Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 18 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Mahindra XUV700 కొత్త ధరల జాబితా: పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గత సంవత్సరంలో కొత్త మహీంద్రా ఎక్స్యువి700 (Mahindra XUV700) విడుదల చేసింది. ఈ SUV మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ 2022 కొత్త సంవత్సరంలో కంపెనీ XUV700 ధరను పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, మహీంద్రా తన XUV700 SUV ధరను ఇప్పుడు రూ. 46,000 నుండి రూ. 81,000 వరకు పెంచింది. ఇందులో XUV700 యొక్క పెట్రోల్ వెర్షన్ మీద కంపెనీ రూ. 75,000 వరకు పెంచింది, అదే సమయంలో XUV700 డీజిల్ ధరను రూ. 81,000 పెంచింది. ధరల పెరుగుదల తరువాత XUV700 యొక్క ప్రారంభ ధర రూ. 12.95 లక్షలు కాగా, XUV700 టాప్ వేరియంట్ ధర రూ. 23.80 లక్షలకు చేరింది.

మహీంద్రా XUV700 అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలను పొందగలిగింది. కంపెనీ ఈ SUV యొక్క బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 3 గంటల్లో 75,000 బుకింగ్‌లను స్వీకరించింది. అక్టోబర్ 8 న దీని ధర రూ. 40,000 నుండి 50,000 వరకు పెరిగింది. అయితే ఇప్పుడు ఈ SUV ధర మరొక్క సారి పెరిగింది.

మహీంద్రా XUV700 పెట్రోల్ ధరలు:
- ఎమ్ఎక్స్ మాన్యువల్ - రూ. 12.95 లక్షలు
- ఏఎక్స్3 మాన్యువల్ - రూ. 15.02 లక్షలు
- ఏఎక్స్3 ఆటోమేటిక్ - రూ. 16.57 లక్షలు
- ఏఎక్స్5 మాన్యువల్ - రూ. 16.05 లక్షలు
- ఏఎక్స్5 మాన్యువల్ 7 సీటర్ - రూ. 16.67 లక్షలు
- ఏఎక్స్5 ఆటోమేటిక్ - రూ. 17.70 లక్షలు
- ఏఎక్స్7 మాన్యువల్ 7 సీటర్ - రూ. 18.63 లక్షలు
- ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ - రూ. 20.28 లక్షలు
- ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ ఎల్ - రూ. 22.04 లక్షలు

మహీంద్రా XUV700 డీజిల్ ధరలు:
ఎమ్ఎక్స్ మాన్యువల్ - రూ. 13.47 లక్షలు
ఏఎక్స్3 మాన్యువల్ - రూ. 15.53 లక్షలు
ఏఎక్స్3 మాన్యువల్ 7 సీటర్ - రూ. 16.26 లక్షలు
ఏఎక్స్3 ఆటోమేటిక్ - రూ. 17.29 లక్షలు
ఏఎక్స్5 మాన్యువల్ - రూ. 16.67 లక్షలు
ఏఎక్స్5 మాన్యువల్ 7 సీటర్ - రూ. 17.29 లక్షలు
ఏఎక్స్5 ఆటోమేటిక్ - రూ. 18.32 లక్షలు
ఏఎక్స్5 ఆటోమేటిక్ 7 సీటర్ - రూ. 18.94 లక్షలు
ఏఎక్స్7 మాన్యువల్ 7 సీటర్ - రూ. 19.25 లక్షలు
ఏఎక్స్7 మాన్యువల్ ఎల్ - రూ. 21.01 లక్షలు
ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ - రూ. 20.90 లక్షలు
ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ ఏడబ్ల్యుడి - రూ. 22.25 లక్షలు
ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ ఎల్ - రూ. 22.66 లక్షలు
ఏఎక్స్7 ఆటోమేటిక్ 7 సీటర్ ఎల్ ఏడబ్ల్యుడి - రూ. 23.80 లక్షలు

మహీంద్రా కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన సమయంలో మొదటి 50,000 యూనిట్లకు మాత్రమే ఎటువంటి ధర పెరుగుదల లేకుండా అందించడం జరుగుతుంది. అయితే 50,000 తరువాత బుక్ చేసుకున్న కస్టమర్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ 2021 డిసెంబర్ నాటికీ 11,984 యూనిట్లను డెలివరీ చేసింది. కావున మొత్తం బుక్ చేసుకున్న సంఖ్యను డెలివరీ చేయడానికి దాదాపు ఒక సంవత్సరానికి పైగా వేచి ఉండాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు ఎక్కువ నిరాశను కలిగిస్తుంది.

మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఈ లేటెస్ట్ SUV ని 6 సీట్ల వేరియంట్లో కూడా తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేసింది. ఇది కెప్టెన్ సీటుతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికి వెలువడిన చిత్రాల ప్రకారం, ఇది మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో రానున్నట్లు తెలిసింది.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.

మహీంద్రా XUV700 కి ఇప్పటికి కూడా మంచి డిమాడ్ ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ అకస్మాత్తుగా ధరలు పెంచడం వల్ల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనిపిస్తుంది. అయితే ధరల పెరుగుదల అమ్మకాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు మంచి అమ్మకాలను పొందగలదా అనే మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.