India
YouTube

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త స్కార్పియో-ఎన్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

కంపెనీ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించింది. అయితే ఇది దేశం మొత్తం మీద ఇప్పుడు కేవలం 30 నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. అయితే ఈ నెల 15 నాటికి దేశవ్యాప్తంగా టెస్ట్ డ్రైవ్స్ ప్రారభించబడతాయి. ప్రస్తుతం ఈ టెస్ట్ డ్రైవ్స్ ఢిల్లీ, బెంగుళూరు, ముంబై మరియు కలకత్తా వంటి నగరాలలో ప్రారంభమవుతాయి. కావున వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ కోసం సమీప డీలర్‌షిప్‌కి గానీ లేదా ఆన్‌లైన్‌లో ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ వేరియంట్ మరియు ఏ ఇంజిన్ కలిగిన కారుని టెస్ట్ చేయాలనుకునుటున్నారు అనేది కూడా ముందుగానే నమోదులో పేర్కొనవచ్చు.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

ఈ స్కార్పియో-ఎన్ యొక్క బుకింగ్స్ కూడా ఈ నెల 30 నుంచి స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిసింది. డెలివరీలు పండుగ సీజన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త స్కార్పియో-ఎన్ జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8 మరియు జెడ్8ఎల్ అనే ఐదు ట్రిమ్స్ లో లభిస్తుంది. ఇక వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్ అనేది 'డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కెన్యాన్' అనే 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త కారు యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త లోగో వంటివి ఉన్నాయి.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

అంతే కాకుండా, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 'మహీంద్రా స్కార్పియో-ఎన్' ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కెమెరా వంటివి కూడా పొందుతుంది.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కాగా, మరొకటి 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అదే సమయంలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

2022 స్కార్పియో-ఎన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

'స్కార్పియో-ఎన్' టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించిన మహీంద్రా: ఇప్పుడు ఆ నగరాల్లో మాత్రమే..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మహీంద్రా వాహనాలను విపరీతమైన డిమాండ్ ఉంది. కావున ఈ కొత్త స్కార్పియో-ఎన్ కూడా అద్భుతమైన అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే కంపెనీ ఈ కొత్త స్కార్పియో కోసం ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

English summary
Mahindra scorpio n test drives begins today details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X