మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTR పై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ, అభివృద్ధిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా అందరిచూపు తెలంగాణా వైపే పడుతోంది. అంతే కాకుండా తెలంగాణాకు కొత్త కొత్త పరిశ్రమలను తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం కూడా నిరంతరం పాటుపడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త కంపెనీలు కూడా ఇక్కడ నెలకొల్పబడుతున్నాయి. పరిశ్రమలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

తెలంగాణలో మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్‌లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క జహీరాబాద్‌ కంపెనీ ట్రాక్టర్ తయారీ కేంద్రం నుండి ఇటీవల 3,00,001 వ ట్రాక్టర్‌ విడుదలైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క జహీరాబాద్‌ కంపెనీ ట్రాక్టర్ తయారీ కేంద్రం 2012 వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ తయారీ కేంద్రంలో ఇప్పుడు ఏకంగా 3,00,001 వ ట్రాక్టర్ ని సగర్వంగా విడుదల చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలు శాఖామంత్రి కెటి రామారావు (KTR) కూడా పాల్గొన్నారు.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

ఈ ట్రాక్టర్ విడుదల సందర్భంగా KTR మాట్లాడుతూ.. జహీరాబాద్‌లోని మహీంద్రా యొక్క తయారీ కేంద్ర కేవలం భారతీయ మార్కెట్ కి మాత్రమే కాకూండా ప్రపంచ మార్కెట్ కి సైతం ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతోంది. ఇది నిజంగా గర్వకారణమైన విషయం. మొత్తం మీద తెలంగాణా ట్రాక్టర్ ఎగుమతుల్లో ప్రధాన కేంద్రంగా మారినందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

అంతే కాకుండా ఈ సందర్భంగా మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహింద్ర'ను ఉద్దేశించి.. ఆనంద్ మహీంద్రా గారూ చూడండి, నేను మీ ఉత్పత్తులకు ఫోజులిస్తూ, మార్కెటింగ్ చేయడం కోసం ఎలా ప్రచారం కల్పిస్తున్నానో, కాబట్టి మీరు మా రాష్ట్రానికి మరిన్ని వ్యాపార అవకాశాలను కల్పించాలని చమత్కారంగా ట్వీట్ చేశారు.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రీప్లే ఇస్తూ.. మీరు అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఫొటోలకు ఫోజులివ్వడం చూస్తుంటే టాలీవుడ్ ప్రపంచం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం' అంటూ చమత్కరించారు.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ 'హేమంత్ సిక్కా' మాట్లాడుతూ.. మా జహీరాబాద్ కేంద్రం నుంచి 300,001 వ ట్రాక్టర్‌ను విడుదల చేయడం కంపెనీ సాధించిన గొప్ప విజయం. అంతే కాకూండా ట్రాక్టర్ తయారీలో కంపెనీ చేరుకున్న కొత్త మైలురాయి, అన్నారు. కంపెనీ యొక్క ఉత్పత్తులు భారతదేశం మొత్తానికి అందించడమే కాకుండా.. అమెరికా, జపాన్ మరియు యూరప్ వంటి 60 దేశాలకు ఎగుమతి చేయడం కూడా జరుగుతోందన్నారు.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

తెలంగాణలోని జహీరాబాద్ తయారీ కర్మాగారం 2012 లో స్థాపించబడింది. కంపెనీ జహీరాబాద్‌లోని దాని ఫెసిలిటీలో దాదాపు ₹1,087 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ తయారీ కర్మాగారం ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీ కర్మాగారంగా నిలిచింది. ఈ తయారీ కర్మాగారంలో 1,500 కంటే ఎక్కువమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇది సంవత్సరానికి 1,00,000 యూనిట్ల ట్రాక్టర్లను తయారుచేసే సమాటేనని కలిగి ఉంది.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

2013 లో జహీరాబాద్ కేంద్రం నుంచి మొదటి ట్రాక్టర్‌ను విడుదల చేసిన మహీంద్రా 2017 నాటికి ఎగుమతులతో కలిపి ఏకంగా 1,00,000 యూనిట్ ఉత్పత్తి మార్కును చేరుకుంది. 2019 నాటికి కంపెనీ ఉత్పత్తిలో 2,00,000 యూనిట్లను చేరుకుంది. అయితే ఇప్పటికి 3,00,000 యూనిట్ల ఉత్పత్తిని నిరాఘాటంగా పూర్తి చేసింది.

మహీంద్రా ట్రాక్టర్ ఉత్పత్తిలో రికార్డ్ బద్దలు కొట్టిన తెలంగాణ.. KTRపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

తెలంగాణాలోని జహీరాబాద్ కేంద్రం నుంచి 3,00,001 వ మహీంద్రా ట్రాక్టర్ విడుదలకావడం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ ఘనతను పొందింది. రానున్న రోజుల్లో కంపెనీ మరింత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలనీ ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra rolls out 300001th telangana made tractor details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X