అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ': ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ మార్కెట్లో తన 'జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ' (Jeeto Plus CNG CharSau) విడుదల చేసింది. ఈ కొత్త సిఎన్‌జి చార్‌సౌ ప్రారంభ ధర రూ. 5.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే). దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

భారతీయ వాణిజ్య వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న 'మహీంద్రా' ప్రస్తుతం ఈ విభాగంలో రెండవ స్థానంలో ఉంది. అయితే కంపెనీ యొక్క కొత్త 'జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ' ఇప్పుడు ట్రాన్స్‌పోర్టర్ల లాస్ట్-మైల్ కనెక్టివిటీ మరియు లాజిస్టిక్స్ వంటి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించింది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ మంచి పేలోడ్, అధిక రేంజ్ మరియు మంచి మైలేజ్ వంటివి అందిస్తుంది. కంపెనీ యొక్క 2022 జూలై నెల అమ్మకాలలో 16,478 యూనిట్ల విక్రయాలతో 29.71 శాతం మార్కెట్ వాటాను పొందగలిగింది. అంతే కాకుండా మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ బొలెరో పికప్ టీజర్‌ను కూడా ఇటీవల విడుదల చేసింది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

మహీంద్రా జీతో ప్లస్ CNG ఇంటర్ మరియు ఇంట్రా సిటీ ఫీచర్లు రెండింటికీ సరిపోయే విధంగా ఉంటుంది. ఇది మొత్తం 68 లీటర్ల (40L+28L) కెపాసిటీ గల 2 CNG ట్యాంక్‌లతో వస్తుంది. కావున ఇది 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ మైలేజ్ కూడా అద్భుతంగానే ఉంది. దీని మైలేజ్ 35.1 కిమీ/కేజీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఇది 650 కేజీల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాని విభాగంలో ఉన్న ఇతర వాహనాలకంటే కూడా 30 శాతం ఆదాను కలిగించడమే కాకుండా చాలా ప్రయాజనాలకు అనుకూలంగా ఉంటుంది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

మహీంద్రా జీతో ప్లస్ CNG 4.3 మీటర్ల టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం కలిగి ఉంటుంది, తద్వారా ఇరుకైన మరియు రద్దీగా ఉండే రహదారుల్లో కూడా వాహనాన్ని నావిగేట్ చేయడానికి డ్రైవర్‌కు సౌకర్యంగా ఉంటుంది. ఇది భారతదేశంలోని చిన్న మరియు మధ్య తరహా వ్యాపారుల చివరి మైలు కనెక్టివిటీ అవసరాలను తీరుస్తుంది మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

కొత్త మహీంద్రా జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది ప్రస్తుతం మూడు కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంది. అవి డైమండ్ వైట్, అల్ట్రామెరైన్ బ్లూ మరియు సన్‌రైజ్ రెడ్ కలర్స్. ఈ వెహికల్ ఇప్పుడు అదనపు హెడ్ మరియు లెగ్ రూమ్‌తో కూడిన పెద్ద క్యాబిన్‌ను పొందుతుంది. అంతే కాకుండా, సౌకర్యవంతమైన సీటింగ్ మరియు మృదువైన గేర్ షిఫ్ట్ పరంగా మెరుగైన డ్రైవర్ ఎర్గోనామిక్స్ అందిస్తుంది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

జీతో ప్లస్ సిఎన్‌జి దృఢమైన బాడీతో, పెద్ద చాసిస్ మరియు 2,500 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. అయితే దీని పొడవు 2257 మిమీ వరకు ఉంది. అదే సమయంలో ఇది దాని విభాగంలో అత్యన్నత సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది మెరుగైన మరియు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి మృదువైన స్టీరింగ్, క్లాస్ పికప్ మరియు యాక్సిలరేషన్‌ వంటి వాటిని పొందుతుంది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

కొత్త మహీంద్రా జీతో ప్లస్ CNG శక్తివంతమైన ఇంజన్‌తో 15 kW గరిష్ట శక్తిని మరియు 1,600-2,200 ఆర్‌పిఎమ్ వద్ద 44 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది గరిష్టంగా 400 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కావున ఈ కొత్త CNG వెహికల్ తప్పకుండా భారతీయ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అధిక పేలోడ్, మరింత ఎక్కువ రేంజ్ అందించే 'మహీంద్రా జీతో ప్లస్ CNG చార్‌సౌ: ధర తక్కువ & పర్ఫామెన్స్ ఎక్కువ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మహీంద్రా యొక్క కమర్షియల్ వాహనాలకు కూడా మంచి ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ తో మంచి పేలోడ్ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిన మహీంద్రా 'జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ' CNG తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. ఇది దేశీయ మార్కెట్లో అశోక్ లేలాండ్ దోస్త్, టాటా ఏస్ HT ప్లస్ మరియు ప్రీమియర్ రోడ్‌స్టార్ టిప్పర్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra jeeto plus cng launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X