రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ "ఎక్స్‌యూవీ300" (XUV300) ధరలను కంపెనీ భారీగా పెంచింది. ఇందులో డబ్ల్యూ6 మ్యాన్యువల్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ పెంచింది. కస్టమర్ ఎంచుకు వేరియంట్‌ను బట్టి మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) ధరలు రూ.25,000 నుండి రూ.42,000 వరకూ పెరిగాయి. ఏయే వేరియంట్‌పై ఎంత మేర ధరలు పెరిగాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ 'W4' వేరియంట్ ధర రూ.25,000 మేర పెరిగి రూ.8.16 లక్షల నుండి రూ. 8.41 లక్షలకు చేరుకుంది. ఇందులో డీజిల్ ఇంజన్‌ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ ధర రూ.30,000 మేర పెరిగి రూ.9.30 లక్షల నుండి రూ.9.60 లక్షలకు పెరిగింది. డీజిల్ ఇంజన్ మరియు AMT గేర్‌బాక్స్‌తో కూడిన టాప్-ఎండ్ 'W8 O AMT DT' వేరియంట్ ధర రూ.40,000 మేర పెరిగి రూ.13.67 లక్షల నుండి రూ.14.07 లక్షలకు చేరుకుంది.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

కాగా, ఈ వేరియంట్ లైనప్‌లో డీజిల్ ఇంజన్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కూడిన XUV300 W6 AMT వేరియంట్ అత్యధికంగా రూ. 42,000 ధర పెంపును అందుకుంది. తాజా పెంపుతో ఈ వేరియంట్ ధరలు రూ.11.28 లక్షల నుండి రూ.11.70 లక్షలకు పెరిగింది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). పెట్రోల్ ఇంజన్, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే వేరియంట్ల కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

XUV300 Petrol New Price Old Price Difference
W4 MT ₹8.41 Lakh ₹8.16 Lakh ₹25,000
W6 MT ₹9.99 Lakh ₹9.99 Lakh 0
W6 AMT ₹10.51 Lakh ₹10.20 Lakh ₹31,000
W8 MT ₹11.16 Lakh ₹10.84 Lakh ₹32,000
W8 O MT ₹12.38 Lakh ₹12.03 Lakh ₹35,000
W8 O MT DT ₹12.53 Lakh ₹12.18 Lakh ₹35,000
W8 O AMT ₹13.06 Lakh ₹12.69 Lakh ₹37,000
W8 O AMT DT ₹13.21 Lakh ₹12.84 Lakh ₹37,000
రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంటుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. సేఫ్టీ పరంగా చూస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ300లో కంపెనీ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

ప్రస్తుతం, మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ మార్కెట్లో రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 109 bhp శక్తిని మరియు 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 115 bhp శక్తిని మరియు 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లను 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంటాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉన్న అతికొద్ది మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి.

XUV300 Diesel New Price Old Price Difference
W4 MT ₹9.60 Lakh ₹9.30 Lakh ₹30,000
W6 MT ₹10.38 Lakh ₹9.99 Lakh ₹39,000
W6 AMT ₹11.70 Lakh ₹11.28 Lakh ₹42,000
W8 MT Sunroof ₹12.41 Lakh ₹12.05 Lakh ₹36,000
W8 O MT ₹13.23 Lakh ₹12.85 Lakh ₹38,000
W8 O MT DT ₹13.38 Lakh ₹13.00 Lakh ₹38,000
W8 O AMT ₹13.92 Lakh ₹13.52 Lakh ₹40,000
W8 O AMT DT ₹14.07 Lakh ₹13.67 Lakh ₹40,000
రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

మహీంద్రా ఇటీవలే XUV300 యొక్క టాప్-ఎండ్ W8 వేరియంట్‌ను సైలంట్‌గా అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా, మహీంద్రా ఎక్స్‌యూవీ300 SUV యొక్క టాప్-ఎండ్ W8 మరియు W8(O) వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ పరిమాణాన్ని తగ్గించింది. అంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క 2022 మోడళ్లలో గతంలోని టాప్-ఎండ్ W8 వేరియంట్‌లలో అందించిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కి బదులుగా చిన్న సైజులో ఉండే 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ని కంపెనీ ఉపయోగించింది.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

అల్లాయ్ వీల్స్ పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా, కంపెనీ ఈ సైలెంట్ అప్‌డేట్‌లో భాగంగా ఎక్స్‌యూవీ300 యొక్క టైర్ల వెడల్పు కూడా తగ్గించింది. ఇప్పుడు ఈ టైర్లు 215-సెక్షన్ నుండి 205-సెక్షన్‌కు తగ్గించబడ్డాయి. ఈ మార్పు ఇంధన ఆర్థిక వ్యవస్థను (మైలేజ్‌ను) సానుకూలంగా ప్రభావితం చేయగలిగినప్పటికీ, ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క గ్రిప్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా, ఇది మునుపటి మోడల్‌లో ఉన్నంత రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ ఏసి, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.

రూ.42,000 వరకూ పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు; ఏయే వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే..?

రూ.51,000 పెరిగిన మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు

ఇదిలా ఉంటే, మహీంద్రా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ థార్ ధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి థార్ ఎస్‌యూవీ ధరలు రూ.51,000 వరకూ పెరిగాయి. మహీంద్రా ఈ ఏడాదిలో (2022లో) థార్ ధరలను పెంచడం ఇది రెండవసారి. తాజా ధరల పెంపుతో మార్కెట్లో మహీంద్రా థార్ ధరలు రూ. 13.53 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mahindra xuv300 price increased up to rs 42000 new price list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X