మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. స్టాండర్డ్ వేరియంట్లతో పోల్చుకుంటే, వాటి కన్నా మరింత శక్తివంతమైన వేరియంట్ ను కంపెనీ ఇందులో ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ (Mahindra XUV300 Sportz Edition) పేరుతో మార్కెట్లోకి రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ XUV300 స్పోర్ట్జ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఆ సమయంలో, మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క స్పోర్టియర్ వెర్షన్ 1.2 లీటర్ ఇంజన్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్ తో వస్తుందని చెప్పబడింది. ఈ అప్‌రేటెడ్ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ఆ సమయంలో వెల్లడించింది. అయితే, ఆ తర్వాతి కాలంలో కంపెనీ స్పెషల్ వేరియంట్ గురించి ఎలాంటి సమాచారం అందించలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

కాగా, ఇప్పుడు ఈ స్పోర్ట్జ్ ఎడిషన్ ఎక్స్‌యూవీ300 మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి సమాచారం ఇప్పుడు ఆన్‌లైన్ లో లీక్ అయ్యింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ 128 బిహెచ్‌పి ఇంజన్‌తో వస్తుందని లీకైన పత్రం వెల్లడించింది. అంతే కాకుండా, ఈ పవర్‌ఫుల్ ఇంజన్ తో కూడిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ నాలుగు ట్రిమ్ స్థాయిలలో అందించబడుతుంది - వీటిలో W4, W6, W8 మరియు W8 (O) వేరియంట్లు ఉన్నట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

మహీంద్రా ఇంకా తమ ఎక్స్‌‌యూవీ300 స్పోర్ట్స్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనప్పటికీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో పెరుగుతున్న పోటీ వాతావరణ నేపథ్యంలో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ ను వీలైనంత త్వరగా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన మోడల్ ను విడుదల చేయడం ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో కంపెనీ తన మార్కెట్ వాటాను మరింత మెరుగుపరచుకోవాలని చూస్తోంది.డానికి వాహన తయారీదారు త్వరలో మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయాలని మేము భావిస్తున్నాము.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ 1.0 టర్బో మరియు కియా సోనెట్ 1.0 టర్బో వంటి మోడళ్ల పోటీపడుతుంది. అయితే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ దాని ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా వస్తుందని ఆశిస్తున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

స్టాండర్డ్ ఎక్స్‌యూవీ300 తో పోల్చుకుంటే, 18 బిహెచ్‌పి అదపు శక్తి మరియు 30 ఎన్ఎమ్ అదనపు టార్క్ తో రాబోయే కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ అవుతుంది. గతంలో కంపెనీ ఆవిష్కరించిన కాన్సెప్ట్‌ తో పోలిస్తే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్జ్ ఎడిషన్ డిజైన్ లో రెడ్ బ్రేక్ కాలిపర్‌లు, ముందు మరియు వెనుక డోర్‌లపై ప్రత్యేకమైన బాడీ డెకాల్స్ (స్టిక్కర్స్) మరియు ఈ స్పోర్టీ థీమ్‌ను మరింత పెంచేందుకు రెడ్ యాక్సెంట్‌లతో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్ కలర్ స్కీమ్ ఉండవచ్చొని అంచనా.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

ఇక, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 విషయానికి వస్తే, ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులోని పెట్రోల్ 1.2-లీటర్ 3-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

అంతే కాకుండా, ఈ రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) తో అందుబాటులో ఉంటాయి. సివిటి లేదా వేరే ఇతర అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో లేవు. ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 బేస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.41 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభం అవుతుండగా, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో కూడిన టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 13.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో రాబోతున్న పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్..! ఆన్‌లైన్‌లో డీటేల్స్ లీక్..!!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క స్పోర్ట్జ్ ఎడిషన్ లో కంపెనీ చేయబోయే మార్పులు చేర్పుల కారణంగా ఈ మోడల్ ధర కాస్తంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. కంపెనీకి ఈ కొత్త ఎక్స్‌యూవీ స్పోర్ట్జ్ ఎడిషన్‌ చాలా కీలకమైన మోడల్ గా మారుతుంది. ఎందుకంటే సబ్-4 మీటర్ విభాగంలో ఈ మోడల్ కు లభిస్తున్న ప్రజాదరణ కంపెనీ మొత్తం అమ్మకాల గణాంకాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇదిలా ఉంటే, మహీంద్రా ఈ నెలలో తమ సరికొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్‌ (2022 Mahindra Scorpio-N)ను విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Source

Most Read Articles

English summary
Mahindra xuv300 might get a sportz edition details leaked online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X