మహీంద్రా స్కార్పియో-ఎన్ Z4 వేరియంట్ బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

మహీంద్రా కంపెనీ యొక్క స్కార్పియో-ఎన్ గురించి అందరికి తెలుసు. ఈ SUV దేశీయ మార్కెట్లో మంచి స్థాయిలో బుకింగ్స్ పొంది బుకింగ్స్ లో అరుదైన రికార్డ్ బద్దలు కొట్టింది. కాగా ఈ SUV డెలివరీలను ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కాగా ఇప్పుడు బేస్ వేరియంట్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మహీంద్రా కంపెనీ తన స్కార్పియో-ఎన్ ధరలను 2022 జూన్ నెలలోనే ప్రకటించింది. తరువాత 2022 సెప్టెంబర్ చివరి వారం నుంచి డెలివరీలు చేయడం ప్రారంభించింది. అయితే డెలివరీలు చేసేటప్పుడు టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్-8 ఎల్ వేరియంట్ కి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇందులో భాగంగానే కంపెనీ నవరాత్రి సీజన్ లో దాదాపు 7,000 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా ఇప్పుడు జెడ్4 వేరియంట్ మహీంద్రా స్టాక్ యార్డ్ లో కనిపించింది.

స్కార్పియో-ఎన్ Z4 వేరియంట్ బుక్ చేసుకున్నారా.. ఇది మీ కోసమే

ఇటీవల విడుదలైన కొన్ని ఫోటోల ప్రకారం డెలివరీ చేయడంకోసం నిలిపి ఉంచిన స్కార్పియో-ఎన్ జెడ్4 వేరియంట్ చూడవచ్చు. ఇది హాలోజెన్ ల్యాంప్స్, స్టీల్ వీల్స్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ కలిగిన పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. జెడ్4 వేరియంట్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ (పెట్రోల్)/ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (డీజిల్), స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8L వేరియంట్స్. నిజానికి మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 6 సీట్లు మరియు 7 సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా యొక్క కొత్త స్కార్పియో-ఎన్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కావున ఇది సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి పొందుతుంది.

మహీంద్రా కంపెనీ తన స్కార్పియో-ఎన్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక నిముషంలో 25,000 బుకింగ్స్ పొందింది. కాగా 30 నిముషాల్లో ఏకంగా ఒక లక్ష బుకింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా స్కార్పియో-ఎన్ కి మార్కెట్లో ఏ స్థాయిలో ఆదరణ ఉందొ తెలుస్తుంది. కంపెనీ ముందుగా బుక్ చేసుకున్నవారికి డెలివరీలు చేసేస్తోంది, కొంత ఆలస్యంగా బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం ఇంకా కొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra scorpio n z4 variant standing into dealer stockyard
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X