Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 18 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్ళీ స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త ఎక్స్యువి700 (XUV700) SVU విడుదల చేసింది. అయితే కంపెనీ మరోసారి XUV700 యొక్క కొత్త వేరియంట్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. కంపెనీ టెస్ట్ చేస్తున్న ఈ SUV 6 సీట్ల వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. XUV700 ని కెప్టెన్ సీటుతో తీసుకురావాలని కస్టమర్లు కంపెనీని డిమాండ్ చేస్తున్నారు, కావున కంపెనీ ఇప్పుడు దీనిపై పనిచేస్తోంది.

రెండవ వరుసలో రెండు వైపులా హెడ్‌రెస్ట్‌లు ఉండటం మీరు ఈ టెస్టింగ్ XUV700 లో చూడవచ్చు. అయితే కెప్టెన్ సీటులా కనిపిస్తుందని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కానీ ఇప్పుడు కూడా కంపెనీ దీని యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ గురించి వెల్లడించలేదు. ఈ కోట్ మోడల్ త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇందులో సీటింగ్ తప్ప ఇతర మార్పులు ఏమి ఉండే అవకాశం లేదు.

Mahindra XUV700 ఇప్పటివరకు ఏ మోడల్లోనూ కనిపించని కెప్టెన్ సీట్ ఆప్షన్‌తో అడెర్నోఎక్స్ యాప్‌లో చూడవచ్చు, కాబట్టి కంపెనీ తన 6 సీట్ల అవతార్‌ను కూడా విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం, 5 సీట్లలో బెంచ్ సీటు మరియు 7 సీట్లలో మధ్య వరుసలో కూడా ఇవ్వబడింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఈ 6 సీట్ల కారు గురించి మరింత సమాచారం అందిస్తుంది.

కెప్టెన్ సీటుతో ఈ SUV ని తీసుకురావడానికి కంపెనీకి కస్టమర్ల నుండి చాలా స్పందన వస్తోంది, అయితే ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. కంపెనీ ఈ 6 సీట్ల వేరియంట్‌ను మిడ్ నుండి టాప్ వేరియంట్ వరకు అందుబాటులోకి తీసుకురాగలదు ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యామిలీ కస్టమర్లలో కూడా కెప్టెన్ సీటు ట్రెండ్ పెరిగింది, కాబట్టి కంపెనీ దీనిని త్వరలోనే తీసుకురానుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహీంద్రా XUV700 మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయించబడుతోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్లు. దేశీయ మార్కెట్లో ఇది మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మహీంద్రా కంపెనీ దాని XUV700 AX7 AWD వేరియంట్ డెలివరీలను కూడా ప్రారంభించింది. మహీంద్రా కంపెనీ గత అక్టోబర్ నెలలో XUV700 AX7 ని పరిచయం చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. XUV700 విడుదల సమయంలో కస్టమర్ల డిమాండ్ మేరకు కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది. ఇది కూడా చాలా అద్భుతమైన మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Image Courtesy: Chandrasekhar Vishnuvajhala