కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) గడచిన నెలలో తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా, ఎక్స్ఎల్6 మోడళ్లతో పాటుగా అంతకు ముందు కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కారును మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయినప్పటికీ, ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో వృద్ధి సాధించలేదు. మారుతి సుజుకి ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 1,21,995 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో (ఏప్రిల్ 2021)లో విక్రయించిన 1,35,879 యూనిట్లతో పోలిస్తే, ఇవి 10 శాతం క్షీణించాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

ఏప్రిల్ 2022తో పోలిస్తే, ఏప్రిల్ 2021లో కార్ల ధరలు మరియు ఇంధన ధరలు ఇప్పటి కన్నా తక్కువగా ఉండటంతో, ఆ నెలలో మారుతి సుజుకి మొత్తం 1,35,879 యూనిట్లను విక్రయించగలిగింది. కాగా, ఇటీవలి కాలంలో పెరిగిన పెట్రోల్ ధరలు మరియు వాహనాల ధరల కారణంగా, గత నెలలో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కంపెనీ 1,21,995 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ 2021 తో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 13,884 యూనిట్ల అమ్మకాలు తగ్గాయి. అంటే, ఇవి 10.22 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

మారుతి సుజుకి యొక్క వార్షిక అమ్మకాలు మాత్రమే కాదు, నెలవారీ అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మార్చి 2022తో పోలిస్తే ఏప్రిల్ 2022లో కంపెనీ అమ్మకాలు బాగా క్షీణించాయి. అంతకు ముందు నెల (మార్చి 2022)లో మారుతి సుజుకి భారత మార్కెట్లో 1,33,861 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా, ఏప్రిల్ 2022 నెలలో మారుతి అమ్మకాలు 11,866 యూనిట్లు తగ్గి 1,21,995 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో మారుతి సుజుకి నెలవారీ అమ్మకాలు 8.86 శాతం క్షీణించాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!
Maruti Sales Apr-22 Sales Vs Difference Growth (%)
Apr-22 1,21,995 Apr-21 (YoY) -13,884 -10.22
Apr-21 1,35,879 Mar-22 (MoM) -11,866 -8.86
Mar-22 1,33,861

గత నెలలో మారుతి సుజుకి యొక్క మినీ మరియు కాంపాక్ట్ సెగ్మెంట్ విక్రయాలు బారీగా క్షీణించాయి. ఏప్రిల్ 2021 లో కంపెనీ ఈ విభాగంలో విక్రయించిన 97,359 యూనిట్ల కార్లతో పోలిస్తే గత నెలలో (ఏప్రిల్ 2022లో) ఇవి 76,321 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో మినీ మరియు కాంపాక్ట్ సెగ్మెంట్ విక్రయాలు 21,038 యూనిట్లు తగ్గి, 21.6 శాతం క్షీణతను నమోదు చేశాయి. మినీ సెగ్మెంట్ (ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో) అమ్మకాలు ఏప్రిల్ 2021 నెల అమ్మకాలు 25,041 యూనిట్లుగా ఉంటే, అవి గత నెలలో 17,137 యూనిట్లకు పడిపోయి, 7,904 యూనిట్ల క్షీణత (31.56 శాతం తగ్గుదల)ను నమోదు చేశాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

కాంపాక్ట్ సెగ్మెంట్ (సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో, డిజైర్ మరియు టూర్ ఎస్) అమ్మకాలు కూడా తగ్గాయి. ఏప్రిల్ 2021 నెలలో ఈ విభాగపు అమ్మకాలు 72,318 యూనిట్లుగా ఉంటే, అవి ఏప్రిల్ 2022 నెలలో 59,184 యూనిట్లకు తగ్గాయి. ఈ సమయంలో అమ్మకాలు 13,134 క్షీణతన (18.16 శాతం తగ్గుదల)ను నమోదు చేశాయి. మారుతి అందిస్తున్న ఏకైక మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాల విషయానికి వస్తే, ఏప్రిల్ 2022లో ఇవి కేవలం 579 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా, ఏప్రిల్ 2021 నెలలో సియాజ్ అమ్మకాలు 1,567 సియాజ్ యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు 998 యూనిట్లు (63.68 శాతం) తగ్గాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

యుటిలిటీ వెహికల్స్ మరియు వాన్ విభాగాల్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, బ్రెజ్జా, ఎస్-క్రాస్ మరియు ఈకో మోడళ్లను విక్రయిస్తోంది. ఈ విభాగం మాత్రం స్వల్ప వృద్ధిని కనబరించింది. భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, మారుతి సుజుకి గడచిన ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 36,953 యూనిట్ల యుటిలిటీ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (ఏప్రిల్ 2021) విక్రయించిన 28,811 యూనిట్లతో పోలిస్తే, ఇవి 18 శాతం వృద్ధి చెందాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

లైట్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న సూపర్ క్యారీ అమ్మకాలు కూడా మంచి వృద్ధిని కనబరచాయి. గత నెలలో ఈ మోడల్ అమ్మకాల సంఖ్యలను దాదాపు మూడు రెట్లు పెరిగింది. మారుతి సుజుకి సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ అమ్మకాలు ఏప్రిల్ 2021లో 1,272 యూనిట్లుగా ఉంటే, అవి ఏప్రిల్ 2022లో 4,266 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో సూపర్ క్యారీ అమ్మకాలు 335.37 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

కొత్త మోడళ్లు వచ్చినా పెరగని మారుతి సుజుకి సేల్స్.. ఏప్రిల్ 2022లో 10 శాతం ఢమాల్..!

మారుతి సుజుకి తయారు చేసిన వాహనాలను టొయోటాకు కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇతర OEMలకు (గ్లాంజా మరియు అర్బన్ క్రూయిజర్‌తో టయోటా) మారుతి యొక్క ఎగుమతులు కూడా వార్షిక అమ్మకాల్లో పెరుగుదలను చూశాయి. ఏప్రిల్ 2022లో, మారుతి సుజుకి, టయోటాకు 5,987 యూనిట్లను రవాణా చేసింది, గత ఏడాది ఇదే నెలలో 5,303 యూనిట్లను మాత్రమే అందించింది. ఈ సమయంలో ఇవి 11.42 శాతం పెరిగాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, గతేడాదితో పోలిస్తే ఇవి 6.38 శాతం పెరిగాయి. ఏప్రిల్ 2022లో, మారుతి 18,413 యూనిట్లను ఎగుమతి చేయగా, ఏప్రిల్ 2021 లో 17,237 యూనిట్లను ఎగుమతి చేసింది.

Most Read Articles

English summary
Maruti suzuki sales declined by 10 percent in april 2022 detailed sales report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X