Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) కారులో కంపెనీ కొన్ని వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేసింది. భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్) తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఆల్టో మరియు ఎస్-ప్రెసో మోడళ్లలో సింగిల్ ఎయిర్‌బ్యాగ్ వేరియంట్‌లను నిలిపివేసింది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు మోడళ్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఆల్టో మరియు మారుతి సుజుకి ఎస్-ప్రెసో లైనప్‌లో ఎంపిక చేసిన వేరియంట్‌లను నిలిపివేసిన తర్వాత, కంపెనీ వీటి ధరలను కూడా సవరించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు, ఆల్టో ప్రారంభ ధర రూ. 3.25 లక్షలు కాగా, ఇప్పుడు ఆల్టో ప్రారంభ ధర రూ. 4.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ వేరియంట్లను నిలిపివేసిన తర్వాత, ఆల్టో ధరలు దాదాపు రూ. 1 లక్ష వరకు పెరిగాయి.

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

ఈ వేరియంట్ల సవరణ తర్వాత ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కేవలం నాలుగు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులొ ఒక సిఎన్‌జి వేరియంట్ కూడా ఉంటుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.4.08 లక్షలు

* మారుతి ఆల్టో విఎక్స్ఐ - రూ.4.28 లక్షలు

* మారుతి ఆల్టో విఎక్స్ఐ ప్లస్ - రూ.4.41 లక్షలు

* మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) సిఎన్‌జి - రూ.5.03 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఏప్రిల్ 21, 202 నాటికి)

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో (Maruti Suzuki S-Presso) విషయానికి వస్తే, ఇందులో సింగిల్ ఎయిర్‌బ్యాగ్ వేరియంట్ నిలిపివేయబడిన తర్వాత, దీని ధరలు ఇప్పుడు రూ. 4 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్-ప్రెసో వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* మారుతి ఎస్-ప్రెసో స్టాండర్డ్ (ఆప్షనల్) - రూ.3.99 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.4.43 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో విఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.4.69 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో విఎక్స్ఐ ప్లస్ - రూ.4.79 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో విఎక్స్ఐ (ఆప్షనల్) ఏజిఎస్ - రూ.5.19 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో విఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ - రూ.5.29 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) సిఎన్‌జి - రూ.5.38 లక్షలు

* మారుతి ఎస్-ప్రెసో విఎక్స్ఐ (ఆప్షనల్) సిఎన్‌జి - రూ.5.64 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఏప్రిల్ 21, 202 నాటికి)

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

ఆల్టోలో ఏయే వేరియంట్‌లు నిలిపివేయబడ్డాయి?

మారుతి సుజుకి ఆల్టో లైనప్‌లో వేరియంట్లను సవరించక మునుపు ఇది మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉండేది. ఇందులో STD, LXI, LXI (O), VXI, VXI+, LXI CNG మరియు LXI (O) CNG వేరియంట్లు ఉండేవి. కానీ, ఇప్పుడు ఇందులో STD, STD (O) మరియు LXI వేరియంట్‌లు నిలిపివేయబడ్డాయి. దీంతో మారుతి సుజుకి పాపులర్ ఆల్టో కారు కేవలం నాలుగు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

ఎస్-ప్రెసోలో ఏయే వేరియంట్‌లు నిలిపివేయబడ్డాయి?

మారుతి సుజుకి ఎస్-ప్రెసోలో నిలిపివేయబడిన వేరియంట్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో STD మరియు LXI వేరియంట్లను నిలిపివేసింది. ఇదివరకు 11 వేరియంట్లలో లభించే ఎస్-ప్రెసో ఇప్పుడు 9 వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త భద్రతా నిబంధనల ప్రకారం, ఇప్పుడు అన్ని కార్లలో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ తో పాటుగా ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కార్లలో ఈ మార్పులు చేసింది.

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

ఈ మార్పు తర్వాత మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని కార్లలో ఇప్పుడు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా లభ్యం కానున్నాయి. మారుతి సుజుకి ఆల్టో 800 సిసి ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 22.05 కిమీ మైలేజీని మరియు సిఎన్‌జి వెర్షన్ కేజీకి 31.59 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, 17.78 సెం.మీ సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Alto మరియు S-Presso మోడళ్లలో కొన్ని వేరియంట్లు డిస్‌కంటిన్యూ.. రూ.1 లక్ష వరకూ పెరిగిన ఆల్టో ధరలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో విషయానికి వస్తే, ఇందులోని 1.0 పెట్రోల్ ఇంజన్ 5500rpm వద్ద 67bhp శక్తిని మరియు 3500rpm వద్ద 90Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిఎన్‌జి వేరియంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులోని పెట్రోల్ వెర్షన్ లీటరుకు 21 కిమీ పైగా మైలేజీనిస్తుంది మరియు సిఎన్‌జి వెర్షన్ కేజీకి 32 కిమీ పైగా మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki discontinued few variants in alto and s presso details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X