Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్లో తన కొత్త మారుతి సెలెరియో (Maruti Celerio) CNG వెర్షన్ విడుదల చేసింది. ఈ కొత్త సెలెరియో సిఎన్‌జి ధర రూ. 6.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త వెర్షన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కొత్త సెలెరియో CNG గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

కొత్త సెలెరియో సిఎన్‌జి మోడల్ ఇతర CNG మోడళ్ల మాదిరిగా కాకుండా.. కంపెనీ యొక్క బేస్ LXi వేరియంట్‌కు వ్యతిరేకంగా మిడ్-స్పెక్ VXi ట్రిమ్‌లో అందించబడుతోంది. సాధారణ సెలెరియో కంటే కూడా కొత్త సెలెరియో CNG ధర దాదాపు రూ. 95,000 ఎక్కువగా ఉంటుంది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

మారుతి సుజుకి తన మొదటి తరం హ్యాచ్‌బ్యాక్‌ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 6 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ యొక్క అమ్మకాలు విపరీతంగా పెరగడానికి సెలెరియో చాలా సహకరించిందని కంపెనీ తెలిపింది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

కొత్త మారుతి సెలెరియో యొక్క CNG వెర్షన్ పెట్రోల్-బేస్డ్ కారు నుండి అదే 1.0-లీటర్ K10C డ్యూయల్‌జెట్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 57 బిహెచ్‌పి పవర్ మరియు 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్టాండర్డ్ కంటే కూడా 10 బిహెచ్‌పి పవర్ మరియు మరియు 6.9 ఎన్ఎమ్ టార్క్‌ తగ్గుతుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

మారుతి సుజుకి సెలెరియో CNG వెర్షన్ కోసం 35.60km/kg ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇప్పటికే కొత్త సెలెరియో దేశంలో అత్యంత ఇంధన-సామర్థ్యం కలిగిన పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. కావున ఈ కొత్త CNG వెర్షన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

కొత్త సెలెరియో CNG మోడల్ దాని మునుపటి మోడల్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. కానీ ఇందులో టెయిల్ గేట్‌పై అదనపు S-CNG బ్యాడ్జ్‌ పొందుతుంది. అదే సంశయంలో CNG ట్యాంక్‌ను బూట్‌లో అమర్చడం వల్ల బూట్ స్పేస్ చాలావరకు తగ్గుతుంది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

మారుతి సుజుకి సెలెరియో CNG కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,695 మిమీ, వెడల్పు 1,655 మిమీ మరియు ఎత్తు 1,555 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఇది 2,435 మిమీ వీల్‌బేస్ కూడా కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

కొత్త సెలెరియో CNG వెర్షన్ దాని పెట్రోల్ VXi ట్రిమ్ యొక్క దాదాపు అన్ని పరికరాలను పొందుతుంది. ఇందులో ఎయిర్ కండిషనింగ్, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ మరియు స్ప్లిట్-ఫోల్డింగ్ రియర్ సీటు వంటి కిట్ వంటివి ఉన్నాయి.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

మారుతి సెలెరియో CNG వెర్షన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

మారుతి సుజుకి సెలెరియో యొక్క CNG మోడల్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ శాంట్రో CNG మరియు రాబోయే టాటా టియాగో CNG వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త CNG మోడల్ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

ఇప్పటికే దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో యొక్క పెట్రోల్ మోడల్ అందుబటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Maruti Celerio ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు CNG వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు సెలెరియో CNG విడుదలైంది. ఇక ఈ లైనప్ లో మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్, డిజైర్ మరియు వితారా బ్రెజ్జా వంటివి కూడా CNG వెర్షన్ లో వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Maruti celerio cng launched in india find here price mileage and other details
Story first published: Monday, January 17, 2022, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X