బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇటీవల తమ కొత్త 2022 బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడంతో పాటుగా కొత్త గ్రాండ్ విటారా అనే మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ రెండు మోడళ్లు కలిసి దాదాపు 1.5 లక్షలకు పైగా బుకింగ్‌లను కలిగి ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

గడచిన జూన్ నెలాఖరులో మారుతి సుజుకి తమ అప్‌డేటెడ్ 2022 బ్రెజ్జా ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి కన్నా మరిన్ని ఫీచర్లు మరియు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో రావడంతో కస్టమర్లు ఈ ఎస్‌యూవీని కొనేందుకు బారులు తీరుతున్నారు.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

కొత్త బ్రెజ్జా మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు నెలల్లో 1.06 లక్షల యూనిట్ల బుకింగ్‌లను పొందింది. అలాగే, ఇంకా ధర కూడా తెలియని గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం 55,000 యూనిట్లకు పైగా వచ్చాయి.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

గ్రాండ్ విటారా రాక ముందు వరకూ మారుతి సుజుకి ఎస్‌యూవీ విభాగంలో ఒకే ఒక్క మోడల్ (బ్రెజ్జా) మాత్రమే ఉండేది. అయితే, విటారా రాకతో మారుతి ఫేటే మారిపోయింది. ఇప్పటి వరకూ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఎస్‌యూవీలకు పోటీగా మారుతి సుజుకి నుండి ఎలాంటి బలమైన ఉత్పత్తి అందుబాటులో ఉండేది కాదు. కానీ గ్రాండ్ విటారా ఇప్పుడు ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ మరియు అత్యధిక మైలేజీతో రావడంతో, కస్టమర్లు దీని ధర తెలియనప్పటికీ ముందుగా బుకింగ్ చేసుకునేందుకు వెనుకాడటం లేదు.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

కొత్త మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా ఇప్పుడు ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా మారింది. ఈ కొత్త మోడల్ రాకతో ఆగస్ట్ 2022 నెల అమ్మకాలలో మారుతి సుజుకి బ్రెజ్జా ఈ విభాగంలో అత్యధికంగా విక్రయించబడే టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ క్రెటా మోడళ్లను ఓవర్‌టేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.96 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా దాని మునుపటి అదే గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారైంది. కాబట్టి, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ పాత మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే, ఇది కొత్త బాడీ ప్యానల్స్ మరియు కొత్త ఇంటీరియర్ లను పొందుతుంది. కారు ముందు భాగంలో ఫ్లాట్-లుకింగ్ క్లామ్‌షెల్ బానెట్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు గన్‌మెటల్ షేడ్‌లో ఫినిష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్‌ ఉంటాయి. సైడ్స్‌లో కొత్త డిజైన్‌తో కూడిన 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ మరియు వెనుక వైపు అప్‌డేట్ చేయబడిన టెయిల్ గేట్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్‌ను కలిగి ఉంటుంది.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

ఈ కొత్త మోడల్ బ్రెజ్జాలో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్, డ్యాష్‌బోర్డ్ మరియు డోర్‌ ట్రిమ్‌లపై ఉండే సిల్వర్ యాక్సెంట్స్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, వాయిస్ కమాండ్ సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, యూఎస్‌బి టైప్-సి రియర్ ఛార్జింగ్ పోర్ట్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

ఇంజన్ పరంగా కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులోని అధునాతన 1.5-లీటర్, కె15సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 హెచ్‌పి పవర్ ను మరియు 137 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, మారుతి సుజుకి బ్రెజ్జా మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20.15 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 19.80 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

గ్రాండ్‌గా వస్తున్న మారుతి గ్రాండ్ విటారా..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా విషయానికి వస్తే, కంపెనీ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తమ జపనీస్ భాగస్వామి టొయోటా సహకారంతో అభివృద్ధి చేసింది. వాస్తవానికి, ఈ కారును కర్ణాటకలో ఉన్న టొయోటా ఫ్యాక్టరీలోనే తయారు చేయనున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు రకాల పవర్‌ట్రైన్ (మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్) ఆప్షన్లతో, మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఓ నివేదిక ప్రకారం, మార్కెట్లో గ్రాండ్ విటారా ధరలు రూ. 9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

గ్రాండ్ విటారా ఎంట్రీ లెవల్ వేరియంట్లలో కంపెనీ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ను ఉపయోగించనుంది. ఇందులోని 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 101 బిహెచ్‌పి శక్తిని మరియు 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ యూనిట్.

బ్రెజ్జా, గ్రాండ్ విటారాల కోసం 1.50 యూనిట్ల బుకింగ్స్.. ఇవన్నీ ఎప్పుడు డెలివరీ అవుతాయో..?

ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆన్-బోర్డ్ ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి పనిచేస్తుంది. మొత్తంగా ఈ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ 114.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారాలో లభిస్తున్న ఇతర మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ మాదిరిగా కాకుండా ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మంచి పవర్ డెలివరీ కోసం eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తుంది. ఫలితంగా, ఇది లీటరుకు గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Maruti suzuki new brezza and grand vitara bags over 1 5 lakh unit bookings togeather
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X