మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

భారతీయ మార్కెట్లో అగ్రగామి వాహన తయారీ సంస్థ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇటీవల ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో కంపెనీ భవిష్యత్తులో తన చిన్నకార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని తెలిపింది. ఇంతకీ కంపెనీ ఎందుకు ఈ ప్రకటన చేసింది, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే మరిన్ని విషయాలు ఇక్కడ చూద్దాం.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 2022 అక్టోబర్ 01 నుంచి తప్పనిసరిగా అన్ని కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులు ఉండాలి. అయితే ఈ నియమానికి దాదాపు అన్ని కంపెనీలు కట్టుబడి ఉన్నాయి. అంతే కాకుండా తమ ఉత్పత్తులను అదే దిశవైపుగా తయారుచేస్తున్నాయి. అయితే దీనిపైన కొన్ని కంపెనీలు అభ్యంతరాలను తెలిపాయి. ఇందులో మారుతి సుజుకి కూడా ఉంది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

దీనిపైన మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్‌సి భార్గవ' మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శల పరంగా చిన్నవాహనాలను 6 ఎయిర్ బ్యాగులతో తీసుకురావడం అంటే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. అయితే ఈ భారం కొనుగోలుదారులపైన కూడా తప్పకుండా పడుతుంది. తద్వారా కంపెనీ యొక్క చిన్న కార్ల అమ్మకాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కంపెనీ నష్టాలను ఎదుర్కోవాల్సిన వస్తుంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ యొక్క చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని అనుకున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న కార్ల కొనుగోలుదారులు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇదే జరిగితే భవిష్యత్ లో మారుతి సుజుకి చిన్నకార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయబడుతుంది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

గతంలో కూడా బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడం వల్ల కంపెనీ తన వాహనాలను బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. ఈ కారణంగా కంపెనీ 2021 లో ఏకంగా 4 సార్లు ధరలు పెంచింది. అదే విధంగా 2022 మరో 3 సార్లు ధరలను పెంచడం జరిగింది. ఈ కారణంగా మారుతి సుజుకి యొక్క ఎంట్రీ లెవల్ కార్లు అన్నీ కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. ఈ కారణంగా దేశంలో అమ్మకాల పరంగా ముందున్న మారుతి సుజుకి తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

ఇప్పుడు మరోసారి ప్రభుత్వం 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి అనే నిబంధన తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఎంట్రీ లెవెల్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించినట్లైతే అమ్మకాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చైర్మన్ తెలిపారు.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

కంపెనీ తన ఎంట్రీ లెవెల్ కార్లలో కూడా 6 ఎయిర్ బ్యాగులను అందించినట్లైతే ధరలు పెరుగుతాయి, కానీ రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారు సంఖ్య తప్పకుండా తగ్గుతుంది. ప్రస్తుతం కంపెనీ చిన్న వాహనాల అమ్మకాల్లోనే మంచి లాభాలను ఆర్జిస్తోంది. అయితే కాంపాక్ట్ వాహనాల అమ్మకాల్లో ఆశించిన స్థాయి అమ్మకాలు లేదు.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మారుతి ఆల్టో మరియు మారుతి ఎస్-ప్రెస్సో వంటి వాహనాలకు సరైన ప్రత్యర్థి లేదు. కావున ఇవి మంచి అమ్మకాల్లో ముందుకు సాగుతున్నాయి. చిన్న కార్లలో 6 ఎయిర్ బ్యాగులు అందించాలి అనే అంశంపైన పునరాలోచన జరపాలని ఇప్పటికే కంపెనీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధన వల్ల అందుబాటు ధరల్లో లభించే కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని, ఇది నేరుగా కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతుందని కార్ల కంపెనీలు తమ భయాలను వ్యక్తం చేశాయి.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ గత కొన్నేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిననప్పటి నుంచి అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటోందని కార్ కంపెనీలు చెబుతున్నాయి. అదే సమయంలో కార్ల తయారీదారులు సెమీకండక్టర్ కొరతను కూడా ఎదుర్కొంటున్నారు. ఇది కార్ల ఉత్పత్తి మరియు విక్రయాలపైన ప్రభావం చూపింది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు తప్పని సరి చేస్తే.. తక్కువ ధర వద్ద లభించే కార్లు ఎక్కువ ధరను పొందుతాయి. ఈ సమయంలో టూ వీలర్ నుంచి కారు కొనాలనుకునే కస్టమర్లు కార్లను కొనే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా ప్రభత్వం తప్పకుండా ఆలోచించాలని కంపెనీ విజ్ఞప్తి చేసింది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

కేంద్ర రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' ఈ సంవత్సరం ప్రారంభంలోనే, 2022 అక్టోబర్ 01 నుంచి కార్లలో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి అని ప్రకటించారు. ఇక అక్టోబర్ నెల రావడానికి ఎన్నో రోజులు లేదు. కావున వాహన తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికుల భద్రత కోసం మరియు రోడ్డు ప్రమాదాలలో మరణించేవారు సంఖ్య తగ్గించడానికి ఈ నిబంధన తీసుకువస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

ప్రస్తుతం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లకు మాత్రమే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో రెండు వైపులా మరియు రెండు కర్టెన్ ఎయిర్ బ్యాగ్‌లతో పాటు రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు చిన్నకార్లలో అదనపు ఎయిర్ బ్యాగులను అందించాలంటే కనీసం రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తం మీద ప్రభుత్వ నియమాలను అనుసరించి కార్లను తయారు చేస్తే చిన్నకార్ల ధరలు మునుపటికంటే కూడా రూ. 1 లక్ష నుంచి రూ. 1.20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది తప్పకుండా కొనుగోలుదారుపైన ప్రభావం చూపుతుంది.

మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో రోడ్డు ప్రమాదంలో మరణించే వారి సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా చిన్న కార్లలో కూడా 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని తెలిపింది. చిన్న కార్లలో 6 ఎయిర్ బ్యాగులు అందిస్తే వాటి ధరలు ఎక్కువవుతాయి, క్రమంగా అమ్మకాలు తగ్గుతాయని మారుతి సుజుకి చెబుతోంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఏమైనా కొత్త నిర్ణయం తీసుకుంటుందా.. లేదా మారుతి సుజుకి ఈ నియమాన్ని పాటిస్తుందా.. లేకుంటే ఆ ఉత్పత్తులు పూర్తగా నిలిపివేస్తుందా అనేది త్వరలోనే స్పష్టంగా తెలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki may discontinue small cars reason details
Story first published: Wednesday, June 29, 2022, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X