Just In
- 16 min ago
ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..
- 16 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 17 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 20 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
Don't Miss
- News
సొంతపార్టీనేతలే బండి సంజయ్ కు షాక్ ఇస్తున్నారా? చేరికల అడ్డగింతపై అగ్రనేతలకు బండి కంప్లైంట్!!
- Finance
Fuel Prices Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
- Sports
India Playing XI vs Ireland: ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం.. తొలి టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!
- Movies
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియోలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్తలలో మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఒకరు. కొన్నిసార్లు ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్ లు సరదాగా నవ్వు తెప్పించేలా ఉంటాయి. తాజాగా, ఆనంద్ మహీంద్రా తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 (XUV700) వెయిటింగ్ పీరియడ్ గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందరీ లాగే తాను కూడా కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్యూవీ డెలివరీ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది అక్టోబర్ నెలలో తమ కొత్త ఎక్స్‌యూవీ700 కోసం బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీపై అప్పటికే భారీ అంచనాలు ఉండటంతో, బుకింగ్ లు ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే 50,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి. అవి కాస్తా ఈ ఏడాది ఆరంభం నాటికి 1 లక్ష యూనిట్లకు చేరుకున్నాయి. ఈ మధ్యలో ఎక్స్‌యూవీ700 ధరలు మరియు వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగినప్పటికీ, కస్టమర్లు మాత్రం ఈ కారు కోసం వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా, దీని వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.

ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంతలా పెరిగిపోయిందంటే, కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రానే తమ కారు కోసం నెలల తరబడి వేచి ఉండేంతలా పెరిగిపోయింది. థామస్ కప్ గెలిచిన జట్టు సభ్యుడు చిరాగ్ శెట్టి, తాను కూడా కొత్త ఎస్యూవీ700 ని బుక్ చేశానని, అది త్వరలోనే తనకు డెలివరీ అవుతుందని ఆశిస్తున్నానని ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా రిప్లై ఇస్తూ.. తాను కూడా తన భార్య కోసం ఓ ఎక్స్‌యూవీ700 బుక్ చేశానని, డెలివరీ కోసం తాను కూడా క్యూలో వేచి ఉన్నానని సరదాగా రిప్లై ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా ఉద్దేశ్యం ప్రకారం, ఎక్స్‌యూవీ700 వాహనానికి సప్లయ్ కి మించి విపరీతంగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను తీర్చేందుకు కంపెనీ రేయింబవలు కష్టపడుతోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్ షార్టేజ్ మరియు ఇతర సప్లయ్ చైన్ అంతరాయల కారణంగా, కంపెనీ ఈ కారును వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయలేకపోతోంది. ఫలితంగా, తానే కాకుండా ఇతర కస్టమర్లు కూడా ఈ కారు కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సమాచారం ప్రకారం, ఈ ఎస్యూవీ కోసం ప్రస్తుతం సుమారు 7-8 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది దాని సేఫ్టీ. సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ ఈ కారును రూపొందించింది. అంతేకాకుండా, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. అలాగే, దీని డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు కూడా టాప్ నాచ్ గా ఉంటాయి.

ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్పి పవర్ ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్స్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో డ్యాష్‌బోర్డులో డ్యూయల్-డిస్ప్లే సెటప్ (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్లు ఉన్నాయి. దీనితో పాటు, యాక్ససరీస్ ప్యాక్‌లను కూడా అందుబాటులో ఉంచారు. ఇది మొత్తం 5 కలర్ ఆప్షన్లలో అందుబటులో ఉంటుంది. వీటిలో రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ ప్రారంభ ధర రూ. 12.95 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 23.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.