గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్ రోజురోజుకి వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎస్‌యువిలకు ప్రజాదరణ అమితంగా పెరుగుతోంది. ఇందులో కాంపాక్ట్ ఎస్‌యువిలు, మైక్రో ఎస్‌యువిలు మరియు సబ్-కాంపాక్ట్ ఎస్‌యువిలు వంటివి ఉన్నాయి. ఎస్‌యువిలకు డిమాండ్ ఎంత వున్నా.. చిన్నకార్లకున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ చిన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

ఈ చిన్న కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి 'మారుతి సుజుకి' (Maruti Suzuki). దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి ఇండియా మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షించడానికి 'మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో' (Maruti Suzuki S-Presso) ను మైక్రో ఎస్‌యువిగా పరిచయం చేసింది. ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో విక్రయించబడినప్పటికీ, చూడటానికి ఒక మైక్రో ఎస్‌యువి మాదిరిగానే ఉంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

మారుతి సుజుకి అమ్మకాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ, భద్రతా విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ యొక్క చిన్న కార్లలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ లేకపోవడమే. ఇందులో 'మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో' కూడా ఉంది. ఇది వరకు నిర్వహించిన గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 'మారుతి ఎస్-ప్రెస్సో' ఆశించిన స్థాయిలో భద్రతా ఫీచర్స్ పొందలేదని నిర్దారించబడింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

అయితే ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో మెరుగైన పనితీరును కనబరిచి ఉత్తమ ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ కారును గ్లోబల్ ఎన్‌సిఎపి తన 'సేఫ్ కార్స్ ఫర్ ఆఫ్రికా ప్రోగ్రామ్' కింద క్రాష్ టెస్ట్ చేయబడింది. కంపెనీ ఈ ఎస్-ప్రెస్సోను భారతీయ మార్కెట్ నుంచి ఆఫ్రికన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది అంతే కాకూండా అక్కడ కూడా ఈ కారుకు క్రాష్ టెస్ట్ చేయబడుతుంది. ఈ క్రాష్ టెస్ట్ లో కంపెనీ యొక్క ఈ కారు ఇప్పుడు 3 స్టార్ రేటింగ్ కైవసం చేసుకోగలిగింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

నివేదికల ప్రకారం, గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 'సుజుకి ఎస్-ప్రెస్సో' అడల్ట్ సేఫ్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ మరియు పిల్లల సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తం మీద ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందకపోయినా 3 స్టార్ రేటింగ్ పొంది మునుపటికంటే కూడా ఉత్తమమైన స్కోర్ చేసింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

ఇప్పటికే 2020 నవంబర్ లో గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోకు మొదటిసారి క్రాష్ టెస్ట్ చేయబడింది. ఆ సమయంలో కేవలం ఇది భారతీయ మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంది. క్రాష్ టెస్ట్ లో ఇది అడల్ట్ సేఫ్టీ మరియు పిల్లల సేఫ్టీలో 0 స్టార్ రేటింగ్ పొంది సురక్షితమైన వాహనం కాదని నిర్దారించబడింది. ఆ సమయంలో ఇందులో కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాత్రమే ఉంది. అంతే కాకుండా ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగా లేదు. ఈ కారణంగా 2020 లో నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఇది 0 రేటింగ్ పొందింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రకారం, ఇది అప్పట్లో సురక్షితం కాదని తెలిసిన తరువాత మళ్ళీ టెస్ట్ చేయడానికి సంకల్పించారు. 2020 తరువాత మళ్ళీ కంపెనీ ఇందులో కనీస భద్రతా ఫీచర్స్ అందించడానికి సన్నాహాలు చేసింది. ఈ కారణంగానే ఇప్పుడు క్రాష్ టెస్ట్ లో 3 స్టార్ రేటింగ్ పొదగలిగింది. ఇది ఇప్పుడు ప్రయాణికులకు మంచి రక్షణ అందిస్తుందని నిర్దారించబడింది.

చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్న మారుతి సుజుకి:

ఇదిలా ఉండగా మారుతి సుజుకి భవిష్యత్తులో తన చిన్నకార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని ఒక సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 2022 అక్టోబర్ 01 నుంచి తప్పనిసరిగా అన్ని కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులు ఉండాలి. అయితే ఈ నియమానికి దాదాపు అన్ని కంపెనీలు కట్టుబడి ఉన్నాయి. అంతే కాకుండా తమ ఉత్పత్తులను అదే దిశవైపుగా తయారుచేస్తున్నాయి. అయితే దీనిపైన కొన్ని కంపెనీలు అభ్యంతరాలను తెలిపాయి. ఇందులో మారుతి సుజుకి కూడా ఉంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ పొందిన 'మారుతి ఎస్-ప్రెస్సో': ఇక తిరుగులేదుగా..!!

దీనిపైన మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్‌సి భార్గవ' మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శల పరంగా చిన్నవాహనాలను 6 ఎయిర్ బ్యాగులతో తీసుకురావడం అంటే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. అయితే ఈ భారం కొనుగోలుదారులపైన కూడా తప్పకుండా పడుతుంది. తద్వారా కంపెనీ యొక్క చిన్న కార్ల అమ్మకాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కంపెనీ నష్టాలను ఎదుర్కోవాల్సిన వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ యొక్క చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని అనుకున్నట్లు ప్రకటించారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti suzuki s presso gets 3 safety star in global ncap crash test
Story first published: Thursday, June 30, 2022, 12:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X