ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

భారతీయ మార్కెట్లో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) తన కొత్త 'గ్రాండ్ విటారా' ను రూ. 10.45 లక్షల ప్రారంభ ధర వద్ద అధికారికంగా విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ కొత్త SUV కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. అతి తక్కువ కాలంలోనే గ్రాండ్ విటారా పొందిన బుకింగ్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా కోసం 2022 జులై 20 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం అక్షరాలా 57,000 బుకింగ్స్ పొందగలిగింది. ఇది నిజంగానే గొప్ప విషయం. బుకింగ్స్ ప్రారభించిన అతి తక్కువ కాలంలోనే ఇన్ని బుకింగ్స్ పొందటం కంపెనీ సాధించిన విజయం మరియు కస్టమర్లకు కంపెనీ ఉత్పత్తి మీద ఉన్న నమ్మకమే కారణం అని చెప్పవచ్చు.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

కొత్త గ్రాండ్ విటారా ను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 11,000 ముందస్తుగా చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్ లో కూడా ఎక్కువ భాగం 'స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్' కోసం రావడం గమనార్హం. గ్రాండ్ వితారా మొత్తమ్ ఇప్పుడు 11 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కంపెనీ యొక్క నెక్సా అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే విక్రయించబడతాయి.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

ఇప్పుడు ఈ SUV బుక్ చేసుకున్న కస్టమర్లు త్వరలోనే డెలివరీలను పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు మోనోటోన్ కలర్స్ (నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్), కాగా మిగిలిన మూడు డ్యూయెల్ టోన్ కలర్స్ (ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్). ప్రస్తుతమ్ ఇది ఎక్కువ కలర్ ఆప్సన్స్ లో ఉండటం వల్ల కొనుగోలుదారుడు తమకు నచ్చిన కలర్ కొనుగోలు చేయవచ్చు.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఈ కొత్త SUV పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,795 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహనం వినియోగదారులు లాంగ్ జర్నీలో కూడా ఏ మాత్రం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

కొత్త మారుతి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

ఫీచర్స్ మరియు డిజైన్ పరంగా కూడా గ్రాండ్ విటారా ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంది. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

మారుతి గ్రాండ్ విటారా లో ఇప్పడు ఆధునిక భద్రతా ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి.

ఏందయ్యా ఇది.. అప్పుడే 'గ్రాండ్ విటారా' కు అన్ని బుకింగ్స్ వచ్చేశాయా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే 57,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఈ పండుగ సీజన్ సమయంలో మరిన్ని ఎక్కువ బుకింగ్స్ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara bookings cross 57000 units details
Story first published: Tuesday, September 27, 2022, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X