ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

భారతదేశపు ప్రముఖ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌పై కన్నేసింది. భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీదే కావడంతో, ఈ విభాగంలో తకనంటూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉండేందుకు మహీంద్రా ప్రయత్నిస్తోంది. యుటిలిటీ వాహనాల తయారీలో చేయి తిరిగిన తన అనుభవానికి తోడుగా ఇప్పుడు యూకే సాంకేతికతను కూడా అరువు తెచ్చుకుంటుంది. ఇటీవలే ఐదు కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరించిన మహీంద్రా, యూరప్‌లో ఓ కొత్త ఈవీ డిజైన్ సెంటర్ ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

మహీంద్రా యొక్క భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలను డిజైన్ చేసేందుకు యూకేలో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సదుపాయం మహీంద్రా యొక్క రాబోయే EV పోర్ట్‌ఫోలియోను డిజైన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందని కంపెనీ తెలియజేసింది. కొత్త డిజైన్ కేంద్రం బాన్‌బరీ, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని గ్లోబల్ ఆటోమోటివ్ మరియు ఈవీ హబ్‌లో ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్, అటానమిక్స్ వంటి మరిన్నో కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు యాక్సెస్‌ను అందిస్తున్నందున ఈ స్థానాన్ని తమ డిజైన్ సెంటర్ హవ్ కోసం ఎంపిక చేసినట్లు మహీంద్రా తెలిపింది. మహీంద్రా తన గ్లోబల్ డిజైన్ నెట్‌వర్క్‌లో భాగంగా ముంబైలో కూడా మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియోను ఏర్పాటు చేసింది. ఈ కొత్త డిజైన్ స్టూడియో మేడ్ (M.A.D.E) యొక్క ప్రధాన లక్ష్యం భవిష్యత్తులో అన్ని మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అధునాతన వాహనాలకు సంబంధించిన రూపకల్పన భావనల (డిజైన్ కాన్సెప్ట్స్)ను రూపొందించడం.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

ఈ కొత్త కేంద్రాన్ని గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యూకే అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్ జయవర్ధనా ప్రారంభించారు. సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, "మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్ తమ న్యూరల్ నెట్‌వర్క్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో మరొక ముఖ్యమైన అడుగు అని, 15 నెలల వ్యవధిలోనే ఈ డిజైన్ బృందం ఇప్పటికే విద్యుదీకరణ భవిష్యత్తు (ఎలక్ట్రిఫైయింగ్ ఫ్యూచర్) కోసం బ్లూప్రింట్ రూపొందించిందని, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని" చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

మహీంద్రా గ్రూప్ తాము కొత్తగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను బోర్న్ ఎలక్ట్రిక్ (Bron Electric లేదా BE) సిరీస్ క్రింద విడుదల చేయనుంది. ఈ బోర్న్ ఎలక్ట్రిక్ వాహనాలలో కంపెనీ ఇప్పటికే ఐదు మోడళ్లను ఆవిష్కరించింది. ఆగస్ట్ 15వ తేదీన మహీంద్రా నిర్వహించిన తమ బోర్న్ ఎలక్ట్రిక్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ కాన్సెప్ట్ వాహనాలను వెల్లడి చేసింది. ఈ ఐదు e-SUVలలో మూడింటి అభివృద్ధికి కూడా ఈ మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) కేంద్రం బాధ్యత వహిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

మేడ్ అత్యాధునిక డిజైన్ సాధనాలను కలిగి ఉంది, ఇది కాన్సెప్టులైజేషన్, క్లాస్-A సర్ఫేసింగ్, 3D డిజిటల్ మరియు ఫిజికల్ మోడలింగ్, డిజిటల్ విజువలైజేషన్ మరియు హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ (HMI) డిజైన్‌తో సహా అన్ని డిజైన్ కార్యకలాపాలను ఓకేచోట నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. మహీంద్రా ఆవిష్కరించిన ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆధారంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ వాహనం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఇది వచ్చే ఏడాది నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

ఈ డిజైన్ స్టూడియోని ప్రారంభించిన సందర్భంగా, మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ మాట్లాడుతూ.. "M.A.D.Eలో తమ ప్రాథమిక లక్ష్యం తమ బోర్న్ ఎలక్ట్రిక్ విజన్‌కు వ్యక్తీకరణను అందించడమేనని, సాంకేతికత, ఆటోమోటివ్ డిజైన్ ప్రతిభ మరియు వాటిని సమీకరించబడిన అత్యాధునిక సాధనాలన్నీ కూడా ఈ లక్ష్యం వైపు దృష్టి సారించాయని, ఇవి మహీంద్రా ఈవీ డిజైన్ మరియు ఇన్నోవేషన్‌కు వెల్‌స్ప్రింగ్‌గా ఉపయోగపడుతాయని" అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

భారతదేశంలో ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించిన మహీంద్రా

ఇదిలా ఉంటే, మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) డిజైన్ చేసిన ఐదు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. వీటిలో ఎక్స్‌యూవీ ఈ8 (XUV.E8), ఎక్స్‌యూవీ ఈ9 (XUV.E9), బిఈ 05 (BE.05), బిఈ 07 (BE.07) మరియు బిఈ 09 (BE.09) మోడళ్లు ఉన్నాయి. ఈ అధునాతన ఎలక్ట్రిక్ కార్లు అన్నీ కూడా మహీంద్రా యొక్క లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫామ్ ఇన్‌గ్లో (INGLO) పై ఆధారపడి డిజైన్ చేయబడ్డాయి. వీటిలో మొదటిగా XUV.E8 ఎలక్ట్రిక్ కారు 2024 డిసెంబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) ప్రారంభం!

మహీంద్రా ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క కాన్సెప్ట్ డిజైన్ లను మాత్రమే వెల్లడి చేసింది. ఇందులో ఏయే కారులో ఎలాంటి పవర్‌ట్రైన్ ను ఉపయోగించబోయేది మరియు వాటి స్పెసిఫికేషన్లు వంటి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, మహీంద్రా XUV.E8 విషయానికి వస్తే, ఇది ఈ లైనప్ నుండి రాబోయే మొదటి ఈవీగా ఉంటుంది. దీని పొడవు 4740 మిమీ, వెడల్పు 1900 మిమీ, ఎత్తు 1760 మిమీ మరియు వీల్‌బేస్ 2762 మిమీ. ప్రస్తుతం మార్కెట్లో హాట్ ట్రెండ్ గా నిలించిన XUV700 ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేశారు. మరో రెండేళ్లలో ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra opens dedicated ev design studio in uk details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X