స్వాతంత్య్ర దినోత్సవం రోజున 5 ఎలక్ట్రిక్ కార్లు ఆవిష్కరించిన మహీంద్రా.. లాంచ్ మరియు ఇతర వివరాలు

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. అవి XUV.E8, XUV.E9, BE.05, BE.07 మరియు BE.09 ఎలక్ట్రిక్ కార్లు. వీటి గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం రండి.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ ఏకకాలంలో 5 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం నిజంగా గొప్ప విషయం. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆశిస్తున్నాము.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహింద్రా కంపెనీ విడుదల చేసినా ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులోని మొదట XUV.E8 ఎలక్ట్రిక్ కారు 2024 డిసెంబర్ 2024 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కార్ విడుదలైన తరవాత మిగిలిన నాలుగు విడుదలవుతాయని కంపెనీ తెలిపింది. అదే సమయంలో కంపెనీ వీటిలో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో తీసుకురావడమే కాకూండా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందించనుంది.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ ఈ 5 ఎలక్ట్రిక్ వాహనాలలోనూ 60 - 80 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అందించే అవకాశం ఉంది. అదే సమయంలో, ఈ కార్లు 175 kW ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 30 నిమిషాల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఇది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లలో RWD మరియు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్స్ రెండూ ఉన్నాయి. ఇవి వరుసగా 231 - 285 బిహెచ్‌పి పవర్ మరియు 340 - 394 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ కార్లు కేవలం 5 నుంచి 6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలవు.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా XUV.E8:

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని 2024 డిసెంబర్ నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున కంపెనీ విడుదల చేయనున్న 5 కార్లలో మొదటి కారు ఇదే అవుతుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది పరిమాణం పరంగా కూడా ఛాలా అనుకూలంగా ఉంటుంది.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా XUV.E8 పొడవు 4740 మిమీ, వెడల్పు 1900 మిమీ, ఎత్తు 1760 మిమీ మరియు వీల్‌బేస్ 2762 మిమీ. ఇది కంపెనీ యొక్క XUV700 ఆధారంగా రూపొందించబడిన మోడల్. అయితే ఇందులో మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. అయితే దీని కోసం 2024 వరకు వేచి చూడక తప్పదు.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా XUV.E9:

మహీంద్రా కంపెనీ విడుదల చేయనున్న మరో ఎలక్ట్రిక్ కారు XUV.E9. ఇది 2025 ఏప్రిల్ నాటికి భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. ఇది కూడా ధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. పరిమాణంలో కూడా ఇతర వాహనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. దీని పొడవు 4790 మిమీ, వెడల్పు 1905 మిమీ, ఎత్తు 1690 మిమీ మరియు వీల్‌బేస్ 2775 మిమీ వరకు ఉంటుంది.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా BE.05:

ఇక మన లిస్ట్ లో మరియు కంపెనీ యొక్క మూడవ మోడల్ ఈ మహీంద్రా BE.05. ఇది 2025 అక్టోబర్ నాటికి భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. మహీంద్రా BE.05 పొడవు 4370 మిమీ, వెడల్పు 1900 మిమీ, ఎత్తు 1635 మిమీ మరియు వీల్‌బేస్ 2775 మిమీ వరకు ఉంటుంది. కంపెనీ యొక్క BE శ్రేణిలో ఇది మొదటి మోడల్ మరియు ఇది పూర్తిగా పునరుద్ధరించబడిన మోడల్. కావున ఇది చాలా కొత్తగా మరియు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా BE.07:

మహీంద్రా BE శ్రేణిలో రెండవ మోడల్ BE.07. ఇది 2026 అక్టోబర్ నాటికీ భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. పరిమాణం పరంగా దీని పొడవు 4565 మిమీ, వెడల్పు 1900 మిమీ, ఎత్తు 1660 మిమీ మరియు వీల్‌బేస్ 2775 మిమీ వద్ద ఉంచబడుతుంది. ఇది పెద్ద మరియు శక్తివంతమైన ఎలక్ట్రిక్ SUV కానుంది.

ఒకేసారి 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా: పూర్తి వివరాలు

మహీంద్రా BE.09:

ఇక మహీంద్రా విడుదల చేయనున్న 5 కార్లలో చివరిది మరియు BE శ్రేణిలో మూడవ మోడల్ BE.09. కంపెనీ ఈ BE.09 ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది కూడా 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అంతే కాకూండా పరిమాణానికి సంబంధించిన సమాచారం కూడా కంపెనీ వెల్లడించలేదు. దీనికి సంబంధిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Most Read Articles

English summary
Mahindra unveiled 5 electric cars e8 e9 be05 be07 be09 launch timeline charging details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X