మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఇటీవల భారతీయ మార్కెట్లో రూ. 11.99 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలైన కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' (Mahindra Scorpio Classic) ఆధునిక డిజైన్ కలిగి, అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తూ.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో 'ఎంజి మోటార్స్' (MG Motors) యొక్క 'హెక్టర్ ప్లస్‌' (Hector Plus) కి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

కావున స్కార్పియో క్లాసిక్ మరియు హెక్టర్ ప్లస్‌ యొక్క ధరల వ్యత్యాసం ఏమిటి, ఇంజిన్ పర్ఫామెన్స్ ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

స్కార్పియో క్లాసిక్ vs హెక్టర్ ప్లస్‌ ధరలు:

ఇటీవల భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఎస్ మరియు ఎస్11 వేరియంట్స్. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఇక ఎంజి హెక్టర్ ప్లస్‌ యొక్క ధరల విషయానికి వస్తే, హెక్టర్ ప్లస్ యొక్క మాన్యువల్ వేరియంట్స్ ధరలు రూ. 14.65 లక్షల నుంచి రూ. 20.94 లక్షలు వరకు ఉన్నాయి. అదే సమయంలో ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ. 18.64 లక్షల నుంచి రూ. 20.44 లక్షల వరకు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

డిజైన్ మరియు ఫీచర్స్:

2022 స్కార్పియో క్లాసిక్‌ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 9.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.ఇంటీరియర్ 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఇప్పుడు MG హెక్టర్ ప్లస్ విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆటో హెడ్‌లైట్, ఆటో ఏసీ, పనోరమిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పవర్డ్ టెయిల్‌గేట్, కీలెస్ ఎంట్రీ, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ , రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు ఐ-స్మార్ట్ టెక్నాలజీ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

సేఫ్టీ ఫీచర్స్:

2022 స్కార్పియో క్లాసిక్ డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇంజిన్ స్టార్ట్/స్టాప్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ సేఫ్టీ ఫీచర్స్ మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలకు అనుకూలంగా ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఎంజి హెక్టర్ ప్లస్‌లో కూడా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఇంజిన్:

2022 మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

ఎంజి హెక్టర్ ప్లస్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 143 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 60 లీటర్స్ కెపాసిటీ కలిగిం ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ vs ఎంజి హెక్టర్ ప్లస్‌: పోటాపోటీ.. ఇందులో ఎవరు మేటీ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

'మహీంద్రా స్కార్పియో' మరియు 'ఎంజి హెక్టర్' యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇంజిన్ పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే తక్కువ ధర వద్ద ఎక్కువ ఫీచర్స్ కావాలనుకునే వారికి స్కార్పియో క్లాసిక్ ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో కొంత ఎక్కువ ధర వద్ద కొనుగోలు చేయకునే కస్టమర్లకు ఎంజి హెక్టర్ ప్లస్ మంచి ఎంపిక అవుతుంది. కావున వినియోగదారులు తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Mahindra scorpio classic vs mg hector plus comparison price features engine details
Story first published: Saturday, August 20, 2022, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X