మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహనాలలో 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్ కూడా ఒకటి. గడచిన 2020 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం మహీంద్రా థార్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ, ఈ మోడల్‌లో ట్రెడిషన్ 5-డోర్ వెర్షన్ కోరుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా అలాంటి కస్టమర్ల కోసం అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన థార్ ఎస్‌యూవీని తయారు చేసేందుకు కృషి చేస్తోంది.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

మార్కెట్లో గత కొంత కాలంగా మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ బజ్ క్రియేట్ చేస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. అయితే, తాజాగా మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ యొక్క స్పై చిత్రాలు మొదటిసారిగా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. తమిళనాడు రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న ఐదు డోర్ల థార్ ఎస్‌యూవీని వీడియో తీసి ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఎస్‌యూవీ బ్లాక్ అండ్ వైట్‌లో భారీగా క్యామోఫ్లేజ్ చేసినప్పటికీ, దీని టెయిల్ లైట్స్ ఆధారంగా ఇది ఖచ్చితంగా థార్ 5-డోర్ వెర్షన్ అని చెప్పొచ్చు.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

మహీంద్రా థార్ ఎస్‌యూవీ యొక్క ఐదు డోర్ల వేరియంట్‌ను భారతదేశంలో పరీక్షించడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మహీంద్రా ఇప్పటికే ఈ ఏడాది విడుదల చేయాలనుకున్న తమ సరికొత్త మరియు పెద్ద ఎస్‌యూవీలను (ఎక్స్‌యూవీ700 మరియు స్కార్పియో-ఎన్) లను ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో, ఈ కంపెనీ నుండి రాబోయే అతిపెద్ద లాంచ్ కొత్త థార్ 5-డోర్ వెర్షన్ కావచ్చని భావిస్తున్నారు. ఇది ప్రస్తుత 3-డోర్ థార్ కన్నా పొడవుగా ఉంటుంది.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

టెస్టింగ్ దశలో ఉన్న మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ వీడియోని చూస్తుంటే, ఇది దాదాపుగా ఉత్పత్తి దశకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్‌లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ కొత్త మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ రాబోయే ఫోర్స్ గూర్ఖా 5-డోర్ ఎస్‌యూవీ మరియు మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా థార్ ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఇలాంటి స్టైలిష్ వాహనంలో ఎక్కువ మందితో దూర ప్రయాణం చేయాలనుకునే వారికి మరియు పెద్ద కుటుంబాలకు ఇది అంత సౌకర్యవంతమైన ఆప్షన్‌గా లేదు. ప్రస్తుత మహీంద్రా థార్ ఎస్‌యూవీ 3 డోర్లు మరియు 4 సీట్ల కాన్ఫిగరేషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో వెనుక వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మాత్రమే ఉంటాయి. మొదట్లా థార్‌ను కంపెనీ 7-సీటర్‌గా (మధ్యలో బెంచ్ సీట్, వెనుక సైడ్ ఫేసింగ్ సీట్లతో) విడుదల చేసినప్పటికీ, సేఫ్టీ దృష్ట్యా వెంటనే కంపెనీ ఈ వేరియంట్‌ను డిస్‌కంటిన్యూ చేసింది.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌పై కస్టమర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అధిక సీటింగ్ సామర్థ్యం కోసం కంపెనీ ఈ కొత్త థార్ వేరియంట్‌ను ఇటీవల ప్రారంభించిన స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది. ఇది భారీగా సవరించిన థార్ 3-డోర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని గతంలో మహీంద్రా సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ మరియు ఆటోమోటివ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ ఆర్ వేలుసామి కూడా ధృవీకరించిన సంగతి తెలిసినదే.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

అలాగే, మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పొడగించిన వీల్‌బెస్, పెరిగిన సీటింగ్ సామర్థ్యం కారణంగా పెరిగిన బరువును సులభంగా లాగడం కోసం కంపెనీ ఇందులో రీట్యూన్ చేయబడిన మరియు శక్తివంతమైన 2.2-లీటర్, టర్బోచార్జ్డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుత థార్ 3-డోర్ వెర్షన్ లో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో మొదటిది 130bhp గరిష్ట శక్తి మరియు 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపిక.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

ఇకపోతే, రెండవది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 150bhp గరిష్ట శక్తి మరియు 320Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మంచి విషయం ఏంటంటే, ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో కస్టమర్ల అవసరానికి తగినట్లుగా అందుబాటులో ఉంటాయి. కొత్త స్కార్పియో-ఎన్‌లో ఉపయోగించిన 200bhp పవర్‌ఫుల్ 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఈ 5-డోర్ వెర్షన్ థార్‌లో కూడా ఉపయోగించవచ్చని సమాచారం.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

మహీంద్రా ఇటీవల నిర్వహించిన ఫీడ్‌బ్యాక్ సర్వే ప్రకారం, థార్ కస్టమర్‌లలో చాలా మంది 4X4 సెటప్ అవసరం లేదని పేర్కొన్నట్లు గుర్తించింది. హార్డ్-కోర్ ఆఫ్-రోడింగ్ చేసే వారికి మాత్రమే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూవారీ ప్రయాణాలు, సిటీ కమ్యూటింగ్ మరియు దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఆల్-వీల్-డ్రైవ్ ఫీచర్ అంత అవసరం ఉండదు. కాబట్టి, కొత్త 5-డోర్ వెర్షన్ థార్ ఎస్‌యూవీ ఎక్కువగా పీపుల్స్ క్యారియర్‌గా అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ఫీచర్ ను తొలగించే అవకాశం కూడా ఉంది.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్‌లో 4X4 సెటప్‌ను తొలగించడం కారణంగా కంపెనీ మరింత సరసమైన ధరకే కస్టమర్లకు అందించే అవకాశం ఉంది. మరో నివేదిక ప్రకారం, మహీంద్రా 1.5-లీటర్ ఎమ్‌హాక్ 100 డీజిల్ ఇంజన్‌తో మహీంద్రా థార్ యొక్క 4X2 వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. కొనుగోలుదారులకు థార్ ఎస్‌యూవీని మరింత సరమైన ఆప్షన్‌గా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా, ఎక్కువ మైలేజీని కూడా అందించే అవకాశం ఉంటుంది. మరిన్ని తాజా వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

చిత్ర మూలం

Most Read Articles

English summary
Mahindra thar 5 door version spotted while testing first spy images
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X