ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

కారు అనేది కేవలం ధనికులకు మాత్రమే కాదు, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (అప్పట్లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్) తయారు చేసిన తొలి మోడల్ మారుతి 800 (Maruti 800).

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

మనదేశంలో అంబాసిడర్ ఎంత పాపులర్ అయిందో మారుతి 800 కూడా అంత కన్నా ఎక్కువ పాపులర్ అయింది. చిన్న కుటుంబాల నుండి సెలబ్రిటీల వరకూ అందరి ప్రయాణ అవసరాలు తీర్చిన కారు మారుతి 800.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

మారుతి 800 కారును మొదటిసారిగా 1983లో మార్కెట్లో విడుదల చేశారు. అయితే, మారుతున్న కాలంతో పాటే కొనుగోలుదారుల అభిరుచి మారడం మరియు మార్కెట్లో అనేక ఆధునిక ఉత్పత్తులు రావడంతో ఈ చిన్న కారును ఆదరించేవారు కరువైపోయారు. దానికితోడు, కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో, మారుతి సుజుకి ఈ చిన్న కారును 2014 సంవత్సరంలో పూర్తిగా నిలిపివేసింది. మారుతి 800 కారు ఈ 31 ఏళ్ల కాలంలో దాదాపు 25 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది మరియు వారి కుటుంబాల్లో సంతోషాలను నింపింది.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

మారుతి నుండి వచ్చిన ఈ మొట్టమొదటి కారు తయారీ, అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ కారు సజీవంగానే ఉంది. చాలా మంది కొనుగోలుదారులు ఈ కారును తమ మొదటి ఛాయిస్‌గా ఎన్నుకునే వారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఎంతో అపరూపంగా చూసుకుంటున్నారు. మారుతి 800 కారు ఈ 3 దశాబ్ధాల కాలంలో డిజైన్ పరంగా ఎన్నో మార్పులు పొందినప్పటికీ, ఇంజన్ మరియు కాలుష్య నిబంధనల పరంగా మాత్రం అప్‌గ్రేడ్ కానందున ఇది మార్కెట్ నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దీని స్థానాన్ని కొత్త ఆల్టో 800 భర్తీ చేసింది.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

సరే అదంతా అటుంచితే.. తాజాగా మారుతి కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ఎమ్ 800 కారు మరోసారి వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే.. మారుతి సుజుకి తమ ఎమ్800 కోసం మొదటిసారిగా ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించినప్పుడు, కొనుగోలుదారుల నుంచి వందల సంఖ్యలో ధరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా ద్వారా మొదటి ఓనర్‌ను ఎంచుకున్నారు. ఇలా తీసిన లక్కీ డ్రాలో హర్‌ పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి పేరు వచ్చింది. ఇతనికి 1983, డిసెంబర్‌ 14వ తేదీన అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా తొలి మారుతి 800 కారు తాళం చెవులను అందజేశారు.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

అయితే, ఇప్పుడు అదే మొట్టమొదటి మారుతి 800 కారును తిరిగి పూర్తిగా సరికొత్తగా రీస్టోర్ చేశారు. అంటే, ప్రస్తుతం ఈ తొలి ఎమ్ 800 కారు వయస్సు దాదాపు 40 ఏళ్లు. ఈ మొదటి మారుతి కారును కొనుగోలు చేసిన హర్‌ పాల్‌ 2010లో కాలం చేయగా, ఆయన సతీమణి 2012లో కాలం చేశారు. దీంతో మొన్నటి వరకూ ఆ కారు హర్ పాల్ సింగ్ ఇంటి ఎదుటే సిధిలావస్థలో పడి ఉండేది. అయితే, ఇది మొట్టమొదటి మారుతి 800 కారు కావటంతో, ఆ కారును కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

ఈ మొట్టమొదటి మారుతి 800 కారును సొంతం చేసుకోవాలని క్యూ కట్టిన వారిలో మళయాళం సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ క్విజ్‌ మాస్టర్‌ డిరెక్‌ ఓ బ్రియన్‌, మనేసర్‌ హెరిటేజ్‌ ట్రాన్స్‌పో‌ర్ట్ మ్యూజియం చివరికి మారుతి సుజుకి సంస్థ కూడా ఉంది. అయితే, ఎట్టకేలకు మారుతి సుజుకి సంస్థనే ఈ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొట్టమొదటి మారుతి 800 కారును ఫ్యాక్టరీ నుండి తొలిసారిగా ఎలా బయటకు తీసుకువచ్చారో అలానే కంపెనీ రీస్టోర్ చేసింది.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

మారుతి సుజుకి ఈ మొట్టమొదటి 800 కారులో ఎలాంటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేయలేదు. కాకపోతే, తుప్పుపట్టిన భాగాల స్థానంలో కొత్త భాగాలను ఉపయోగించడం మరియు పాడైన ఇంజన్‌ను తిరిగి రన్నింగ్ కండిషన్‌లోకి తీసుకురావడం చేసింది. మొదటిసారిగా హర్‌పాల్ సింగ్ డెలివరీ తీసుకున్నప్పుడు ఈ కారు ఎలాగైతే కొత్తగా ఉందో, ఇప్పుడు రీస్టోర్ చేయబడిన తర్వాత కూడా అంతే కొత్తగా ఉంది. హర్ పాల్ సింగ్ కొనుగోలు చేసిన ఈ కారుపై DIA 6479 అనే రిజిస్టర్డ్ నెంబర్ ప్లేట్ ఉండటాన్ని మనం పాత ఫొటోలలో చూడొచ్చు. అలాగే, రీస్టోర్ చేసిన తర్వాత కూడా ఆ కారుపై అదే నెంబర్ ప్లేట్ ఉండటాన్ని చూడొచ్చు.

ఇది భారతదేశపు మొట్టమొదటి మారుతి 800 కారు.. తిరిగి కొత్తగా జీవం పోసుకుంది..!

సరసమైన ధరతో భారత కార్ మార్కట్‌ను శాసించిన కారు మారుతి 800. హర్యానా రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన మారుతి ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తిని చేపట్టారు. ఇప్పుడు ఈ కారును తిరిగి మారుతి సుజుకి సంస్థే పూర్తిగా పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ధృవీకరించేందు మారుతి సుజుకి కొత్తగా మార్చబడిన మొదటి మారుతి 800 కారు చిత్రాలను విడుదల చేసింది. కంపెనీ ఈ చిన్న కారులో 3 సిలిండర్లతో కూడిన కార్బ్యురేటెడ్ 796 సిసి ఇంజన్‌మను ఉపయోగించేది. ఈ ఇంజన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో విడుదల చేయబడింది. మారుతి 800 చాలా సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది. స్టైల్, పనితీరు, విశ్వసనీయత, తక్కువ నిర్వహణ వ్యయం మరియు అధిక మైలేజీ వంటి కారణాలతో ఈ కారు భారతీయులలో మంచి ఆదరణ పొందింది.

Most Read Articles

English summary
Maruti suzuki restored india s first maruti 800 car photos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X