కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

విడుదలకుముందే అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ పొందుతున్న 'మారుతి సుజుకి గ్రాండ్ విటారా' (Maruti Suzuki Grand Vitara) దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న కస్టమర్ల కోసం కోసం కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త SUV ని ఎప్పుడు విడుదల చేస్తుంది అనే విషయం వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మారుతి గ్రాండ్ విటారా ఈ నెల 26 (సెప్టెంబర్ 26) న అధికారికంగా విడుదల కానుంది. ఈ కొత్త SUV అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఇది అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికీ బుకింగ్స్ స్వీకరించించడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ SUV కోసం కంపెనీ 53,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ఇందులో కూడా దాదాపు 23,000 యూనిట్ల బుకింగ్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ కి వచ్చినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా దాని S-క్రాస్ స్థానంలో వస్తోంది. అయితే ఇది కొత్త డిజైన్ పొందుతుంది, ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. దీనికి సమీపంలోనే 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు మరియు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు బ్రాండ్ యొక్క లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

కొత్త గ్రాండ్ విటారా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్లు మరియు సీట్లు అన్ని కూడా లెదర్ అపోల్స్ట్రే తో ఉన్నాయి. అంతే కాకుండా కలర్డ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 40 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మరియు సుజుకి కనెక్ట్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి గ్రాండ్ వితారా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో కూడిన రియర్ డిస్క్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

మారుతి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లు. ఇందులోని మైల్డ్ హైబ్రిడ్ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

స్ట్రాంగ్ హైబ్రిడ్ విషయానికి వస్తే, ఇది 1.5 లీటర్-4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 91 బిహెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 78 బిహెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గ్రాండ్ విటారా యొక్క అన్ని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లు స్టాండర్డ్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ఐ జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

కొత్త 'గ్రాండ్ విటారా' విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో గ్రాండ్ విటారా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీ ఈ SUV ని ఈ నెలలోనే విడుదల చేయనుంది, కావున ఈ కొత్త SUV పండుగ సీజన్లో తప్పకుండా మరింత మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. గ్రాండ్ విటారా గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara launch date september 26 details
Story first published: Saturday, September 24, 2022, 19:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X