మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మోడళ్లలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కూడా ఒకటి. ప్రస్తుతం, ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావడానికి ముందే చాలా హైప్ క్రియేట్ చేస్తోంది. కంపెనీ కూడా ఈ ఎస్‌యూవీకి సంబంధించి తరచూ పలు టీజర్లను విడుదల చేస్తూ ఈ హైప్ ను మరింత పెంచుతోంది. తాజాగా, స్కార్పియో ఎన్ ఎస్‌యూవీకి సంబంధించి మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

మహీంద్రా తమ స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ గురించి అధికారికంగా ఎటువంటి స్పెసిఫికేషన్‌లను విడుదల చేయనప్పటికీ, ఈ ఎస్‌యూవీకి సంబంధించి లీకైన వివరాలు ఇప్పుడు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. కొత్త వివరాల ప్రకారం, రాబోయే కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ 400 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 172 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 2.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే, ఈ ఇంజన్ యొక్క టార్క్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన వేరియంట్‌లో 370 ఎన్ఎమ్ కి పరిమితం చేయబడుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

అంతే కాకుండా, ఈ కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో కూడా లభ్యం కానుంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎస్‌యూవీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రాబోయే కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్‌లలో అందించే 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో రానుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

ఇదివరకు మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం విడుదల చేసిన టీజర్ లో ఈ ఎస్‌యూవీ 'హైయెస్ట్ కమాండ్ సీటింగ్'ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. లీకైన సమాచారం ప్రకారం, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ ను కలిగి ఉంటుంది. కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ల్యాడర్-ఆన్-ఫ్రేమ్ ఛాస్సిస్ పై నిర్మించబడుతుంది మరియు ఇది అధునాతనమైన పెంటా లింక్ సస్పెన్షన్‌ సెటప్ ను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

అంతేకాకుండా, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆప్షనల్ 4-మోడ్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుందని లీక్ అయిన సమాచారం వెల్లడించింది. దీనికి అదనంగా, ఇది ఏటవాలుగా ఉండే రోడ్లపై సులువుగా ప్రయాణించే 47-డిగ్రీల అవరోహణ మరియు 57-డిగ్రీల ఆరోహణ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్‌లు మరియు "స్కార్పియన్ టెయిల్" డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా ఉన్నాయని లీక్ అయిన సమాచారం వెల్లడిస్తోంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ యొక్క భద్రతా ప్రమాణాలను సూచించేలా కంపెనీ కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా విడుదల చేసింది. వాటి ప్రకారం, ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ (TC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి కొన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఆఫర్ చేయబోయే కొన్ని ప్రధానమైన ఫీచర్లను గమనిస్తే, కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, 3డి సౌండ్ స్టేజింగ్‌తో కూడిన 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్, సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ మొదలైన లేటేస్ట్ ఫీచర్లతో పాటుగా అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

మహీంద్రా స్కార్పియో ఎన్ కలర్ ఆప్షన్లకు సంబంధించిన సమాచారం కూడా ఆన్‌లైన్ లో లీకైంది. ఇది వైట్, సిల్వర్, రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. డిజైన్ పరంగా చూస్తే, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో అవుట్‌గోయింగ్ స్కార్పియో మాదిరిగానే డి నిటారుగా ఉండే ఫ్రంట్-ఎండ్, బాక్సీ ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఒక జత పొడవాటి ర్యాప్‌రౌండ్-స్టైల్ టెయిల్‌ల్యాంప్‌ల నుండి చాలా వరకూ స్ఫూర్తిని పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

ధర విషయానికి వస్తే, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇతర మోడళ్లకు దడ పుట్టించేలా మహీంద్రా తమ కొత్త స్కార్పియో-ఎన్ మోడల్ ను సుమారు రూ. 12 లక్షలకు చేరువగా (ఎక్స్-షోరూమ్‌) అగ్రెసివ్ ప్రైసింగ్ తో విడుదల చేయవచ్చని అంచనా. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మొదటి తరం మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే, ఈ మోడల్ అనేక విధాలుగా మహీంద్రా సంస్థకు గేమ్ ఛేంజర్‌గా మారింది. ఎస్‌యూవీలకే బిగ్ డాడీగా అభివర్ణించబడే మహీంద్రా స్కార్పియోలో కొత్తగా రాబోయే మోడల్ కూడా అతదే తరహాలో విజయం సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి కొత్త వివరాలు లీక్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 కలర్లు మరెన్నో..

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ ని కంపెనీ జూన్ 27, 2022వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. కొత్త స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ ప్రస్తుత స్కార్పియో కన్నా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 మాదిరిగానే ఇందులో కూడా లేన్-కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ వంటి మరెన్నో యాక్టివ్ మరియు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra scorpio n new details leaked ahead of the launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X