కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

భారతదేశంలో కార్లు చాలా సురక్షితంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఖరీదైన కార్లలో మాత్రమే లభించే ఎయిర్‌బ్యాగ్ ఫీచర్ చవకైన ప్యాసింజర్ కార్లలో కూడా ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్‌గా అందుబాటులోకి వచ్చింది. మొదట్లో కస్టమర్లు ఈ ఎయిర్‌బ్యాగ్ ఫీచర్‌ను పొందడం కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆ తర్వాతి కాలంలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశారు. కాగా, ఇటీవలే అన్ని కార్లలో ఫ్రంట్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) తప్పనిసరి చేశారు. కాగా, వచ్చే నెల నుండి కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానున్నాయి.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

ప్రయాణీకుల భద్రత దృష్ట్యా భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలని, అక్టోబర్ 2022 నెల నుండి ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వాహన తయారీదారులు అక్టోబర్ నెల నుండి తయారు చేసే అన్ని ప్యాసింజర్ వాహనాలలో తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగులు (రెండు ఫ్రంట్, రెండు షోల్డర్ మరియు రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్) అమర్చాల్సి ఉంటుంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

అయితే, ఈ నిబంధన అమలు కావడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఇది ఇప్పట్లో అమలయ్యే సూచనలు కనిపించడం లేదని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధన అమలు కావడానికి మరో 18 నెలల సమయం పట్టవచ్చని ఆటోకార్ ఇండియా యొక్క కొత్త నివేదిక పరిశ్రమ మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ కొత్త నిబంధన అమలు కారణంగా ఉత్పన్నమయ్యే అదనపు ఎయిర్‌బ్యాగ్ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశంలో తగినంత ఎయిర్‌బ్యాగ్‌ల తయారీ సామర్థ్యం లేదని సదరు నివేదిక పేర్కొంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

భారతదేశంలోని కార్ల తయారీదారులు ఈ కొత్త భద్రతా నిబంధనను పాటించడంలో సహాయపడటానికి ఎయిర్‌బ్యాగ్‌ల డిమాండ్‌ను తీర్చడం కోసం, దేశీయ కాంపోనెంట్ (విడిభాగాల) తయారీదారులు ఏటా 18 మిలియన్ ఎయిర్‌బ్యాగ్‌లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అంటే, ఇది ప్రస్తుతం ఏటా సుమారు 6 మిలియన్ ఎయిర్‌బ్యాగ్‌లను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. విడిభాగాల తయారీ సంస్థలు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

ఏప్రిల్ 2021లో అన్ని కార్లలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన తప్పనిసరి చేయబడింది. అయితే, పైన పేర్కొన్న పరిస్థితుల కారణగా, ఇప్పుడు అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్ నియమాన్ని అమలు చేయడాన్ని భారత ప్రభుత్వం ఏప్రిల్ 2024 వరకు ఆలస్యం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ విషయంపై భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయంపై ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

కార్లలో తప్పనిసరి 6 ఎయిర్‌బ్యాగ్‌ల నియమాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం తయారీదారులకు అదనంగా మరో 18 నెలల సమయం ఇచ్చినట్లయితే, ఇది దేశంలో ఎయిర్‌బ్యాగ్‌ల ఉత్పత్తి స్థాయిలను విస్తరించేందుకు అవసరమైన మార్పులను అమలు చేయడానికి వారికి తగినంత సమయం కల్పించినట్లు అవుతుంది. అదే సమయంలో, కార్లలో అదనపు భద్రతా పరికరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులను చేయడానికి కూడా కార్ల తయారీదారులకు సహాయం చేస్తుంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను పెంచాల్సిన ఆవశ్యకత గురించి అనేక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు మరియు కార్ మేకర్లను కూడా ఈ విషయంలో సహకరించాల్సిందిగా అభ్యర్థనలు కూడా చేశారు. అయితే, ఈ నిబంధనను వేగంగా అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి పరిశ్రమ నుండి పూర్తిగా సానుకూల స్పందన రాలేదు. కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను పెంచడం వలన తయారీ ఖర్చు పెరుగుతుందని, ఫలితంగా కార్ల ధరలు కూడా పెరుగుతాయని, తద్వారా కార్ల అమ్మకాలు తగ్గుతాయని కార్ కంపెనీలు వాపోతున్నాయి.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

అయితే, నితిన్ గడ్కరీ తెలిపిన దాని ప్రకారం, కార్లలో చేర్చే ఒక్కో అదనపు ఎయిర్‌బ్యాగ్ కు సుమారు రూ.1,000 వరకూ మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే, ఈ లెక్కన 6 ఎయిర్‌బ్యాగ్ లను చేర్చడానికి రూ.6,000 ఖర్చు అవుతుంది. కాబట్టి, ఈ తప్పనిసరి నిబంధన పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చినట్లయితే, కార్ల తయారీదారులు తమ కార్లలో జోడించిన అదనపు ఎయిర్‌బ్యాగ్ లకు అయ్యే ఖర్చుని పూర్తిగా వినియోగదారులపై మోపే అవకాశం ఉంటుంది. ఫలితంగా, కార్ల ధరలు మరో కొన్ని వేల రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉంది.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

వెనుక సీట్లలో కూర్చునే వారు కూడా సీట్‌బెల్టు ధరించడం తప్పనిసరి

ఇదిలా ఉంటే, ఇటీవల ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారులో వెనుక సీటులో కూర్చొని ప్రయాణిస్తూ, సీట్ బెల్ట్ ధరించని కారణంగా ఆయన చనిపోయినట్లు అధికారులు, వైద్యులు ధృవీకరించారు. ఆయన వెనుక సీటులో సీట్ బెల్టులు ధరించని కారణంగా కారులో రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా విచ్చుకోలేదని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించాయి.

కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల తప్పనిసరి రూల్ ఇప్పట్లో లేనట్లే..! పూర్తిస్థాయిలో అమలుకి మరింత సమయం పట్టొచ్చు..!!

ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్లలో వెనుక సీట్లలోని కూర్చుని ప్రయాణించే ప్రయాణీకులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్టులను ధరించాలనే నిబంధనను ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ నిబంధనను పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలను కూడా విధిస్తున్నారు. అంతేకాకుండా, ఫ్రంట్ సీట్లకు ఉన్న సీట్ బెల్ట్ రిమైండర్ల మాదిరిగానే వెనుక సీట్లలో కూడా సీట్ బెల్ట్ రిమైండర్లను ఇన్‌స్టాల్ చేయనున్నారు. మొత్తమ్మీద చూస్తుంటే, మనదేశంలోని కార్లు కూడా ఇతర దేశాల్లో మాదిరిగా చాలా సురక్షితంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

Most Read Articles

English summary
Mandatory 6 airbags rule in cars might be delayed by another 18 months report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X