భారత్‌లో ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా

'మహీంద్రా అండ్ మహీంద్రా' నిన్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకటి, రెండు కాదు.. ఏకంగా 5 ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అంతే కాకుండా.. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న 'ఎక్స్​యూవీ400' (XUV400) ను మహీంద్రా ఓ కొలిక్కి తీసుకురావడానికి పూనుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తన XUV400 ఎలక్ట్రిక్ SUV 2022 సెప్టెంబర్‌లో ప్రారభించబడే అవకాశం ఉంది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV కానుంది. నిజానికి ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. అయితే ఇకపై ప్రొడక్షన్ కి సిద్ధమవుతోంది. కావున ఇది భారతీయ రోడ్లమీద తిరగటానికి ఇక ఎన్నో రోజులు లేదని స్ఫష్టంగా తెలుస్తోంది.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా ఇప్పటికే చాలా సార్లు తన కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV ని టెస్టింగ్ చేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన చాలా ఫోటోలు మరియు ఇతర వివరాలు ఇదివరకటి కథనాల్లోనే చూసాము, కావున ఇది త్వరలోనే వినియోగంలోకి రావడానికి సిద్ధమవుతోంది. 2024 మరియు 2026 సంవత్సరాల్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించాలి అనే ప్రణాలికను కంపెనీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. అటువంటి సమయంలో ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే మొదటి మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ SUV కానుంది.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

XUV400 SUV యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌ను 2022 ఆగస్టు 15 న విడుదల చేసే అవకాశం ఉందని భావించారు, కానీ ఇది సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ కంపెనీ దీని పైన ఎటువంటి సమాచారం అందించలేదు. అయితే దీని ఉత్పత్తి ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది, కావున 2023 ప్రారంభం నాటికి అధికారికంగా దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ధర మొదలైనవన్నీ కూడా అదే సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నాము.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా XUV400 అనేది కంపెనీ యొక్క 'ఎలక్ట్రిక్ స్కేలబుల్ అండ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్' ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. కావున ఇది అత్యంత పవర్ పుల్ ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో దూసుకెళ్తున్న టాటా నెక్సాన్ వంటి వాటికీ సరైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. ఇందులో స్ట్రీమ్‌లైన్డ్ దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి, అదే సమయంలో హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో LED DRL ఉన్నాయి. అంతే కాకుండా ఇది ఫ్రంట్ ఎండ్ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ మరియు ట్రయాంగిల్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లతో కూడిన షార్ప్ కాంటౌర్డ్ బంపర్‌ను కలిగి ఉంది. XUV400 మరియు XUV300 యొక్క గ్లాస్ హౌస్ మరియు క్యారెక్టర్ లైన్‌లు ఒకే విధమైన ప్రొఫైల్‌ను పంచుకుంటాయి.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా XUV400 ఇటీవలి 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో కనిపించింది. రియర్ ప్రొఫైల్ లో కొత్త ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు మరియు మరింత స్పష్టమైన లైసెన్స్ ప్లేట్ హౌసింగ్‌తో రీప్రొఫైల్డ్ టెయిల్‌గేట్‌ వంటివి ఉన్నాయి.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా కంపెనీ ప్లాన్ ప్రకారరం, 2027 నాటికి భారతీయ మార్కెట్లో 8 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలి. ఇప్పటికే నిన్న (2022 ఆగష్టు 15) 5 ఎలక్ట్రిక్ కార్లను వెల్లడించింది. మహీంద్రా XUV400 మరో ఎలక్ట్రిక్ SUV కానుంది, మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాలను గురించి కంపెనీ త్వరలోనే సమాచారం అందిస్తుంది.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా యొక్క 5 ఎలక్ట్రిక్ కార్లు:

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో నిన్న XUV.E8, XUV.E9, BE.05, BE.07 మరియు BE.09 అనే 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కార్లు అన్నీ కూడా ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడతాయి. అదే సమయంలో ఇవి లేటెస్ట్ డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు మంచి భద్రతా సామర్థ్యాన్ని కూడా అందించనుంది. కావున ఇవి వాహనం వినియోగదారులకు తప్పకుండా చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

మహీంద్రా కంపెనీ విడుదల చేయనున్న ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు 2024 నుంచి 2026 లోపు అధికారికంగా విడుదలవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఇతర ఫీచర్స్ మరియు బ్యాటరీ ప్యాక్ వంటి వాటి గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడవుతాయి.

భారత్‌లో ఎక్స్​యూవీ400 లాంచ్ అప్పుడే.. మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న క్రమంలో మహీంద్రా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అంతగా రాణించడం లేదు, అయితే కంపెనీ ప్రస్తావించిన ఈ ఎలక్ట్రిక్ కార్లు దేశీయ మార్కెట్లో విడుదలైతే తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని శాసించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra xuv400 electric suv to be launched in 2022 september details
Story first published: Tuesday, August 16, 2022, 12:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X