కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

ఈ దసరా పండుగకి కొత్త మారుతి కారు కొనాలని చూస్తున్నారు. అయితే, మీ పంట పండినట్లే. ప్రస్తుత పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు మారుతి సుజుకి తమ కార్లపై భారీ తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ప్రత్యేకించి, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన తమ కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 పై రూ.25,000 నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

మార్కెట్లో కొత్తగా ప్రారంభించబడిన మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ పై కంపెనీ రూ. 25,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, చిన్న వెర్షన్ అయిన మారుతి సుజుకి ఆల్టో 800 మోడల్ పై రూ. 29,000 వరకు ప్రయోజనాలను అందిస్తుండగా, టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ గా పేరు గాంచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, మారుతి సుజుకి సెలెరియో మరియు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వంటి మోడల్‌లపై రూ. 59,000 వరకు మరింత మెరుగైన ప్రయోజనాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

భారతదేశంలో సురక్షితమైన కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఆల్టో 800 నెమ్మదిగా మార్కెట్ నుండి తొలగించాలని చూస్తోంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్టో బ్యాడ్జ్‌ని మరికొంత కాలం ముందుకు తీసుకువెళ్ల లక్ష్యంలో భాగంగా మారుతి సుజుకి కొత్త ఆల్టో కె10 ను ప్రవేశపెట్టింది. ఆల్టో కె10 పాత ప్రస్తుతం ఆల్టో 800 కన్నా పెద్ద ఇంజన్‌ను కలిగి ఉండటమే కాకుండా, పరిమాణంలో కూడా పెద్దగా ఉంటుంది. మెరుగైన డిజైన్, విశాలమైన క్యాబిన్ మరియు అత్యుత్తుమ ఫీచర్లతో కంపెనీ ఈ కారును రూపొందించింది.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

కొత్తగా ప్రారంభించబడిన మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్‌ అనే 6 విభిన్న రంగులలో అందుబాటులో ఉంది. ఇది Std, LXi, VXi, VXi+, VXi (AMT), మరియు VXi+ (AMT) అనే ఆరు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్తగా ప్రారంభించబడిన 2022 మారుతి సుజుకి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

మారుతి సుజుకి ఆల్టో కె10లోని ఈ లేటెస్ట్ ఇంజన్ గరిష్టంగా 5,500ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. కొత్త 2022 మోడల్ ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ఇంజన్ చాలా ఇంధన సమర్థవంతమైనది. ఇందులోని మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిమీ మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

మొదటిసారిగా కొత్త కారును కొనుగోలు చేసే వారికి ఆల్టో కె10 ఓ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. నమ్మకమైన బ్రాండ్, తక్కువ మెయింటినెన్స్ ఖర్చు మరియు మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఆల్టో కె10 ను కొనేందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ కారు డిజైన్‌ను గమనిస్తే, ముందు భాగంలో పెద్ద గ్రిల్‌ మరియు దానిపై అమర్చిన సుజుకి బ్యాడ్జ్‌, బానెట్ అంచులకు దిగువన ఉన్న కొత్త ర్యాప్అరౌండ్ హాలోజన్ హెడ్‌లైట్‌లు, చెక్కినట్లుగా ఉండే ఫ్రంట్ బంపర్ మరియు దాని దిగువ భాగంలో ఉండే సన్నటి సెంట్రల్ ఇన్‌టేక్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, ఇది అవసరమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ చిన్న కారులో అధునాతనమైన ఫీచర్లను కంపెనీ జోడించింది. ఆల్టో కె10లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ స్విచ్‌లు, 4-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, కీలెస్ ఎంట్రీ సిస్టమ్, ఫోల్డబుల్ రియర్ సీట్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 కారును కంపెనీ యొక్క అధునాతన మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన కార్లు ధృడంగా ఉంటాయని నిరూపించబడ్డాయి. ప్రస్తుత మారుతి సుజుకి ఆల్టో 800 హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 85 మిమీ ఎక్కువ పొడవు, 45 మిమీ ఎక్కువ ఎత్తు మరియు 20 మిమీ ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఆల్టో కె10పై రూ.25,000 వరకూ డిస్కౌంట్..! ఇతర కార్లపై కూడా తగ్గింపులు..

ఇక చివరిగా ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో కె10 ధరలు బేస్ 'STD' వేరియంట్ కోసం రూ. 3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి మొదలవుతాయి. కాగా టాప్-ఎండ్ 'VXi' వేరియంట్ ధర రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది, ఈ వేరియంట్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. కస్టమర్లు తమ ఆల్టో కె10 కారును తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవడం కోసం కంపెనీ వివిధ రకాల యాక్ససరీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. - ఆల్టో కె10 పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti suzuki offers upto rs 25000 cash benifits on alto k10 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X