మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, దేశీయ విపణిలో అత్యధికంగా విక్రయిస్తున్న కార్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. అయితే, బాలెనో రాకతో స్విఫ్ట్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, మారుతి సుజుకి ఇందులో డీజిల్ వెర్షన్లను కూడా నిలిపివేయడంతో స్విఫ్ట్ వేగానికి బ్రేక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి తమ స్విఫ్ట్ కారుకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, డీజిల్ స్విఫ్ట్ స్థానంలో అధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి వెర్షన్ స్విఫ్ట్ ను విడుదల చేసేందుకు మారుతి సుజుకి ప్రయత్నిస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

మారుతి సుజుకి యొక్క పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ త్వరలోనే సిఎన్‌జి రూపంలో లభ్యం కానుంది. ఓ నివేదిక ప్రకారం, ఇప్పటికే కొందరు మారుతి సుజుకి డీలర్లు స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అనధికారికంగా బుకింగ్ లను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొందరు మారుతి సుజుకి డీలర్లు స్విఫ్ట్ సిఎన్‌జి కోసం రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ తో అనధికారిక బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 కోసం కూడా ఇదే మొత్తంలో బుకింగ్ అడ్వాన్స్ ను కస్టమర్ల నుండి కలెక్ట్ చేస్తున్నారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తున్నప్పటికీ, ఈ మోడల్ ఇప్పటికీ స్థిరమైన నెలవారీ అమ్మకాల గణాంకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క CNG వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో కంపెనీ తమ మార్కెట్ వాటాను మరింత విస్తరించుకోవాలని చూస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో, మారుతి సుజుకి తమ లైనప్ నుండి పూర్తిగా డీజిల్ కార్లను తొలగించిన సంగతి తెలిసినదే. ఇది కంపెనీ అమ్మకాలపై కొంత మేర ప్రభావం చూపినప్పటికీ, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మారుతి సుజుకి తమ లైనప్ లోని అనేక మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను విడుదల చేస్తూ వస్తోంది. ప్రస్తుతం, మారుతి సుజుకి దేశంలోనే అత్యధికంగా సిఎన్‌జి కార్లను విక్రయించే సంస్థగా అగ్రస్థానంలో ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

మారుతి సుజుకి సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను చూసి హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ వంటి కంపెనీలు కూడా సిఎన్‌జి కార్లను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. హ్యుందాయ్ తమ శాంత్రో, గ్రాండ్ ఐ10 మరియు ఆరా కార్లలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లను అందిస్తుండగా, టాటా మోటార్స్ ఇటీవలే తమ టియాగో మరియు టిగోర్ మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొరియన్ కార్ కంపెనీ కియా కూడా తమ సోనెట్ మరియు సెల్టోస్ మోడళ్లలో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

భారత కార్ మార్కెట్లో డీజిల్ కార్ల వినియోగం తగ్గడంతో, పవర్‌తో సంబంధం లేకుండా అధిక మైలేజీని కోరుకునే కస్టమర్లు ఇప్పుడు సిఎన్‌జి కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఇంధనం పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధర కంటే తక్కువకే లభించడమే కాకుండా, వాటితో పోలిస్తే చాలా తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది. అందుకే ఇప్పుడు కస్టమర్లు సిఎన్‌జి కార్ల కోసం పరుగులు తీస్తున్నారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

ఇక మారుతి సుజుకి స్విఫ్ట్ విషయానికి వస్తే, దీని అవుట్‌గోయింగ్ మోడల్ 1.2-లీటర్, డ్యుయల్‌జెట్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారు ఇందులో 5-స్పీడ్ ఆటో గేర్‌షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ (AGS)ని కూడా ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు 23.20 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుండగా, ఆటో గేర్ షిఫ్ట్ యూనిట్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు 23.76 కిలోమీటర్ల మైలేజీని స్తుంది. కాగా, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ తో రాబోయే కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి కేజీకి సుమారు 28-30 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వొచ్చని అంచనా. మారుతి సుజుకి డిజైర్ లో కంపెనీ ఇప్పటికే సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ ను అందిస్తోంది. కాబట్టి, కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి లో కూడా అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

స్విఫ్ట్ డిజైర్ లోని CNG పవర్‌ట్రెయిన్‌ గరిష్టంగా 76 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ పెట్రోల్‌ను ఇంధనంగా ఉపయోగిస్తున్నప్పుడు గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, CNG వేరియంట్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.వస్తుంది. సిఎన్‌జి వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్డ్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మొదలైన మరిన్నో ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లలో ఇటీవలే కొత్త తరం (నాల్గవ తరం) స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరించబడింది. అయితే, ఈ మోడల్ భారత మార్కెట్ ను చేరుకోవాలంటే మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. డిజైన్ పరంగా చూస్తే, నాల్గవ తరం సుజుకి స్విఫ్ట్ దాని డిజైన్‌లో ఫ్లాటర్ బానెట్ మరియు నోస్ సెక్షన్‌తో చాలా పరిణతి చెందినట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఇంటీరియర్ స్పేస్ మరియు హై-స్పీడ్ స్టెబిలిటీని మెరుగుపరచడానికి కంపెనీ దీని వీల్‌బేస్ ను కూడా కొద్దిగా విస్తరించినట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?

ఫీచర్ల పరంగా చూస్తే, నాల్గవ తరం సుజుకి స్విఫ్ట్ కారులో అధునాతమైన కంఫర్ట్ ఫీచర్లు మరియు సరికొత్త సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఇందులో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, రియర్ ఏసి వెంట్‌లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కనెక్టివిటీతో కూడిన 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉంటాయని సమాచారం.

Most Read Articles

English summary
Maruti suzuki dealers accepting unoffcial bookings for swift cng details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X