కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

'మహీంద్రా' (Mahindra) కంపెనీ తన 'స్కార్పియో క్లాసిక్' ని ఇటీవలే మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ధరలు రేపు (2022 ఆగష్టు 20) వెల్లడవుతాయని ఇప్పటికే తెలిపింది. కావున 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' కొనాలకునే కస్టమర్లకు వాటి ధరలు రేపు తెలిసిపోతాయి. అయితే అధికారిక బుకింగ్స్ కూడా రేపు ధరలు వెల్లడయిన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV తన స్కార్పియో-ఎన్ తో పాటు విక్రయించబడే అవకాశం కూడా ఉంది.

Recommended Video

దేశీయ మార్కెట్లో 'Scorpio Classic' ఆవిష్కరించిన Mahindra | వివరాలు

రేపు భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' (Mahindra Scorpio Classic) గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

మహీంద్రా కంపెనీ యొక్క కొత్త 'స్కార్పియో క్లాసిక్' అనేది దాని మునుపటి మోడల్ ఆయిన 'స్కార్పియో' అప్డేటెడ్ వెర్షన్. ఇది మార్కెట్లో ఎస్ మరియు ఎస్11 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఈ కొత్త SUV ఐదు కలర్ ఆప్సన్స్ లో విడుదల కానుంది. అవి పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

కొత్త అప్డేటెడ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ స్కార్పియో క్లాసిక్‌లో రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఇవ్వబడుతుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడదు. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

కొత్త స్కార్పియో క్లాసిక్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ ఇంటీరియర్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది. రెండవ వరుస ప్యాసింజర్ ల కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్‌ ఉంటుంది. 9 సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

డిజైన్ పరంగా కూడా మహీంద్రా స్కార్పియో అప్డేట్ చేయబడి ఉంది. దీని ముందు భాగంలో కొత్త 'లోగో' ఉంది. అయితే దీనిని మొదటి సారి చూడగానే తప్పకుండా దాని మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తుంది. కానీ ఇందులోని రిఫ్రెష్డ్ ఫ్రంట్ గ్రిల్‌ స్పష్టంగా కొత్తది అని చూపించడంలో సహాయపడతాయి.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 5 స్పోక్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. అయితే ఇవి డైమండ్-కట్ ఫినిషింగ్ పొందుతాయి. డోర్‌లపైన డ్యూయల్ టోన్ క్లాడింగ్‌ కూడా దీనికి మరింత ఆకర్షణను అందిస్తుంది. రియర్ ప్రొఫైల్ దాదాపు మునుపటి మోడల్ మాదిగానే ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది. మొత్తం మీద ఇది మంచి డిజైన్ తో మునుపటికంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

2022 మహీంద్రా స్కార్పియో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంగా పరిమాణంలో కూడా మునుపటి మోడల్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కావున ఇది 4,456 మిమీ పొడవు, 1,820 మిమీ వెడల్పు, 1,995 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2,680 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు విశాలమైన క్యాబిన్ లభిస్తుంది.

కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎప్పుడెప్పుడా అనుకుంటున్న మహీంద్రా యొక్క 'స్కార్పియో క్లాసిక్' విడుదల కావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్కార్పియో ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాము. కానీ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలబడాల్సి వస్తుంది. కావున పోటీ గట్టిగానే ఉంటుంది. మహీంద్రా స్కార్పియో కి సంబంహించిన మరిన్ని వివరాలు తెలుసుకోవానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra scorpio classic price set to be revealed tomorrow details
Story first published: Friday, August 19, 2022, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X