రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

మారుతి సుజుకి ఈ 2022 సంవత్సరాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా కోల్పోయిన వ్యాపారాన్ని తిరిగి ఒక్క సంవత్సరంలోనే సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు అన్ని మోడళ్లలో అప్‌డేటెడ్ వెర్షన్లను విడుదల చేసిన మారుతి సుజుకి, కొత్తగా గ్రాండ్ విటారా అనే మిడ్-సైజ్ ఎస్‌యూవీని కూడా ఆవిష్కరించింది. ఇప్పుడు కొత్తగా ఆల్టో కె10 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

గత కొన్ని వారాలుగా మార్కెట్లో హైప్ క్రియేట్ చేస్తున్న కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఎట్టకేలకు రేపు (ఆగస్ట్ 18, 2022వ తేదీన) మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. కొత్త ఆల్టో కె10 ద్వారా భారతదేశంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. గత కొంత కాలంగా దేశంలో మారుతి ఆల్టో అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, కొత్త 2022 ఆల్టో కె10 కంపెనీ ఓ కీలకమైన లాంచ్‌గా నిలువనుంది.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

మారుతి సుజుకి ఇప్పటికే తమ కొత్త 2022 ఆల్టో కె10 కారుకి సంబంధించి అనేక టీజర్లను విడుదల చేసింది. ఈ టీజర్ల ద్వారా కంపెనీ చిన్న కారులో ఏమేమీ ఫీచర్లను అందించనుందో కూడా వెల్లడి చేసింది. మారుతి సుజుకి తమ కొత్త 2022 ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు మారుతి సుజుకి అరెనా డీలర్‌షిప్ కేంద్రాలను సందర్శించడం ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న చిన్న ఆల్టో 800 మరియు గతంలో కంపెనీ విక్రయించిన పాత తరం ఆల్టో కె10 మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 ఆల్టో కె10 పూర్తిగా భిన్నమైన డిజైన్ ను కలిగి ఉంది. అయితే, మొదటిసారిగా దీనిని చూసేవారు, ఇది పెద్ద ఆల్టో 800 అని భ్రమ పడే అవకాశం ఉంది. వాస్తవానికి ఇది ప్రస్తుత ఆల్టో 800 కన్నె పెద్ద సైజులో ఉంటుంది. కంపెనీ యొక్క పాపులర్ హార్టెక్ ప్లాట్‌ఫారమ్ ను ఆధారంగా చేసుకొని కొత్త ఆల్టో కె10 కారును తయారు చేశారు.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

హార్టెక్ ప్లాట్‌ఫారమ్ పై తయారైనందున కొత్త 2022 ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును మరియు 2,380 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. పాత తరం ఆల్టో కె10 తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ 85 మిమీ ఎక్కువ పొడవును మరియు 20 మిమీ ఎక్కువ వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. పెరిగిన పరిమాణం కారణంగా ఈ కారులో మరింత ఎక్కువ స్పేస్ కూడా లభిస్తుంది.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 డిజైన్‌ను గమనిస్తే, ఈ కారు ముందు భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్, గ్రిల్ కి ఇరువైపులా అన్ని లైట్లతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు ఈ ఫ్రంట్ గ్రిల్ కి దిగువ భాగంలో సన్నగా ఉండే ఎయిర్ డ్యామ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ఇది చాలా సింపుల్ డిజైన్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. ఫ్రంట్ బానెట్ పై V-ఆకారంలో ఉండే క్రీజ్ లైన్ కొత్తగా అనిపిస్తుంది. వెనుక వైపు సాదాగా ఉండే రియర్ బంపర్ మరియు అన్ని లైట్లతో కూడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంటాయి.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

ఆల్టో కె10 మొత్తం 11 వేరియంట్‌లలో విడుదల కావచ్చని సమాచారం. వీటిలో 6 వేరియంట్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉండగా మరియు మిగిలిన 5 వేరియంట్‌లు 5-స్పీడ్ ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇంకా ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ స్విచ్‌లు, కీలెస్ ఎంట్రీ సిస్టమ్, ఫోల్డబుల్ రియర్ సీట్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 1.0-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు కొత్త 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మాదిరిగానే ఈ పెద్ద ఆల్టో కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా. మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki alto k10 launch on 18th august 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X