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలుగా ఉంటుంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ధరలు.

మహీంద్రా బొలెరో నియో ఎస్యూవీ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్ పవర్ ను మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 8.77 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలుగా ఉంటుంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ధరలు. మహీంద్రా బొలెరో నియో మాదిరిగానే, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) కూడా భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది.