2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో ఈ కొత్త సంవత్సరం తమ వాహనాల ధరలను పెంచినట్లు తెలిపింది. ఇప్పుడు కంపెనీ తమ వాహనాల ధరలను ఇప్పుడు రూ. 8,000 నుంచి రూ. 30,000 వరకు పెంచడం జరిగింది. ఇందులో అత్యల్ప పెరుగుదల టాస్ ఎస్ మోడల్ పైన (రూ. 8,000) పెంచారు. అయితే అత్యధిక ధర రూ. 30,000 కంపెనీ యొక్క వ్యాగన్ ఆర్ మోడల్ పైన పెంచడం జరిగింది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఈ కోవలో ఇప్పుడు మారుతి సుజుకి చేరింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో ధరలను కంపెనీ రూ.12,500 వరకు పెంచింది. అదే సమయంలో మారుతీ సుజుకి బ్రెజ్జా SUV ధరను రూ.14,000, మరియు ఇగ్నిస్, సియాజ్ & మారుతి స్విఫ్ట్ ధరలను రూ. 15,000 పెంచడం జరిగింది. కొత్తగా విడుదల చేసిన సెలెరియో మరియు ఎక్స్ఎల్6 ధరలను రూ. 16,000 వరకు పెంచింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

ఇక మారుతి సుజుకి బాలెనో, ఎర్టిగా మరియు S-క్రాస్ వంటి ప్రముఖ మోడల్‌ ధరలను ఇప్పుడు ఏకంగా రూ. 21,000 వరకు పెరిగాయి. అంతే కాకూండా కంపెనీ యొక్క మారుతి ఎకో ధర కూడా దాదాపు రూ.27,000 వరకు పెరిగింది. ఈ ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

అయితే కంపెనీ అత్యధికంగా మనం చెప్పుకున్నట్లు వ్యాగన్ ఆర్‌కి పెంచింది. ఇప్పుడు వ్యాగన్ ఆర్ ధర రూ. 30,000 పెరిగింది. దేశీయ మార్కెట్లో వాహన తయారీలకు ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగటం వళ్ళ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఇందులో భాగంగానే మారుతీ సుజుకి తక్షణ ప్రభావంతో తన మోడల్స్ ధరలను 4.3 శాతం వరకు పెంచింది. వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను 0.1 శాతం నుండి 4.3 శాతానికి పెంచింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీ గత ఏడాదిలో ధరలను పెంచవలసి వచ్చిందని ఇప్పటికే తెలిసింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

గత నెలలో, కంపెనీ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, OEM యొక్క వ్యయ నిర్మాణంలో దాదాపు 75-80 శాతం వాటా కలిగిన కంపెనీ మెటీరియల్ ధర పెరిగింది. ఈ త్రైమాసికంలో ఉత్పత్తి మెరుగుపడుతుందని కంపెనీ అంచనా వేస్తున్నప్పటికీ, గత కొన్ని నెలలుగా మారుతి సుజుకీ ఉత్పత్తి తక్కువగా ఉంది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

ఉత్పత్తి పరంగా, కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో మెరుగ్గా ఉంది, మారుతి సుజుకి 492,000 యూనిట్ల వాహనాన్ని ఉత్పత్తి చేసింది. ఈ త్రైమాసికంలో 470,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తన విక్రేతలకు తెలిపింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

ఇంతకుముందు చిప్ కొరత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొద్దిగా మెరుగుపడుతోంది. దీని కారణంగా కంపెనీ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కంపెనీ 4,70,000 నుంచి 4,90,000 వాహనాల ఉత్పత్తిని అంచనా వేసింది. కాబట్టి ఇది ఈ దశాబ్దంలో అతిపెద్ద వార్షిక పెరుగుదల కావచ్చు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ విక్రయాలు తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ ఏడాది అమ్మకాలు మెరుగ్గా ఉండవచ్చు. అంతకుముందు 2011 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 4,92,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. అయినప్పటికీ బుకింగ్స్ ఎక్కువగానే పెండింగ్‌లో ఉన్నట్లు నివేదించబడింది ఈ కారణంగా చాలా వాహనాలపై 3 నుంచి 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. పండుగ సీజన్‌లో కంపెనీ గొప్ప రీతిలో బుకింగ్‌లను పొందుతోంది, కానీ ఉత్పత్తి తగ్గుతుండగా, దీని కారణంగా వెయిటింగ్ పీరియడ్ నిరంతరం పెరుగుతోంది.

2022 లో కూడా పెరిగిన Maruti Suzuki ధరలు: పూర్తి వివరాలు

గతేడాది వాహనాల ధరలను మూడుసార్లు పెంచిన కంపెనీ ఇప్పుడు ఏడాది తొలి నెలలోనే వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది కంపెనీలు తమ వాహనాల ధరలను నిరంతరం పెంచడం వల్ల ఇది కస్టమర్లపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కావున ఈ ప్రభావం అమ్మకాలపైన కూడా పడే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti suzuki car price hike model wise details
Story first published: Wednesday, January 19, 2022, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X