కొత్త స్కార్పియో-ఎన్ విడుదల.. ధర రూ.11.99 లక్షలు మాత్రమే.. బుకింగ్స్ మరియు డెలివరీలు ఎప్పుడంటే..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియో ఎన్ (Mahindra Scorpio-N) నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం బుకింగ్‌లు జూలై 30, 2022వ తేదీ నుండి ప్రారంభమవుతాయని, డెలివరీలు పండుగ సీజన్‌లో ఉంటాయని కంపెనీ పేర్కొంది. కాగా, జులై 5వ తేదీ నుండి దేశంలోని 30 నగరాల్లో ఈ కారు కోసం టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత జులై 15వ తేదీ నుండి ఇతర నగరాల్లో స్కార్పియో ఎన్ టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ఎన్ ధరలు రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మొదటి 25,000 బుకింగ్ లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే ఐదు ట్రిమ్ లలో 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో 6-సీటర్ మరియు 7-సీటర్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

Mahindra Scorpio-N Price
Variant Petrol MT Diesel MT
Z2 ₹11.99 Lakh ₹12.49 Lakh
Z4 ₹13.49 Lakh ₹13.99 Lakh
Z6 - ₹14.99 Lakh
Z8 ₹16.99 Lakh ₹17.49 lakh
Z8L ₹18.99 Lakh ₹19.49 Lakh
మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో భారతదేశంలో మొదటిసారిగా 2002 సంవత్సరంలో ప్రారంభించబడింది. "ఎస్‌యూవీలకే పెద్ద నాన్న" (Big Daddy of SUVs) గా పిలువబడే మహీంద్రా స్కార్పియో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పూర్తిగా సరికొత్త అవతార్‌లో వచ్చింది. ఈ ఇరవై ఏళ్ల కాలంలో మహీంద్రా స్కార్పియో భారత ఎస్‌యూవీ విభాగానికే రారాజుగా నిలిచింది. మహీంద్రా స్కార్పియో యొక్క విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తు కంపెనీ ఈ కొత్త తరం మోడల్ ని పూర్తిగా స్క్రాచ్ నుంచి తయారు చేసింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని లాడర్-ఫ్రేమ్ లేదా బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్స్ పై తయారు చేశారు. ఇది మునుపటి కన్నా మరింత పెద్దగా మరియు ధృడంగా మారింది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ముందు భాగంలో సిక్స్-స్లాట్ క్రోమ్ గ్రిల్‌తో నిటారుగా ఉండే బాక్సీ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు XUV700 లో మొదటి సారిగా కనిపించిన కొత్త 'ట్విన్ పీక్స్' లోగో వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు, 1,857 మిమీ ఎత్తు మరియు 2,750 మిమీ వీల్‌బేస్‌తో పాత మోడల్ కన్నా కాస్తంత పెద్దదిగా ఉంటుంది. పెరిగిన కొలతల కారణంగా క్యాబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తుంది. అయితే, ఇందులో 18 ఇంచ్ వీల్స్ కి బదులుగా చిన్న 17 ఇంచ్ వీల్స్ ని అమర్చబడినప్పుడు దీని ఎత్తు 1,849 మిమీకి తగ్గుతుంది. ఇది సెగ్మెంట్లో కెల్లా పొడవైన మరియు వెడల్పయిన హుడ్ తో గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

ఇతర ఎక్స్టీరియర్ ఫీచర్లలో సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ R18 మరియు R17 అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్, సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్, 7 బాడీ కలర్స్ (డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కెన్యాన్) మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్ మరియు మెటల్ ఫినిష్డ్ డ్యూయల్ రైల్స్‌తో కూడిన బలమైన సెంటర్ కన్సోల్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్స్, హై పొజిషన్డ్ సీట్స్, 17.78cm కలర్ డ్రైవప్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, 6 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్, 2వ వరుసలో కెప్టెన్ సీట్లు, 3వ వరుసలో ఫోల్డబల్ సీట్లు, డ్రైవర్ సీట్ కోసం లంబార్ అడ్జస్ట్ మరియు ఎత్తు సర్దుబాటు చేయగల ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

అంతేకాకుండా, ఇందులో యాంటీ-పించ్‌తో కూడిన డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ వన్ టచ్ పవర్ విండోస్, 2వ వరుస ప్రయాణీకుల కోసం ఏసి కంట్రోల్, ల్యాంప్ మరియు కూలింగ్ ఫీచర్ తో కూడిన గ్లోవ్ బాక్స్, సన్ గ్లాస్ హోల్డర్, మొబైల్ హోల్డర్‌తో కూడిన సీట్ మ్యాప్ పాకెట్, నావిగేషన్‌తో కూడిన 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్రినాక్స్ (AdrenoX)తో 70 కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు, బిల్ట్ ఇన్ అలెక్సా మరియు అలెక్సాతో కూడిన వాట్3వర్డ్స్ (what3words - w3w) ఫీచర్, ఆండ్రాయిడ్ ఆటో (వైర్డ్ మరియు వైర్‌లెస్) మరియు ఆపిల్ కార్‌ప్లే (వైర్డ్మరియు వైర్‌లెస్) కనెక్టివిటీ, 12 స్పీకర్‌లు మరియు డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కెమెరా (ముందు మరియు వెనుక) మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ ఇంజన్ 175 పిఎస్ శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, పెట్రోల్ ఇంజన్ 203 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా 4X4 (ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్ మాత్రం కేవలం డీజిల్ ఇంజన్ తోనే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్ లేదు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల: ధర, ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో క్రాష్ కంప్లైంట్ స్ట్రక్చర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్, సైడ్స్ మరియ కర్టెన్), ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), డ్రైవర్ డ్రౌజీనెస్ అలెర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రిఫిల్, ఇ-కాల్, SOS స్విచ్ ISOFIX మరియు i-SIZE కంపాటబిలిటీ మొదలైనవి ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra scorpio n launched at rs 11 99 lakh details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X