షాకింగ్ రేంజ్‌తో వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400).. ఫుల్ చార్జ్‌పై 456 కిలోమీటర్లు!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన అధునాతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400) ని కంపెనీ నేడు (సెప్టెంబర్ 8, 2022) అధికారికంగా ఆవిష్కరించింది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఈ ఎలక్ట్రిఫైయింగ్ ఎస్‌యూవీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో చూద్దాం రండి.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చాలా స్టైలిష్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్‌గా సింపుల్‌గా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బుజ్జి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ పూర్తి బ్యాటరీ చార్జ్ పై భారతీయ డ్రైవింగ్ పరిస్థితులలో (MIDC) 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అమ్మకాలు జనవరి 2023లో ప్రారంభం కానున్నాయి.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 స్పెక్స్, రేంజ్ మరియు డైమెన్షన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 147.5 బిహెచ్‌పి గరిష్ట పవర్ ను మరియు 310 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేసే ఒక పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ ఉంటుంది. ఇది కారులో అమర్చిన శక్తివంతమైన 39.5kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (MIDC) ప్రకారం, పూర్తి ఛార్జింగ్‌ పై456 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం ఈ బ్యాటరీ ప్యాక్ IP67 రేటింగ్ ను కూడా పొందింది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 3 రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మహీంద్రా ఇందులో అతుకులు లేని డ్రైవింగ్‌ను అనుమతించే 'లైవ్లీ' అనే సింగిల్ పెడల్ డ్రైవ్ మోడ్‌ను కూడా అందిస్తుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ400 కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, ఇది గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 4 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 యొక్క బ్యాటరీ ప్యాక్ 50kW DC సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుందని మహీంద్రా పేర్కొంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, ఇది స్టాండర్డ్ 7.2 kW/32A అవుట్‌లెట్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు, ఇది 0 నుండి 100 శాతం ఛార్జ్‌ కావడానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. దాని కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన స్టాండర్డ్ 3.3 kW/16A డొమెస్టిక్ సాకెట్‌ సాయంతో చార్జ్ చేసినప్పుడు, బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి 13 గంటల సమయం పడుతుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొత్తం పొడవు 4,200 మిమీ, వెడల్పు 1,821 మిమీ మరియు ఎత్తు 1,634 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క వీల్‌బేస్ 2,600 మిమీగా ఉంది మరియు దీని బూట్ స్పేస్ సామర్థ్యం 378 లీటర్లుగా ఉంటుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 డిజైన్ మరియు ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 కంపెనీ తొలిసారిగా ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించిన eXUV300 కాన్సెప్ట్‌కు చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూలింగ్ అవసరాల కోసం కంపెనీ ఇందులోని ఫ్రంట్ ఎండ్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ రెండింటినీ మూసివేసింది. అయినప్పటికీ, ఫేక్ గ్రిల్ సాయంతో ఫినిష్ చేయబడి ఉంటుంది. కాబట్టి, చూడటానికి ముందు వైపు నిజంగా గ్రిల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

కారు ముందు భాగంలో ఫేక్ ఫ్రంట్ గ్రిల్ పై కాపర్-కలర్ మహీంద్రా ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ కాపర్ కలర్ ఎలిమెంట్స్ కొత్త ఎక్స్‌యూవీ400 ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ అల్లాయ్ వీల్స్‌ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 దాని పెట్రోల్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 మాదిరిగానే అనేక ఫీచర్లతో లోడ్ చేయబడి ఉంటుంది. వీటిలో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీరు డ్రైవ్ చేసే రూట్‌ లో ఉండే ఛార్జింగ్ స్టేషన్‌లు మరియు ఇతర సౌకర్యాలను హైలైట్ చేయడం ద్వారా మీ రూట్‌లను ప్లాన్ చేయడంలో మీకు సహాయపడతాయి. ఈ కనెక్ట్ చేయబడిన కార్ సూట్ మీ ఎక్స్‌యూవీ400 యొక్క ఏసి మరియు ఇతర లక్షణాలను రిమోట్‌గా కంట్రోల్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 కలర్ ఆప్షన్లు, లాంచ్ టైమ్‌లైన్, టెస్ట్ డ్రైవ్‌లు, బుకింగ్‌లు మరియు డెలివరీలు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ ఐదు ఆకర్షణీయమైన రంగులలో విడుదల చేయనుంది. వీటిలో ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి (చివరి రెండూ డ్యూయెల్ టోన్ కలర్లు). మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కస్టమర్ టెస్ట్ డ్రైవ్‌లు డిసెంబర్‌ 2022లో ప్రారంభం కానున్నాయి.

XUV400 ఆవిష్కరణ, ఫుల్ చార్జ్‌పై 456 కిమీ రేంజ్!

ఇక ధరలు మరియు బుకింగ్‌ల విషయానికి వస్తే, జనవరి 2023 లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభ తేదీని మరియు ధరల వివరాలను వెల్లడి చేయనుంది. ప్రస్తుతానికి, ఈ ఎస్‌యూవీ యొక్క డిజైన్ వివరాలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ కారు డెలివరీలు జనవరి 2023 చివరి నాటికి ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra xuv400 electric suv revealed with 456 km range on full charge more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X