మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' ఇటీవల తన కొత్త 'గ్రాండ్ విటారా' (Grand Vitara) ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ SUV ని మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే ఈ పండుగ సీజన్ లో డెలివరీలను కూడా మొదలెట్టేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

మారుతి సుజుకి గతంలో చెప్పిన విధంగానే పండుగ సీజన్ లో డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే డెలివరీలు మరింత వేగవతమవుతాయని, ఈ పండుగ సమయంలో కస్టమర్లు తమ కొత్త డెలివరీ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కాగా టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. ఇప్పటికే ఈ SUV కోసం ఏకంగా 57,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ తెలిపింది.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా మొత్తం ఇప్పుడు 11 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో కూడా 'నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్' అనే ఆరు సింగిల్ టోన్ కలర్స్ మరియు 'ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్' అనే డ్యూయెల్ టోన్ కలర్స్.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన డిజైన్ దాని ఫ్రంట్ స్టైలింగ్. దీని ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ SUV పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,795 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహనం వినియోగదారులు లాంగ్ జర్నీలో కూడా ఏ మాత్రం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

కొత్త మారుతి గ్రాండ్ విటారా 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

కొత్త మారుతి గ్రాండ్ విటారా భద్రత పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా డెలివరీలు స్టార్ట్.. పండుగలో ఇంటికి రానున్న కొత్త అతిధి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి అనుకున్నట్లుగానే తన కస్టమర్లను కొత్త గ్రాండ్ విటారా డెలివరీ చేయడం గొప్ప విషయం. ఈ SUV అద్భుతమైన ఫీచర్స్, ఆకర్షణీయమైన మైల్జ్ అందించడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ లేటెస్ట్ SUV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Image Courtesy: Rinku Jain And Nexa MP Nagar - Rajrup Motors

Most Read Articles

English summary
Maruti suzuki new grand vitara suv deliveries begin in india
Story first published: Saturday, October 1, 2022, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X