దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్‌' (XUV300 TurboSport) విడుదల చేసింది. ఈ కొత్త మహీంద్రా ఎక్స్​యూవీ300 ప్రారంభ ధర రూ. 10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఈ ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్‌ (XUV300 TurboSport) మూడు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి W6, W8 మరియు W8(O). ఇందులోని బేస్ మోడల్ అయిన W6 కేవలం మోనోటోన్ కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 10.35 లక్షలు.

Variant Mono Tone Dual Tone
W6 TGDi ₹10.35 Lakh -
W8 TGDi ₹11.65 Lakh ₹11.80 Lakh
W8 (O) TGDi ₹12.75 Lakh ₹12.90 Lakh
దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

W8 మరియు W8(O) అనేవి మోనోటోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. W8 యొక్క మోనోటోన్ ధర రూ. 11.65 లక్షలు, కాగా డ్యూయెల్ టోన్ ధర రూ. 12.75 లక్షలు. ఇక W8(O) మోనోటోన్ ధర రూ. 11.80 లక్షలు కాగా, డ్యూయెల్ టోన్ ధరలు రూ. 12.90 లక్షల వరకు ఉంటుంది. ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్,ఇండియా.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

మహీంద్రా ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్‌ ఇప్పుడు కొత్త లోగో కలిగి ఉండటమే కాకుండా, నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇందులో మూడు డ్యూయెల్ టోన్ కలర్స్ కాగా, మరొకటి మోనోటోన్ కలర్. డ్యూయెల్ టోన్ కలర్స్ లో 'బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్' ఉన్నాయి. సింగిల్ టోన్ కలర్ లో 'బ్లేజింగ్ బ్రాంజ్' మాత్రమే ఉంది. ఇప్పటికే కంపెనీ XUV300 ని పెర్ల్ వైట్ మరియు నాపోలి బ్లాక్ అనే కలర్స్ లో అందిస్తోంది.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

మహీంద్రా XUV300 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇందులోని ఫ్రంట్ ఫాసియా రెడ్ ఇన్‌సర్ట్‌లతో కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్‌ను పొందుతుంది, అయితే ఫ్రంట్ బంపర్‌లోని సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌లో క్రోమ్ ఎలిమెంట్స్ బ్లాక్ కలర్ లో ఉంటుంది . కొత్త లోగో కూడా ఇక్కడ గమనించవచ్చు.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

XUV300 TGDI (Turbo Gasoline Direct Injection) హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు స్పాయిలర్‌ వంటి వాటిని పొందుతుంది. కావున డిజైన్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్‌పై రెడ్ స్టిచింగ్‌ చూడవచ్చు. ఇది ఇంటీరియర్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, అదే సమయంలో ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12V యాక్సెసరీ సాకెట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

కొత్త మహీంద్రా XUV300 T-GDi ఇప్పుడు 1.2 లీ త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 130 పిఎస్ పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఈ అప్డేటెడ్ ఇంజిన్ ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ కంటే మంచి పనితీరుని అందిస్తుంది. మైలేజ్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

ఇక చివరగా ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఇమ్మొబిలైజర్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం మొదలైనవి ఉన్నాయి. కావున వాహన వినియోగదారులకు భద్రత పరంగా కూడా అద్భుతమైన ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV300 TGDI విడుదల: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఈ పండుగ సీజన్ లో మహీంద్రా కంపెనీ తన కొత్త XUV300 T-GDi ని ఆకర్షణీయమైన ధర వద్ద విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే అమ్మకాల పరంగా ఎలాంటి వృద్ధిని నమోదు చేస్తుంది అనేది తెలియరావాలి.

Most Read Articles

English summary
Mahindra xuv300 turbosport launched at rs 10 35 lakh details
Story first published: Friday, October 7, 2022, 12:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X