కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో వస్తున్న తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15, 2022వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క టీజర్‌లో స్పోర్ట్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పర్సనలైజేషన్ తో సహా అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటుగా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పలు ఇతర ఫీచర్లను కూడా వెల్లడించారు. మహీంద్రా ఆగస్టు 15న బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిరీస్ లో మొత్తం 5 మోడళ్లను పరిచయం చేయనుంది. ఈ మోడళ్లలో కూపేలు, క్రాస్ఓవర్లు మరియు పెద్ద ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

ఈ నేపథ్యంలో మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కస్టమర్లు ఏమేమి ఫీచర్లను ఆశించవచ్చనే దాని గురించి సమాచారం ఇవ్వబడింది. ఈ అధునాతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మహీంద్రా కంపెనీకి చెందిన యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ లోని ఇంజనీర్లు డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. ఈ లేటెస్ట్ టీజర్ ప్రకారం మహీంద్రా కొత్త వాహనాలలో మొదటగా రాబోయేది క్రాస్ఓవర్ లాగా కనిపించే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

మహీంద్రా తమ ప్రస్తుత పెట్రోల్ / డీజిల్ వాహనాలైన XUV300, XUV700 మోడళ్ల నుండి స్ఫూర్తి పొంది రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఈ బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్ లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్స్‌యూవీ300 ఆధారంగా రూపొందించిన XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బహుశా, ఇదే కంపెనీ నుండి రాబోయే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావచ్చని భావిస్తున్నారు.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

ఈ టీజర్ ఫొటోను గమనిస్తే, ఇందులో C- ఆకారపు ఎల్ఈడి లైట్ ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే, ఎస్‌యూవీ వెనుక భాగంలో ఎల్ఈడి లైట్ స్ట్రిప్ ని కూడా చూడవచ్చు. ఇది స్క్రాచ్ నుండి తయారు చేయబడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. ఇది మహీంద్రా బ్రాండ్ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. ఈ టీజర్‌లో, డిజైన్ బృందం ఫార్ములా ఇ నుండి ఎలా ప్రేరణ పొందుతుందో చూపబడింది మరియు రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో దాని యొక్క కొన్ని జాడలను కూడా మనం గమనించవచ్చు.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

తాజాగా మహీంద్రా టీజ్ చేసిన ఎలక్ట్రిక్ క్రాసోవర్ చిత్రాలను చూస్తుంటే, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో పాటుగా ఇందులోని కొన్ని ఫీచర్లను డ్రైవర్లకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే సౌలభ్యం కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లో టాప్ స్పీడ్ కూడా చూపించబడింది, అయితే పర్సనలైజేషన్ కింద, సీటును ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయడం, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ను సర్దుబాటు చేయడం, మ్యూజిక్ సౌకర్యం, యాంబియంట్ కలర్‌ను సర్దుబాటు చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే, ఆగస్ట్ 15 వరకూ ఆగాల్సిందే.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

మహీంద్రా ప్లాన్స్ ఏమిటి?

మహీంద్రా ఈ నెల 15వ తేదీన ప్రదర్శించే ఎలక్ట్రిక్ వాహనాలలో చాలా వరకూ కాన్సెప్ట్ వాహనాలే ఉండే అవకాశం ఉంది. అయితే, వీటిలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఎక్స్‌యూవీ400 కూడా ఉండొచ్చని సమాచారం. కాగా, ఈ కాన్సెప్ట్ వాహనాలు 2025 నాటికి ఉత్పత్తికి సిద్ధంగా ఉంటాయని మహీంద్రా ధృవీకరించింది. అంతకు ముందు కంపెనీ తెలిపిన దాని ప్రకారం, XUV300 ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ప్రారంభంలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

మహీంద్రా 2027 నాటికి మొత్తం 8 ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీటిలో నాలుగు కంపెనీ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తుల శ్రేణి నుండి తీసుకోబడతాయి మరియు మిగిలినవి పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కానున్నాయి. వీటిలో XUV700 మరియు XUV300 ఎస్‌యూవీల ఆధారంగా రూపొందించిన రెండు ఎలక్ట్రిక్ వెర్షన్‌లు కూడా ఉండే అవకాశం ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

ఇదిలా ఉంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ కొత్త అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేయాలని చూస్తోంది. పూర్తిగా తమ స్వంత యాజమాన్యంలో ఉండే ఓ అనుబంధ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈవీ కో (EV Co.) ను ఏర్పాటు చేస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ఈ మేరకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ (BII) తో కలిసి ఈవీ కో సంస్థలో రూ. 1,925 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మహీంద్రా ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టీజ్ చేసిన మహీంద్రా, త్వరలోనే విడుదల

ఈవీ కో లో బిఐఐ పెట్టుబడి యూకే యొక్క డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌ను చూస్తుంది మరియు మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలో 2.75 శాతం నుండి 4.76 శాతం వరకు ఇంపాక్ట్ ఇన్వెస్టర్‌ను కలిగి ఉంటుంది. ఈవీ కో మహీంద్రా యొక్క ఫోర్-వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతుందని కంపెనీ పేర్కొంది. రాబోయే 2023-24 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఈ కొత్త కంపెనీకి మొత్తం మూలధనం దాదాపు రూ. 8,000 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Mahindra teases new electric suv launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X